Home » Sathyambabu Ayeshameera Nyaya Porata Committee » “సత్యాన్ని” కాపాడుకుందాం! సత్యబాబు ని రక్షించుకుందాం!!, బాదితులైనా! నిందితులైనా!! దళితులకేనా శిక్షలు ?

“సత్యాన్ని” కాపాడుకుందాం! సత్యబాబు ని రక్షించుకుందాం!!, బాదితులైనా! నిందితులైనా!! దళితులకేనా శిక్షలు ?

Start here

Advertisements


మాములుగ అయెతే డబ్బు, రాజకీయ పలుకుబడి, ఉన్న అగ్ర కులాలు అగ్ర వర్గాలు చాల రకాల నేరాలు చేసి సునాయాసంగా తప్పించుకునే వెసులుబాటు అవకాశం మన న్యాయ వ్యవస్థలో మరియు పొలిసు వ్యవస్థలో పకడ్బందిగా పొందిపర్చబడి ఉంది, అయెతే ఇపుడు వారు నేరాలు చేసి తప్పించుకోవడమే కాదు వారు తప్పించు కోవడానికి పేదలని దళితులను బలి చేయడమనే ఒక పద్ధతి మొదలైంది కానీ అది సత్యంబబుని అయేషామీర హత్యా కేసులో పోలిసులు ఇరికించడం మరియు కోర్టు శిక్షించడం చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నివ్వెర పోయి, పొలిసు  న్యాయ వ్యవస్థపై అంతంతగా ఉన్న నమ్మకాలూ వాడులుకోవల్చిన పరిస్థితి వచ్చింది

డిసెంబర్ ఇరువై ఏడు, రెండువేల ఏడు రోజున ఇబ్రహీం పట్నం లోని ఒక ప్రైవేటు  హాస్టల్  రెండవ అంతస్తు లో అయేషా మీరా హత్యా జరిగింది, రెండవ అంతస్తుకు వెళ్ళడానికి ఉన్నది ఒకే దారీ, అది మెయిన్ గేటు నుండి వెళ్ళడం, అల వెళ్ళాలంటే వార్డెన్ ఐ పద్మ ఆమె బర్త కు మరియు , వాచ్మెన్ కు తెలియకుండా ఎవరు వెళ్ళే అవకాశం లేదు, అలాగే ఫెన్సింగ్ చేసి ఉండడం వాళ్ళ గోడ మీదినుండి దూకి వెళ్ళే అవకాశం కూడా లేదు

ఈ సంగటన స్థలాన్ని సందర్శించిన మైనారిటీ కమిసన్ చైర్మన్ యూసఫ్ కుర్రెసి మరియు నేషనల్ వుమన్  కమిసన్  సబ్యులు నిర్మల వెంకటేషన్ కూడా “వార్డెన్,  వాచ్మన్ లకు తెలియకుండా అయేషామీరా హత్యా జరిగి ఉండదని అభిప్రాయ పడ్డారు, అలాగే వార్డెన్ ఐ పద్మ కు ఆమె బర్త కు మరియు లోకల్  MPP   మాధవ రావు(ఇతను పోలిసులకంటే ముందే అంటే ఉదయం ఆరు గంటలకు అయేషామీర హత్యా జరిగిన ప్రదేహ్సం లో ఉన్నాడు) కు నార్కో అనాలసిస్ చేయించాలని నిర్మల వెంకటేషన్ అభిప్రాయపడ్డారు, స్థానికంగా  ఉన్న ప్రజలందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు,

డిసెంబర్ లో జరిగిన ఈ హత్యా పై పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించాక పోవడం అనేక అనుమానాలకు తావు ఇచింది, రాజకీయ జోక్యం వల్లనే ఈ కేసు ఆలస్యం జరగుతుందని అది కూడా ఇటీవల చనిపోయిన  మాజీ మున్సిపల్   శాక మంత్రి కోనేరు రంగ రావు కుటుంబం జోక్యం వల్లనే అని, అతని మనవడు అయిన కోనేరు సతీష్ బాబు (సర్పంచ్, గూడవల్లి గ్రామం) ఈ కేసు లో ప్రధాన నిందితుడని అనేక ఆందోళనలు జరిగాయి

హత్యా జరిగిన నాల్గు నెలల తర్వాత మర్చి(రెండువేల ఎనిమినిది) లో  గుర్విందర్ సింగ్ అలిఅస్ లడ్డు అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు, అప్పటి హోం శాక మంతి జానారెడ్డి గారు విజయవాడ వెళ్లి ” అయేషా మీరా హత్యా కేసు చేదించమని నిన్దితుడిపి పట్టుకున్నామని” ప్రకంటించారు, కానీ అయేషామీర తల్లి తండ్రి, స్థానికులు, ముస్లిం సంగాలు, మహిళా సంగాలు గుర్విందర్ సింగ్ ని అరెస్ట్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ” అసలు నిందుతులను కాపాడేందుకే పోలీసులు గుర్విందర్ సింగ్ అలిఅస్ లడ్డు  ని అరెస్ట్ చేసారని” యాబై మందిని ప్రశ్నించి  పన్నెండు మందికి రక రక ల పరిక్షలు చేసి అసలు దోషులను పోలీసులు గుర్తించలేక పోయారని అనేక ప్రజా సంగాలు ఆందోళనలు నిర్వహించాయి, దీనితో ఈ కేసు రాష్ట్ర వ్యప్తగా సంచలనం సృష్టించింది
గుర్విందర్ సింగ్ అలిఅస్ లడ్డు ని పట్టుకుని  ఇతడే ప్రధాన నిందితుడని  ఛార్జ్ షీట్ కూడా వేసిన పోలీసులు, ఎ కారణాల వల్లనో గాని గుర్విందర్ సింగ్ ని వదిలేసి, ఒక నిరుపేద దళిత కుటుంబానికి చెందిన పిడతల సత్యం బాబు  ని పట్టుకున్నారు, ఇతనికి తండ్రి లిడు, తల్లి రోజు వారి కూలి పని చేస్తుంది, సత్యం బాబు నిర్మాణ కూలి గ  పని చేస్తున్నాడు, చిల్లర దొంగతనాలు చేసిన చరిత్ర ఉంది, మొదటినుండి పోలిసుల వైఖరి ఈ కేసులో అనుమానాస్పదంగా ఉంది నాల్గు నెలల వరకు విచారణ చేపట్టకపోవడం, నలుగు నెలల తర్వాత గుర్విందర్ సింగ్ అలిఅస్ లడ్డు ని పట్టుకుని ఇతనే నిందితుడని హోం మంత్రి ప్రకటించడం, తర్వాత నాల్గు నెలలకు, గుర్విందర్ సింగ్ ని వదిలేసి సత్యంబాబు ని పట్టుకోవడం వెనుక అసలు నిందుతులను కాపాడే కార్యక్రమాన్ ఉన్నాడని రాష్ట్ర ప్రజలు బావించారు దీనికి   ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా  ద్యార బయటికి వచ్చిన అనేక విషయాలు దోహదం చేసాయి

సత్యంబాబు ని ఈ కేసు లో ఇరికిస్తే అడిగే వారు ఉండరని పోలీసులు బావించారు అందుకే సత్యం బాబు ని అనేక రకాలుగా హింసించారు, ప్రధానంగా సత్యం బాబు కు చికిత్చ చేసిన ఒక  డాక్టర్ ఇచిన సమాచారం ప్రకారం  పోలీసులు సత్యంబాబు  వెన్నముక దెబ్బ తినేల కొట్టడంతో  అతనికి గుల్లెన్ బర్రి సిండ్రోం అనే వ్యాది వచ్చి రెండు కాళ్ళు పారాలసిస్ వచ్చి పది పోయినాయి, అరెస్ట్ చేసినపుడు కోర్ట్ కు నడుస్తూ వచ్చిన సత్యంబాబును  తీర్పు రోజు పోలీసులు వ్హీల్ చైర్ లో తీసుకు వచ్చారు

సత్యంబాబు ని అరెస్ట్ చేసిన దగ్గరినుండి అతన్ని చంపి కేసు క్లోజ్ చేయాలనే ఆలోచనతో పోలీసులు వ్యవహరించినట్లు అనేక రుజువులు ఎలక్ట్రానిక్ మీడియా ద్యార బయటికి వచ్చాయి, హైదరాబాద్ తీసుకువచి తిరిగి  వెళ్తుండగా సత్య్మబాబు కోదాడ దగ్గర వాహనం నుండి దూకి పారిపోయాడని, అమ్ల్లి జగ్గయ్యపేట లో దొరికాడని  పోలీసులు ఒక నాటకం  ఆడారు, అయితే సత్యంబాబు కు చికిత్చ చేసిన, నిమ్స్ డాక్టర్స్ అభిప్రాయం ప్రకారం సత్యంబాబు ఎ కొద్ది దూరం కూడా నడవ లేని పరిస్థిలో ఉన్నాడు. అలంటి వ్యక్తి తప్పించుకోన్నాడని చెప్పడం బూటకం మరియు ఈ సందర్బం లోనే సత్యం బాబు ని హత్యా చేయడానికి పోలీసులు పథకం వేశారని అది విఫలం అయిందని అనేక కథనాలు ప్రసార సాధనాల్లో వచాయి, ఈ కథనాలను వ్యతికేరించే నమ్మకమయిన కథనం ఏది పోలీసులు చెప్పలేక పోయారు

ఇంత గందర గోళం ఇన్ని అనుమానాలకు తావు ఇచిన ఈ కేసు విచారణ కూడా వివక్ష పూరితంగా జరిగింది ఒక అసిస్టెంట్ కమిసనర్ విజయవాడ కు బదిలీ ఆయెన తెల్లవారే సత్యం బాబు ఈ నేరం చేసినట్లు పోలీసులు ప్రకటించారు,  అలాగే  ఒక కొత్త మహిళా  న్యాయాధికారి రావడం తో ఈ కేసు వేగవంతం అయినట్లు డిఫెన్సు లాయర్ శ్రీనివాస్ గారు చెపుతున్నారు. కోర్ట్ లో అనేక కేసులు సంవ త్సరలుగా పెండింగ్ లో ఉండగా కేవలం సత్యంబాబు పై ఉన్న కేసు ను కేవలం ఒకేఒక సం వత్సరం లో విచారించి తీర్పు ఇచ్చారు, ఎ సాక్ష్యాలు లేక పోయిన సత్యంబాబు కు జీవితకాలం శిక్ష విధించారు

సాంకేతికమైన సాక్ష్యాలు తప్ప ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేకుండా శిక్ష విధించడం ఈ కేసు లోనే జరిగి ఉండవచు, ఇది అత్యంత దుర్మార్గమైన తీర్పు, ఈ కేసు లో ఎ సాంకేతిక ఆధారాల మూలంగా తీర్పు చెప్పారో ఆ సాంకేతిక ఆధారమైన డి న్ ఎ రిపోర్ట్ ఇచిన డాక్టర్ వెంకన్న మరో కేసు లో ఫోరెన్సిక్ రిపోర్ట్ అనుకూలంగా ఇవ్వడానికి పదిహేను వేలు లంచం తీసుకుంటూ అచ్బ్ అధికారులకు చిక్కడు ప్రస్తుతం అతను రాజముండ్రి జైలు లో ఉన్నాడు, సత్యంబాబు పై రిపోర్ట్ ఇచిన డాక్టర్ సత్యంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలు లోనే ఉన్నారు, అలంటి లంచగొండి డాక్టర్ ఇచిన రిపోర్ట్ ప్రకారంగా శిక్ష వేసిన జడ్జి తీర్పు ఈ రాష్ట్ర ప్రజల ఆమోదాన్ని పొందలేక పోయింది, మొత్తం న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం పోయేలా ఈ తీర్పు ఉంది, ఈ కేసు లో పోలిసుల వ్యవహారం అసలు నిందితులను కాపాడేలా ఉంటె, న్యాయ వ్యవస్థ కూడా అలాగే వ్యవరించడంతో పేదలకు దళితులకు అన్యాయం చేయడం లో పొలిసు వ్యవథ లో న్యాయ వ్యవస్థ పోటి పడుతున్నట్టు ఉంది

ఈ కేసులో అమాయకుడైన పేద దళితుడు సత్యంబాబు ను  పోలీసులు కొట్టి వికలాంగుడి గ చేయడం  న్యాయ వ్యవస్థ జీవిత శిక్ష విధించడం తో ఈ రెండు ప్రధాన వ్యవస్థల పై  సామాన్య ప్రజలకే కాదు న్యాయవాదులకు ప్రధానంగా మధ్యతరగతి ప్రజానికానికి పూర్తి నమ్మకం పోయింది, ఇలాంటి  పరిస్థితి ప్రజాస్వామ్య  వ్యవస్థ మనుగడకే ప్రమాదం

కాబట్టి ,  అయేషామీర హత్యా కేసులో అన్యాయంగా శిక్షించిబడిన పిడతల సత్యంబాబు గి బి సిండ్రోం తో బాదపడుతున్నందున  వెంటనే నిమ్స్ హాస్పిటల్ తరలినించే చికిత్చ జరిపించాలి
కోర్టు పోలీసులు తప్ప రాష్ట్ర ప్రజలందరూ సత్యంబాబు నిరపరాది అని నమ్ముతున్నందున అయేషామీర  హత్యా కేసును సిబిఐ చేత పునర్ విచారణ జరిపించాలి, అసలు దోషులను అరెస్ట్ చేసి శిక్షించాలి
ఈ రెండు జరిగే వరకు ” సత్యంబాబు అయేషా మీరా న్యాయ పోరాట కమిటి ” పోరాడుతూనే ఉంటుంది, ఈ క్రమం లో ఈ క్రింది కార్యక్రమాలను ఈ నెల ఆరు న జరిగిన కమిటి సమావేశం లో తీర్మానించడం జరిగినది  ఒక బహిరంగ సభ నిర్వహించడం దానికి ఎవరైనా పదవి విరమణ పొందిన సుప్రేమే కోర్ట్ న్యాయమూర్తిని ఆహ్వానించడం , అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక ధర్నా నిర్వహించడం, ఈ కేసు లో న్యాయస్థానం ఇచిన తీర్పు ని తెలుగు లోకి తర్జుమా చేసి ఒక పుస్తకంగా ప్రచురించాలని తీర్మానించడం జరిగింది తీర్పు ని తెలుగు లో ప్రచురించడం వాళ్ళ ఈ తీర్పు ఎంత దుర్మర్గామైనదో ఎంత పక్షపాతంతో వెలువరించిందో సామాన్య ప్రజలకు తెలుస్తుంది అందుకే ఈ తీర్పు తెలుగులో ప్రచురించాలని తీర్మానము చేయడడం జరిగింది, ఈ మూడు కార్యక్రమాల్లో మొదటిదైన బహిరంగ సభ ఈ నేలకరు లోగ జరుగుతుంది
ముక్య గమనిక : సత్యంబాబు ని కాపాడేందుకు ఆన్ లైన్ పిటిసన్ పై సంతకం చేయండి : ఈ లింక్ పై క్లిక్ చేయండి http://www.petitiononline.com/sathyam/petition.html
బి కార్తీక్ నవయన్, న్యాయవాది
కో ఆర్డినేటర్
సత్యం బాబు అయేషా మీరా న్యాయ పోరాట కమిటి – ఆంద్ర ప్రదేస్
సబ్య సంగాలు
 1. కుల నిర్మూలన  పోరాట  సమితి
 2. నవయాన ( సామజిక పరివర్తన సంస్థ )
 3. OPDR
 4. PUCL
 5. మాల  సంక్షేమ సంగం
 6. మనవ హక్కుల వేదిక
 7. దళిత  బహుజన  వేదిక
 8. సమతా  సైనిక  దళ
 9. APCLC
 10. దళిత  బహుజన  వ్యవసాయ  కార్మిక  సంగం
 11. ఆంధ్ర  ప్రదేశ్  అంబేద్కర్  యువజన  సంగం
 12. రేపుబ్లికాన్  పార్టీ  అఫ్  ఇండియా
 13. మాదిగ  మహాజన  శ్రామిక  విముక్తి
 14. సాక్షి, మనవ హక్కుల నిఘా
 15. State Bank SC, ST.వెల్ఫరె  అసోసియేషన్
 16. ఆంధ్ ప్రదేస్ సేద్యులు  కులాల సంక్షేమ సంగం
 17. తెలంగాణ  మాల  యువ  సేన
 18. నేషనల్  దళిత  ఫోరం
 19. పీపుల్స్ వాచ్
 20. HRLN
 21. HM టీవీ
 22. దళిత బహుజన సంగర్షణ సమితి
 23. అరుణోదయ
 24. తెలంగాణ అంబేద్కర్ సంగం
 25. లంబాడి హక్కుల వేదిక
 26. మలుపు,  సామజిక సేవ సంస్థ
 27. దళిత స్త్రీ శక్తి
 28. సివిల్ లిబెర్టీస్ మానిటరింగ్ కమిటి

   

 29. మనవ వికాస వేదిక


   

Advertisements

1 Comment

 1. We need to change the Laws of India in Indian Constitution first to protect the Dalit people from the upper caste people. We demand to put the Law changes bill in the parliament we should agitate for this bill unitedly

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: