Home » General » కార్తీక్ నవయాన్ లండన్ డైరీ

కార్తీక్ నవయాన్ లండన్ డైరీ

Start here

Advertisements

 నేను విమానం   ఎక్కడం కొత్త కాదు గాని, మన దేశం దాటి వెళ్ళడం మొదటిసారి. లండన్ వెళ్ళడం , దుబాయ్ వెళ్ళడం కూడా మొదటిసారి. బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు  హైదాబాద్ నుండి దుబాయ్ కి దుబాయ్ నుండి లండన్ లోని గాత్విక్ ఏర్పోర్ట్ కి టికెట్స్ బుక్ చేసి పంపిచారు. లండన్ బయలుదేరవలసిన ముందు రోజు రాత్రి లండన్ కు సంబందించిన ఆలోచనలతో అసలు నిద్ర లేదు, ప్రయనానికంటే ఒక రోజు ముందే వీసా వచ్చింది. యు.కే. వీసా నాకు తెలిసి ఎవరికీ తొందరగా రాలేదు. నాకు తెలిసిన ఇద్దరు మిత్రులు కూడా లండన్ వెళ్ళేటప్పుడు వీసా వస్తుందా రాదా అని ఆందోళన చెందడం నేను చూసాను. ఒక మిత్రునికయితే సాయంత్రం ఫ్లైట్ ఉంటె అదేరోజు ఉదయం పదకొండు గంటలకు వీసా వచ్చింది. వీసా రాకపోతే వేచి ఉండడం తప్ప ఏమి చేయలేమని వి ఎఫ్ ఎస్ గ్లోబల్ వారు చెపితే విని ఆశర్యపోయాను మొతానికి నాకు ప్రయాణానికి  ఒకరోజు ముందే వీసా వచ్చింది.  

లండన్ వేల్లెరోజు నా బార్య పిల్లలు ఇంకా కుటుంబ సబ్యులు అందరు వచ్చి  ఏర్పోర్ట్ లో దింపేసి వెళ్లి పోయారు. లోనికి వెళ్ళగానే ఇమ్మిగ్రేసన్ ఫోరం నిమ్పమన్నారు, ఆ ఫోరం పాస్ పోర్ట్ పైన పెట్టి నింపి పాస్ పోర్ట్ అక్కడే మర్చి పోయి కౌంటర్ దగ్గరికి వెళ్ళాను.  పాస్ పోర్ట్ అడిగారు అంత వెతికినా దొరకలేదు ” ఇక లండన్ కెన్సెల్”  అనుకున్నాను కానీ ఈ లోగ నేను ఫోరం నింపుతుంటే చుసిన వ్యక్తి కేక వేసి ” పాస్ పోర్ట్ ఈస్ హియర్ ” అన్నాడు. వెంటనే వెళ్లి తీసుకొచ్చి ఇచాను. అపుడు పాస్ పోర్ట్ పై ముద్ర వేసి లోపలి పంపించారు. అప్పటినుండి దాదాపు గంటన్నర వేచి ఉన్నాను బుర్ర రాములు సర్ అంతకు ముందు రోజే చనిపోయారు అక్కడికి వెళ్ళలేక పోయానని ఆలోచిస్తూ ఉన్నాను ఈలోగా హైదరాబాద్ నుండి గనుమల జ్ఞానేశ్వర్ సంతోష్ మిత్రులు  ఏర్పోర్ట్ కు వచ్చి ఫోన్ చేసారు కానీ చెక్ ఇన్ అయిన తర్వాత బయటికి పంపిచారని చెప్పారు వారిని కలువ లేక పోయాను.  మొతానికి ఫ్లైట్ వచిందని అనౌన్స్ చేసారు పిల్లలతో ప్రయనిశున్న వాళ్ళు మరియు వృద్దులు ముందుగ బోర్డింగ్  కావాలని చెప్పారు. అది అమిరేట్స్ ఫ్లైట్, హైదరాబాద్ నుండి దుబాయ్ కి రెండున్నర గంటలు ప్రయాణం . విమానం లో ఉన్న తెలుగువాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవడం కనిపించలేదు కానీ తెలుగేతర వ్యక్తులు అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు . విమానం లో ప్రతి సీట్ కు ఒక కంప్యూటర్ అమర్చినారు. అందులో విమానం గమ్యనికీ ఎంత దూరం లో ప్రయాణిస్తుంది, ఇంకా ఎంత సమయంలో గమ్యాన్ని చేరుతుంది, ప్రస్తుతం విమానం ఎ ప్రాంతం లో ఉండి, ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి వివరాలు  చూడవచు, వీటితో పాటు, కావాలనుకుంటే  వార్తలు చదువొచ్చు, ఇంకా అనేక సినిమాలు చూడవచు, నాకు ఇది కొత్త విషయం. నా ముందు సీట్ లో కూర్చున్న ఒక తెలుగు కుటుంబం తెలుగు సినిమాలు పెట్టుకుని చూస్తున్నారు.

దుబాయ్ లో దిగగానే లండన్ వెళ్ళే విమానం ఎక్కడికి వస్తుంది తెలుసుకోవాలని ఎవరిని అడగాల అని వెతుకుతున్నాను ఈలోగా  ఎదురుగ డిస్ప్లే బోర్డు కనబడింది అందరు దాని ముందు నిలబడి చూస్తున్నారు. వెళ్లి చూసాను లండన్ వెళ్ళే ఫ్లైట్ కి 32  గేటు వద్దకు వెళ్ళాలని ఉంది. అక్కడినుండి ఫ్లైట్ దిగినవారు రెండు వైపులా వెళ్తున్నారు బహుశ కొందరు దుబాయ్ వరకే వేల్లవల్సినవారు కొందరు లండన్ వెళ్ళే ఫ్లైట్ కోసం వేల్తున్నవారు కావచు కానీ ఎవరు ఎటు వేల్తున్నరూ తెల్సుకోవడానికి అక్కడ పని చేస్తున్న  ఒక స్త్రీని   అడిగాను న ప్రశ్న పూర్తి కాకముందే  ఏమి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళు అన్నట్టు సైగ చేసింది. అక్కడినుండి కదిలి ముందుకు వెళితే అక్కడ మల్లి చేక్క్ ఇన్ అవుతున్నారు లాప్టాప్ లు శూ అన్ని తీసి స్కాన్నర్ లో పెట్టి ముందుకు పిల్చి ఇస్తున్నారు. అక్కడినుండి పైకి వెళ్లి ముప్పయిరెండు నెంబర్ గేటు కోసం చాలాసేపు వెతికి పట్టుకున్నాను. ఫ్లైట్ కి ఇంకా మూడు గంటల టైం ఉందని చెప్పారు ఆ టైం గడవడానికి అక్కడ వెయిటింగ్ హాల్ లో న్యూస్ పేపర్స్ మేగాజిన్స్  ఫ్రీ గ అందజేస్తున్నారు. అలంటి అవకాశం హైదరాబాద్ విమానాశ్రయంలో లేదు 

దుబాయ్ నుండి లండన్ దాదాపు ఆరు గంటలు ప్రయాణం, ఫ్లైట్  సాయంత్రం ఎనిమిది గంటలకు గట్విక్ విమానాశ్రయం కు చేరింది. గట్విక్ విమానాశ్రయం మన శంషాబాద్ విమయశ్రయం లాగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయమే విమానం దిగుతుంటే  ఎటు చుసిన పచ్చటి చెట్లు పంటలు కనిపించాయి. ఏర్పోర్ట్ నుండి బయటికి రావడానికి గంట టైం పటింది అక్కడ కూడా ఇమ్మిగ్రేసన్ ఫోరం నింపి బయటికి రావాలి. బయటికి వచ్చే సరికి రాత్రి తొమ్మిది అయింది. కానీ అక్కడ ఇంకా సాయంత్రం లగే ఉంది అప్పుడే  పొద్దు గూకి నట్టు మనదగ్గర సాయంత్రం ఆరున్నర గంటలకు ఎలాంటి సన్ లైట్ ఉంటుందో లండన్ లో తొమ్మిది గంటలకు అలాగుంది. నేను అర్పోర్ట్ నుండి బయటికి రాగానే “బ్రిటిష్ కౌన్సిల్” నేమ్ బోర్డు పట్టుకున్న ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చింది. వెంటనే వెళ్లి హలో చెప్పాను ఇంగ్లీష్ లో పరిచయం చేసుకున్నాను తను కూడా పరిచయం చేసుకుంది తన పేరు గిల్ సింప్సన్. అక్కడినుండి మాట్లాడుతూ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము. నాకోసం న్యూస్ పేపర్ మరియు రెండు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చింది. అలసిపోయినట్లయితే వెనక సీట్లో రెస్ట్ తీసుకొమ్మని చెప్పింది. కానీ నేను ముందు సీట్ లోనే కుర్చున్తానని చెప్పాను ఎందు కంటే అర్పోర్ట్ నుండి సెంట్రల్ లండన్ వెళ్ళడానికి గంటన్నర టైం పడుతుంది అని చెప్పింది కాబట్టి లండన్ విశేషాలు ఆమె తో తెలుసుకోవచ్చని ముందు సీట్లో కూర్చున్నాను. నా గురించి న కుటుంబం గురించి అడిగినది  నాకు పెల్లిఅయే ఇద్దరు పిల్లు ఉన్నారని చెప్పడం తో తనకు కూడా  ఇద్దరు ముప్పైఏళ్ళు దాటినా అమ్మయిలు ఉన్నారని పెళ్లి చేసుకొమ్మని అడిగితే చేసుకోవడం లేదని చెప్పింది తన ఇద్దరు కూతుళ్ళు ఇంకా కెరీర్ డెవలప్ చేసుకోవడానికి టైం కావాలని పెళ్లిలు వాయిదా వేస్తున్నారని చెప్పింది. తన కూతుళ్ళు పెళ్లి చేసుకున్నట్లఎతే మనవలు మనవరాళ్ళు ఉండేవారని వాపోయింది తనకు యాబై తొమ్మిదేళ్ళు 

 ఇంకా నేను లండన్ గురించి అడిగిన చాల విషయాలకు కార్ డ్రైవ్ చేసుకుంటూనే సమాధానాలు చెప్పింది సెంట్రల్ లండన్ లో సింగ్లె బెడ్ రూం వెయ్యి పౌండ్స్ ఉంటుందట అంటే ఇండియా లోని దాదాపు ఎనబై వేలకు సమానం. కానీ తనకు లండన్ లో సొంత ఇల్లు ఉందని చెప్పింది. మద్య మద్యలో నేను అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెపుతూనే డ్రైవ్ చేస్తుంది కార్ లో వెళ్తూ చూస్తుంటే చాల ఆహ్లాదకరంగా ఉండె. లండన్ చాల అందమైన నగరం, అందమైన రోడ్లు, అందమైన ఇల్లు. పకడ్బంది అయిన ట్రాఫ్ఫిక్ సిస్టం వెల్ అర్గానైస్ద్ సిటీ అండ్ అర్గానైస్ద్  పీపుల్. మాట్లాడుతూనే నేను ఆరోజు రాత్రి కి బస చేయాల్సిన తోవిస్తోక్ హోటల్ కు చేరుకున్నాము. అక్కడ హోటల్ ముందు దింపి న లగేజ్ తీసుకుని కౌంటర్ వరకు వచ్చింది. కౌంటర్ లోని వ్యక్తి పేరు అడిగి యు ఆర్ మిస్టర్ బత్తుల? అన్నాడు, ఎస్ అన్నాను అదో రకమైన తాళంచెవి ఇచాడు అది మాగ్నెట్ తో పనిచేసేది. అది ఇలా ఓపెన్ చేయాలో చెప్పాడు. ఈ లోగ నేను మర్చి పోయిన విషయం నా రాత్రి భోజనం నన్ను తిసుకోచిన గిల్ సిమ్సన్ హోటల్ కౌంటర్ లో ఉన్న వ్యక్తిని నా భోజనం గురించి అడిగింది. నాకు ఉదయం అల్పాహారం మాత్రమే బుక్ చేసారని ప్రస్తుతం భోజనం ఎవ్వలేనని చెప్పేసాడు. దాంతో గిల్ సింప్సన్ మల్లి నన్ను తన కార్ లో కూర్చోబెట్టుకొని టేస్కో అనే సూపర్ మార్కెట్ కు తేసుకేల్లింది అక్కడ చికెన్ మరియు బాదాం తో చేసిన పేరు తెలియని తిండి తీసుకున్నాను అదొక్కటే చవకగ కనిపించింది దాని దార ఒక పౌండ్ తర్వాత డ్రింక్ కావాలని గిల్ సింప్సన్ ని అడిగితే రెడ్ వైన్ కొనుక్కోమన్నది. అవి తీసుకొని లైన్ లో  కౌంటర్ దగ్గరికి వెళ్ళాను హైదరాబాద్ మిత్రుడు సందీప్ చవాన్ ఇచిన నలపై పౌండ్స్ లో నుండి ఇరవై పౌండ్స్ నోట్ ఇచ్చాను, దాన్ని చుసిన సేల్స్ మెన్. ఆ నోట్ చెల్లదని దాన్ని బ్యాంకు లో ఇచి కొత్త నోట్  తీసుకోవాలని చెప్పాడు. అది విన్న గిల్ తన దగ్గరున్న నలపై పౌండ్స్  కొత్త నోట్స్ నాకు ఇచి నా దగ్గరున్న పథ నోట్స్ తీసుకున్నది. మల్లి హోటల్ వద్ద దింపి గుడ్ నైట్ చెప్పి వెళ్లి పోయింది.

తోవి స్టాక్ హోటల్ లో నాది నలువ అంతస్తు అక్కడికి లగేజ్ తీసుకొని వెళ్ళాను. దాదాపు పది నిమిషాల వరకు తలం తీయడం రాలేదు విసుగోచింది, అప్పటికి రాత్రి పదకొండు  అయింది నా ముందు రూం వాళ్ళు నా ముందే వచ్చి లాక్ ఓపెన్ చేసుకొని లోనికి వెళ్లారు నేను ఇంతకు ముందు ఇపుడు ఇలాంటి తాళం చూడలేదు ఇక కిందికి వెళ్లి కౌంటర్ లో ఉన్న వాళ్ళను అడుగుదమనుకొన్నాను కానీ  చివరి  ప్రయత్నంగా మల్లి ఓపెన్ చేశాను.  వచేసింది. లోపలి వెళ్లి కొనుక్కోచింది తినడానికి ప్రయత్నిస్తే సగం కూడా తినలేక పోయాను ఇక వదిలేసి. ఇంటికి ఫోన్ చేయాలనే ఆలోచన వచ్చి కిందకి దిగాను. ఫోన్ కాల్ గురించి కౌంటర్ లో అడిగితే. కార్డు కొని ఉపయోగిస్తే చీప్ అని చెప్పారు. నేను లండన్ సిం కార్డు కొంటానని చెప్పను లైక మొబైల్ సిం కార్డు బాగుంటుందని చెప్పారు. ఆ హోటల్ ప్రక్కనే ఇంటర్నెట్ షాప్ లో సిం కార్డ్స్ అమ్ముతారని చెప్పారు. అక్కడికి వెళ్లి లైక మొబైల్ సిం కార్డు అడిగితే. అది లేదని లిబెరో సిం కార్డు ఇచాడు ఐదు పౌండ్స్ తీసుకున్నాడు. రేచార్జ్ చేయమని అడిగితే రేచార్జ్ కార్డ్స్ లేవని చెప్పాడు. కంగారుగా అక్కడినుండి బయటికి వచాను అయితే సిం కార్డు మాత్రమే తీసుకొని దానికి సంబందించిన బ్రోచర్ అక్కడే వదిలేసాను ఆ సిం కార్డు నెంబర్ కూడా ఆ బ్రోచుర్ లోనే ఉండి పోయింది . రీచార్జ్ కోసం మల్లి టేస్కో సూపర్ మార్కెట్  వెళ్ళాను మద్యలో  సిం కార్డు నెంబర్ లేకుండా రీచార్జ్ చేయడం వీలుకాదని వాపస్ వచాను కానీ నిజానికి సిం కార్డు నెంబర్ లేకున్నా కార్డు తో రీచార్జ్ చేయవచ్చు నా మనసు లో ఈ రీచార్జ్ మాత్రమే ఉన్నది. కంగారు పడి వాపస్ వచ్చాను. లిఫ్ట్ లో రూం కి వెళ్తుంటే ఒక జంట నాతో పాటు పైకి వస్తున్నారు. వారిని ” మీరు బ్రిటిష్ కౌన్సిల్ సెమినార్ కు వచ్చారా? అని అడిగాను వారు ఆశార్యపోయి. అది మీకెలా తెలుసు అని ఎదురు ప్రశ్న అడిగారు. ఇద్దరు లాప్ టాప్ లు పట్టుకొని రాత్రి పన్నెండు గంటల వరకు కుస్తీ పడుతున్నారంటే సెమినార్ కే వచ్చి ఉంటారని అన్నాను. అవునని నవ్వారు. పొద్దున్నే కలుద్దామని చెప్పి రూం లోకి వెళ్లి పోయాను  

తెల్లవారి ఆరు గంటలకే లేసి బకెట్,  మగ్గు లేని స్నానం చేశాను కిందకి వచ్చి మరో మొబైల్ షాప్ కోసం వెతికాను అక్కడ లైక మొబైల్ సిం కార్డు అయిదు పౌండ్స్ కి కొన్నాను. మరో అయిదు పౌండ్స్ రీచార్జ్ చేయించాను. వెంటనే ఇంటికి ఇండియా లోని కొందరు మిత్రులకు ఫోన్ చేశాను, అదే అయిదు పౌండ్స్ రీచార్జ్ లండన్ నుండి తిరిగి వచ్చే వరకు సరిపోయింది. ఎనిమిది గంటలకు అల్పాహారం చేశాను చికెన్ ముక్కలు, ముట్టన్ ముక్కలు, చేప ముక్కలు, బ్రెడ్ ముక్కలు, పళ్ళ ముక్కలు జూసు, కూల్ డ్రింక్స్ ఇదే బ్రేక్ ఫాస్ట్.   ప్లాన్ ప్రకారం బ్రిటిష్ కౌన్సిల్ యూత్ వింగ్ డైరెక్టర్ గార్డెన్ బ్లాకేలీ అక్కడికి ఎనిమిది గంటలకే వచ్చి అందరిని రాయల్ చాస్ హోటల్ తీసుకెళ్ళాలి కానీ తొమ్మిది గంటలైన నన్నెవరు పలకరించక పోయే సరికి కౌంటర్ లో అడిగాను. వారు తమకు ఆ వివరాలు ఏమి తెలియవని చెప్పారు. వెంటనే గార్డెన్ బ్లాకేలీ నెంబర్ కు ఫోన్ చేసి అక్కడున్నారని అడిగాను. “వి ఆర్ సిట్టింగ్ ఆన్ ది రైట్ సైడ్ అట్ ఎంట్రన్సు”  అన్నాడు కిందకి వచ్చి చుస్తే నాకోసం ఎవరు ఎదిరి చూస్తున్నట్టు అనిపించలేదు. అక్కడ కూర్చున్న వారిని పలకరించలేదు మల్లి పైకి వెళ్లి అరగంట తర్వాత మల్లి ఫోన్ చేశాను, మల్లి అలాగే చెప్పాడు. ఈ సారి లగేజ్ తీసుకొని కిందకి దిగాను అక్కడ రైట్ సైడ్ కూర్చున్న వారి దగ్గర వెళ్లి కాలి గ ఉన్న కుర్చీ అడిగి   లాక్కుని కూర్చున్నాను. అక్కడికి వచ్చి ఆర్ యు గార్డెన్ బ్లాకేలీ అని సెమినార్ గురించి మాట్లాడాడు. అపుడు అతడే గార్డెన్ బ్లాకేలీ అని నమ్మకమొచింది వెళ్లి పరిచయం చేసుకున్నాను అలాగే అతని దగ్గర  సెమినార్ కు వచ్చిన ఇతర వ్యక్తులను కూడా పరిచయం చేసుకొన్నాను అందులో పాకిస్తాన్ నుండి వచ్చిన సయీద్ అనే వ్యక్తి నాతో క్రికెట్ గురించి సంబాషణ మొదలు పెట్టాడు నేను ఆసక్తి గ లేకపోవడం తో  క్రికెట్ అంటే ఇష్టం లేదా అని అడిగాడు, లేదని చెప్పాను, నిజానికి ఇప్పటికి క్రికెట్ కామెంటరీ అర్థం కాదు నాకు. అంటే  క్రికెట్ మీద అంత అనాసక్తి నాకు ఎందుకో తెలియదు. అక్కడే శ్రీలంక కు చెందిన ఆండీ, బెహ్రాన్ కు చెందిన సాజిద, కాంగో కు చెందిన ఫెలోజిన్ పరిచయం అయ్యారు.

ఉదయం పదకొండు గంటలకు బస్సు వచ్చింది అందరం బస్సు ఎక్కి రాయల్ చేజ్ హోటల్ కు వెళ్ళాము, అక్కడ లంచ్ టైం లో షీలా (బ్రిటిష్ కౌన్సిల్ పాలసీ ఆఫీసర్) ను కలవడం జరిగింది, షీలా ది ఇండియా లోని ఉత్తర ప్రదేశ్ కు చెందిన కుటుంబం మారిషస్ వెళ్లి అక్కడి నుండి లండన్ లో సెటిల్ అయ్యారు. అందుకే నన్ను ఇండియన్ సన్ షైన్ తీసుకురమ్మని మెయిల్ రాసింది. నేను నా వద్ద ఉన్న అంబేద్కర్ రచనలు, ఫోటోలు, వీడియో లు. వాయిస్ ఉన్న సి డి ఇచ్చాను. తీసుకొని కృతజ్ఞతలు చెప్పింది.    ఈ రాయల్ చాస్  హోటల్ నార్త్ లండన్ లో చిట్టా చివరి బిల్డింగ్ దీని తర్వాత అన్ని పచ్చని పంట పోలలే కనిపిస్తాయి. హోటల్ లో సామాన్లు పెట్టేసి మల్లి సెంట్రల్ లండన్ వెళ్ళాము మాతో ఉన్న నిర్వాహకులు  బ్రిటిష్ కౌన్సిల్ ఆఫీసు చూపించి. అక్కడినుండి కలి నడక దూరం లో ఉన్న బ్రిటిష్ పార్లమెంట్, చూసి రమ్మని చెప్పారు. ఎవరికీ తోచిన విదంగా వారు వెళ్లి పోయారు. నేను ఒక్తవియో అనే ఒక మెక్షికొ వ్యక్తి తో కలిసి అక్కడి ప్రదేశాలన్నీ తిరిగి ఫోటోలు దిగాము.  దారీ మర్చి పోయి దాదాపు రెండు కిలోమీటర్లు ఎక్కువగా నడచి వారు సాయంత్రము రమ్మని చెప్పిన రాయల్ సొసైటీ కి చేరుకున్నాము అక్కడ ” జాస్మిన్ రివల్యుసన్ ” పై చర్చ జరిగింది చాల మంది ఎంజాయ్ చేసారు. కానీ కొందరు ప్రయాణం లో అలసి పోయి చర్చ ఎంజాయ్ చేయలేక పోయారు అందులో నేను కూడా ఉన్నాను. అక్కడి నుండి మల్లి హోటల్ కు వచ్చి డిన్నర్ చేసి నిద్ర పోయాను. 

తర్వాత రోజు నుండి రెండు రోజులు బ్రిటిష్ కౌన్సిల్ మరియు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వారు నిర్వహించిన యూత్ పాలసీ సింపోసియం జరిగింది అందులో నేను విధాన నిర్ణయాల్లో యువత బాగాస్వమ్యము అనే విషయం పై ఒక బృందం లో సబ్యుడిగా పాల్గొని ఇన్ పుట్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రపంచం లోని అయిదు ఖండాలకు చెందిన యాబై దేశాల నుండి ప్రతినిధులు హాజరు అయినారు మన దేశం నుండి నాకు ఒక్కడికే అవకాశం ఇచ్చారు 

 సెమినార్ పూర్తి అయిన తర్వాత మరో అయిదు రోజులు లండన్ లో ఉండాలనేది నా ప్లాన్, దాని కోసం హైదరాబాద్ లో ఉండగానే ప్రయత్నాలు చేశాను మిత్రులు శంపాల్ గారు లండన్ లో ఉన్న తన మిత్రురాలు మేరీ కు చెప్పి నాకోసం వసతి ఏర్పాటు చేయమని అడిగారు. మేరీ లండన్ లోని  పంజాబీకి చెందిన ఒక దళిత కుటుంబం తో మాట్లాడి  వసతి ఏర్పాటు చేసింది, అలాగే లండన్ లోని సౌతాల్ లో ఉన్న అంబేద్కర్ సెంటర్ లో కూడా వసతి ఏర్పాటు చేసింది. అయితే సెమినార్ ఆయెన మరుసటి రోజు నేను నాకు వసతి కల్పించిన పంజాబీ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి దాని కోసం షీలా ముందు రోజు రాత్రే లండన్ ట్రైన్ లలో ఎలా ప్రయాణం చేయాలో దాదాపు గంట వివరించింది. ఎందుకంటే అక్కడి ట్రైన్స్ సిస్టం పూర్తిగ వేరు ఉందెర్ గ్రౌండ్ ట్రైన్స్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రూట్ లో వెళ్తుంది మనం వెళ్ళాల్సిన ప్లేస్ నిర్నయిన్డుకొని అక్కడికి ఎ లైన్ వెళ్తుందో చూసుకోవాలి ఇదంతా అర్ధం అయెతే పరవాలేదు గాని లేకుంటే కష్టమే అందుకే షీలా గంట టైం తీసుకొని వివరించింది 

ఆ రోజు ప్రొద్దున రాయల్ చేజ్ హోటల్ నుండి ఓక్ వుడ్ ఉందెర్ గ్రౌండ్ స్టేషన్ కు నేను మరియు కేరోలిన్ కల్సి వెళ్ళాము, కేరోలిన్ హీత్ రో అర్పోర్ట్ వెళ్తుంది, నేను విల్ల్స్దేన్ వెళ్ళాలి మద్యలో పార్క్ స్టేషన్ లో దిగాను. అక్కడ నేను జూబిలీ లైన్ కు మారాలి అయితే . ఓక్ వుడ్ స్టేషన్ లోనే విల్ల్స్దేన్ గ్రీన్ వరకు టికెట్ తీసుకున్న అది మర్చి పోయి పార్క్ స్టేషన్ నుండి మరో టికెట్ కొనేందుకు కౌంటర్ కోసం చాల సేపు తిరిగాను చివరికి బయట కౌంటర్ ఉన్నదంటే అక్కడికి వెళ్తూ ఒక ఉమన్ కానిస్టేబుల్ ని అడిగాను టికెట్ చూసి ” యు కెన్ ట్రావెల్ ఆన్ ది సెం టికెట్ ” అని చెప్పింది. ” బట్ అయాం చెంగింగ్ ది లైన్” అన్నాను ” దట్ దోఎస్ నాట్ మేటర్” అన్నది దాంతో ట్రైన్ జుబ్లీ లైన్ కు వెళ్లి విల్ల్స్దేన్ గ్రీన్ కు వెళ్ళాను అక్కడ స్టేషన్ లో దిగి బయటకు వచ్చాను. ఒంటరిగా లండన్ లో అడ్రస్ వెతకడం ఇంతకు ముందు పరిచయం లేని వ్యక్తుల దగ్గరికి వేల్తున్నన్నని  గుర్తోచి కొంచం ఆందోళన కలిగింది. మొతానికి ఇరవై నిమిషాల్లో ఆ పంజాబీ కుటుంబం ఇంటికి చేరుకున్నాను. అక్కడ తిండి తినేసి మల్లి విల్ల్స్దేన్ గ్రీన్ స్టేషన్ వచ్చి  డే పాస్ కొనేందుకు లైన్ లో నిల్చున్నాను  నా ముందు ఉన్న ఒక అమ్మాయి టికెట్ కౌంటర్ లోని  వ్యక్తి తో దాదాపు ఐదు నిముషాలు మాట్లాడింది. వేరే విషయాలు ఏమి కాదు ఎ పాస్ కొనాలి, ఎన్ని జోన్ లకు కొనాలి, అడ్వాన్సు గ కొంటె డిస్కౌంట్ ఎంత లాంటి విషయాలు చాల నిమ్మలంగ అడిగి తెల్సుకొని టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయింది. అదే మన హైదరాబాద్ లోని ఏదయినా  రైల్వే టికెట్ కౌంటర్ వద్ద ఎవరైనా ౫ నిముషాలు విచారణ చేసే అవకాశం ఉంటుందా? లైన్ లో ఉన్న వారు ఊరుకుంటారా? అసలు రైల్ వే స్టాఫ్ అంత ఓపికగా సహకరిస్తార? ఇవ్వన్ని నాకు వచ్చిన ఆలోచనలు. ఇలాంటి పరిస్తి అక్కడ ఎలా సాద్యం అయింది అంటే అక్కడ ట్రైన్ ల కొరత లేదు ప్రతి పది నిమిషాలకు ఒక ట్రైన్ వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రజలు ఆందోళన చెందారు, మన దగ్గర కొన్ని ప్రాంతాలకు రోజుకు ఒక్కటే ట్రైన్ ఉంటుంది అది మిస్ అయితే ప్రత్యమ్నాయం లేదు కాబట్టి కౌంటర్  వద్ద గొడవలు, తన్నులటలు సాదారనము మన దగ్గర 

ఇంకా అక్కడి ప్రజలు అపరిచితులకు కూడా  గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేస్తారు, రోడ్స్, ఇండ్లు చాల విశాలంగా ఉంటాయి, ఇరుకుగా ఉన్న రోడ్ గాని ఇల్లు గాని కన్పిస్తుందేమో నని వెతికాను కానీ దొరకలేదు, ఇండ్లు రోడ్స్ విశాలంగా ఉండటానికి కారణం వాళ్ళ మనస్సులు కూడా విశాలంగా ఉన్నాయని బావిన్చావాచు. మన దేశం లో వనరులకు ఎ కొరత లేదు కదా. మరి ఇంత ఇరికిరికు రోడ్స్ ఇరికిరుకు ఇండ్లు ఎందుకు? మన ఆలోచన విధానం లోనే మార్పు రావాల్సి ఉంది అని నమ్ముతాను. వనరుల పంపిణి జరగనంత కాలం ఈ దేశ దరిద్రం పోదు. అగ్ర కులాలు ఈ దేశ అంటారని వారితో కలిసి ఆస్తులను, జీవితాలను పంచుకో గలరా? లేదంటే ఈ దేశాన్ని ప్రపంచం లోని ఎ శక్తి బాగు చేయలేదు. 

నిజానికి లండన్ పెద్ద టూరిస్ట్ ప్లేస్. బ్యాంకింగ్ హమ్ పాలస్, బ్రిటిష్ పర్లిఅమేంట్, లండన్ బ్రిడ్జి, లాంటి ప్రదేశాలను కలి నడక తో తిరిగి చూస్తుంటారు, లండన్ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాను కానీ ఒక్కడినే వెళ్ళడం వల్ల ఫోటోలు సరిగ్గా దిగ లేక పోయాను, నా ఫొటోస్ నేనే దిన్చుకోవాల్సి వచ్చింది. ఆ ప్రదేశం నిత్యం ఎంతో రద్దీ గా ఉన్న ఎంతో నీట్ గా అందంగా ఉంటుంది. ఈ లండన్ బ్రిడ్జి వద్దనే ఒక పాకిస్తానీ కలిసి తన ఫోటో తీయమని కామెర ఇచాడు. అతన్ని ఫోటో తీసాక నా కామెర తో నా  ఫోటో కూడా తీసాడు. ” వి ఆర్ నైబెర్స్” అంటూ వెళ్లి పోయాడు. ఈ పాకిస్తానీ కాలువక ముందు కామెర ఎవరికైనా ఇచి ఫోటో దిగుదామని అనుకున్నాను, కానీ నాకు వసతి ఇచిన పంజాబీ మాటలు గుర్తోచి ఆ ప్రయత్నం మానుకున్నాను ఆ మాటలు ఏమిటంటే పబ్లిక్ ప్లేసెస్ లో జేబు దొంగలు ఉంటారని, జాగ్రతగా ఉండాలి అని చెప్పడం జరిగింది.

లండన్ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిన సాయంత్రమే లండన్ లోని ఒక దూరపు బంధువు డిన్నర్ కు పిలవడంతో వెళ్లి వచాను, అక్క డిన్నర్ చేస్తున్నపుడు సమయం సాయంత్రం ఏడు గంటలు అవుతుంది  కానీ మన దగ్గర ఐదు గంటల కు వెల్తురు ఎలా ఉంటుందో అలాగే ఉంది. అదే అడిగాను ఆయనను. ఇంకా చలి కాలం అయెతే రాత్రి పది గంటలైన  సూర్య కిరణాల వెల్తురు నిస్తునే ఉంటాయని చెప్పాడు 

 లండన్ స్కూల్ అఫ్ ఎకనిమిక్స్ : ఇందులో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అంబేద్కర్ ఇక్కడ చదువుకున్నందుకు ఆయన గౌరవ సూచకంగా ఏర్పాటు చేసారు. ఇక్కడికి వెళ్లి మిత్రులతో ఫొటోస్ దిగాను,  బ్రిటన్ లోని అంబేద్కర్ వాదులు, బౌద్ధులు,  గమనించని రెండు చిన్న మిస్తకెస్ అక్కడ ఉన్నాయ్, ఒకటి: అంబేద్కర్ గురించి ఒక పరిచయం వ్రాసి ఉంటుంది అందులోని మూడవ పేరాలోని మూడవ లైన్ లో ఇలా ఉంది ” In 1927Dr Ambedkar launched active movements against untouchables” కానీ అది ఇలా ఉండాలి  ” In 1927 Dr Ambedkar launched active movements against untouchabilities”. అలాగే అంబేద్కర్ విగ్రహానికి  కళ్ళజోడు కూడా లేదు. కాల్ జోడు లేకుండా అంబేద్కర్ ఫోటో ఒక్కటి వెతికాను,. ఈ రెండు విషయాలను సరి చేయవలసిందిగా. లండన్ స్కూల్ పఫ్ ఎకనామిక్స్ కు చెందిన ఎస్టేట్ ఆఫీసర్ అలాన్ బ్లైర్ కు మైల్ రాసాను కానీ ఇంతవరకు ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు. లండన్ లో ఉన్న అంబేద్కర్ వాదులు బౌద్ధులు ఈ రెండు సవరణలు చేయించాలి 

బ్రిటిష్ ముసియం : భారత దేశపు నిజమైన చరిత్ర, సంస్కృతి తెలుసుకోవాలంటే బ్రిటిష్ ముసియం వెళ్ళాల్సిందే. మనకు మన దేశం లో ఎక్కడ చూడడానికి అవకాశం లేని అనేక రకాల బుద్ధ విగ్రహాలు, చిహ్నాలు ఇంకా భారత దేశ ప్రాచీన సంస్కృతి కి సంబందించిన అనేక విషయాలను ఇక్కడ చూడవచు, ఈ ముసియం చూడడానికి ఒక రోజు మొత్తం పడుతుందని మిత్రుడు చెప్పాడు. సమయాభావం వల్ల భారత దేశానికి సంబందించిన, అది ముసియం లో కూడా బౌద్ధానికి సంబందించిన వస్తువులు పొందు పరచిన ప్రదేశాలనుకు మాత్రమే  వెళ్ళడం జరిగింది

గ్రేస్ ఇన్ : ఇది బారిష్టర్ లకు చెందిన లైబ్రరీ, ఇందులో అంబేద్కర్  బారిష్టర్ అయిన తర్వాత చేరినారు, ఇందులో సబ్యుడైన అంబేద్కర్ గారి గౌరవ సూచకంగా అంబేద్కర్ పైంట్ చేసిన అంబేద్కర్ ఫోటో ఉంటుంది. ఈ అంబేద్కర్ ఫోటో ని నగదేవే అనే వ్యక్తి వేసింది. కానీ ప్రస్తుతం అతను గాని అతని వారసులు గాని అందు బాటులో లేక పోవడం వల్ల ఆ ఫోటో పై కాపీ రైట్ గ్రేస్ ఇన్ వారికీ లేదు, అందు వల్ల ఆ అంబేద్కర్  ఫోటో వద్ద ఎవరైనా ఫోటోలు దిగినా ఎక్కడ ప్రచురించ వద్దని గ్రేస్ ఇన్ వారు విజిటర్ లను కోరుతున్నారు. నగదేవే ను గాని అతని వారసులను గాని వెతికి వారి వద్దనుండి కాపీ రైట్ పర్మిషన్ తీసుకొంటామని అక్కడి అధికారి ఆన్రు ముస్సేల్ అంటున్నారు

ఈ గ్రేస్ ఇన్ గురించి చెప్పవలసిన ఇంకో ముక్యమైన విషయం ఉంది. అది అందు లోని అంబేద్కర్ ఫోటో చూడడానికి మేము అనుమతి తీసుకునేటప్పుడు జరిగింది. నేను లండన్ చేరుకోక ముందే పంజాబీ మిత్రుడు ఆన్రు ముస్సేల్ కు నా లండన్ ప్రయాణం గురించి చెపుతూ గ్రేస్ ఇన్ లోని అంబేద్కర్ ఫోటో ని చూసి అక్కడ ఫోటో దిగేందుకు అనుమతివ్వల్సింది గా కోరుతూ మెయిల్ రాసారు, ఆ మెయిల్ కు ఆన్రు ముస్సేల్ రిప్లై ఇస్తూ తను  మేము వస్తామన్న తేదిలలో లండన్ లో ఉండడం లేదని తన సహాయకుడు జోన్స్ ఈ విషయమై సహకరిస్తాడని రాసారు. నేను లండన్ లోని పంజాబీ మిత్రుని ఇంటికి చేరుకొన్న తర్వాత, అతని బార్య అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేయడానికి గ్రేస్ ఇన్ కు ఫోన్ చేసింది. అక్కడ ఎలెన్ అనే ఒక లేడీ ఉంది  అంబేద్కర్ ఫోటో చూడడానికి వస్తున్న విషయం చెప్పి అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేయవలసింది గా కోరింది. దానికి ఎలెన్. మా అప్పాయింట్ మెంట్ విషయం తెల్సుకొని  తిరిగి ఫోన్ చేస్తానని చెప్పింది. అన్నట్టు గానే పది నిమిషాల్లో ఫోన్ చేసి సాయంత్రం ఐదు గంటల తర్వాత రమ్మని చెప్పింది. ఇక్కడ నేను ఆశ్చర్య పోయిన విషయం ఏమిటంటే ఒక. ప్రబుత్వ కార్యాలయం నుండి పజలకు ప్రజల నిమితమై ఫోన్ రావడం. కావాలంటే మీరు పరీక్షించి చుడండి. మన దేశం లోని ఏదైనా ఒక ప్రబుత్వ కార్యాలయానికి ఫోన్ చెయ్యండి ఏదైనా విషయం అడగండి. వారి స్పందన ఎలా ఉంటుందో చుడండి. అవసరమనుకుంటే మీకు రిటర్న్ కాల్ చేయమని చెప్పండి, దానికి వారి స్పందన ఎలా ఉంటుందో చుడండి, రిటర్న్ కాల్ వస్తుందేమో చుడండి

అక్ష్ ఫోర్డ్ : బ్రిటన్ లో ట్రాన్స్పోర్ట్ చర్గెస్ చాల ఎక్కువ, లండన్ నుండి అక్ష్ ఫోర్డ్ ఒక గంట ప్రయాణం మాత్రమే అయితే ఛార్జ్ అప్ అండ్ డౌన్ టికెట్స్ సమె డే / ఒకే సరి కొంటె ఇరవై రెండు పౌండ్స్ అంటే ఇండియా పదహారు వందలు. అంటే ఒక గంట ప్రయాణానికి ఎనిమిది వందల రూపాయలు చెల్లించాను. అక్ష్ ఫోర్డ్ లో హైదరాబాద్ నుండి ఒక తెలిసిన ప్రొఫెసర్ విసిటింగ్ ప్రొఫెసర్ గా అస్ ఫోర్డ్ ఉనివేర్సిటీ  లో  వచాడు అతన్ని కలవడానికి వెళ్లి ఒక రోజు అక్కడ ఉండడం జరిగిని. అక్కడ మహారాష్ట్ర కు చెందిన మరొక మిత్రుడిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ పదిహేడు, పదహారు, పదిహేను. శతాబ్దం నటి బిల్డింగ్స్ ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడ విద్యార్థులు మెజారిటీ సైకిళ్ళు ఉస్ చేస్తున్నారు. ఇంకా అక్కడ కాఫీ షాప్ లు, లిబ్రరీస్ కలిసే ఉంటాయి. ఒక విద్యార్ధి ఒక టీ తాగి ఒక పుస్తకం తీసుకొని సాయంత్రం వరకు అక్కడే చదువుకున్న ఎవరు అడగరు. మన విద్యార్థులు పాట్లు మీరు గుర్తుకు తేచుకోండి 

లండన్ రోడ్ ల మీద కార్ లు ఎన్ని ఉన్నాయో సైకిళ్ళు  కూడా అన్నే ఉన్నాయి, అందరికి ట్రాఫ్ఫిక్ సెన్స్ ఉంటుంది, పాడచారులకు ప్రత్యేక దారీ ఉంటుంది, ఎవరైన పాదచారి రోడ్ కు అడ్డంగా నడుస్తూ కనిపిస్తే డ్రైవర్స్  తప్పకుండ తెము నడిపిస్తున్న కారు నిలిపేసి పడచారులకు దారీ వేల్లుమంటారు, మన హైదరాబాద్ నగరం లో పాదచారుల పరిస్తితి అర్థం చేసుకోండి . లండన్ రోడ్ ల మీద ఛత్తా కూడా మూడు రకాలలో బాగ్ ల లో ప్యాక్ చేస్తారు, మన హైదరాబాద్ లో చేత్హ ?

కరుణ ట్రస్ట్: ప్రపంచం మొత్తం మీద హిందూ బ్రహ్మనుడి అద్నీనం లో ఉన్న ఎ సంస్థ కి డబ్బులు ఇవ్వకూడదని విధాన పరమైన నిర్ణయం తీసుకున్న ఏకైక సంస్థ , కరుణ ట్రస్ట్,  లండన్ లోని ఒక్కొక్క పౌండ్ కాలేచ్ట్ చేసి మహారాష్ట్రలోని బుద్ధిష్ట్ సంస్థలకు విరాళంగా ఇస్తున్నది. ఇక్కడికి నేను వెళ్ళడం అప్పటికప్పడు తీసుకున్న నిర్ణయం  నా మిత్రురాలు క్లేఇర్ లండన్ కి రెండు గంటల ప్రయాణ దూరం లో ఉండుంది తను కరుణ ట్రస్ట్ కు ఫండ్ రైసింగ్ చేస్తుంది. నన్ను కలవడానికి లండన్ వచ్చింది రోజంతా కలిసే ఉన్నాము. సాయంత్రం స్టీవ్ డిన్నర్ ఇస్తానన్నాడు అని క్లేఇర్ చెప్పింది. నేను అలాగే అన్నాను. మేము వెళ్ళేటప్పటికి స్టీవ్ భోజనం రెడీ చేసాడు. అలాగే గూగుల్ లో నా గురించి ఉన్న సమాచారం అంత చదివేసాడు. అయితే ఈ మీటింగ్ లో నేను కరుణ ట్రస్ట్ ఇంకా ఎక్కువ డబ్బులు సమకూర్చాలని దాని వల్ల కరుణ చేస్తున్న ముక్యమైన పనీ నిరంతరంగా కోన సగుతుండాలి కోరను, అంతే కానీ ప్రస్తుతం నేను పని చేస్తున్న సంస్థ కు డబ్బులు అడిగే ఆలోచననే నాకు రాలేదు. కానీ ఇండియా తిరిగి వచ్చిన తర్వాత  మెయిల్ రాసాను. 


అంబేద్కర్ సెంటర్ : ఈ అంబేద్కర్ సెంటర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, నేను లండన్ వేల్లెకంటే ముందే కొంత మంది మిత్రులు ఈ అంబేద్కర్ సెంటర్ లోనే వసతి అడగమని సలహా ఇచారు, మేరీ కూడా ఈ అంబేద్కర్ సెంటర్ లోనే రెండు రోజుల వసతి ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతం ఇంచార్జ్ గుజరాత్ కు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు ఈయన పై చాల ఆరోపణలు ఉన్నాయ్ ఇతను అంబేద్కర్ సెంటర్ కట్టించేందుకు బ్రిటన్ లో ఉన్న అందరు అంబేద్కర్ అభిమానులు,  బౌద్ధుల వద్ద నుండి పెద్ద ఏతున డబ్బులు వాసులు చేసి లండన్ లోని సౌతాల్ లో విశాలమైన భవంతి నిర్మించాడు కానీ ఈ భవంతి ని మాత్రం  అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద కాకుండా తన కుటుంబ సబ్యుల పేరుమీద రేజిస్త్రాసన్ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ అంబేద్కర్ సెంటర్ నిర్మాణానికి నిధులు అందించిన అనేక మంది కి ఈ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ లో సబ్యత్వం లేదు, వరిచిన డబ్బులకు రశీదు లేదు. ఈ విషయాలన్నీ చర్చించుటకు పోయిన నెల జూన్ ఇరవై ఆరు నాడు లండన్ అంబేద్కర్ మరియు బుద్ధిష్ట్ లు అంబేద్కర్ సెంటర్ లో సమావేశమయ్యారు కానీ ఇందులో చాల విషయాల పట్ల ఎకబిప్రయం రాలేదు. భారత దేశం లో ఉన్న దళిత జాతికి ఎంతో కొంత చేయగలిగిన చదువుకున్న, డబ్బున్న , అంబేద్కర్ వాదులు వారిమధ్య గొడవలు నా లండన్ ప్రయాణం లో ఒక మరచిపోని చెడు జ్ఞాపకం. 

 ఈ అంబేద్కర్ సెంటర్ లో  ఎస్ సి , ఎస్ టి డెవలప్మెంట్: స్పెసల్ కాప్మోనేంట్ ప్లాన్ అనే అంశం పై స్పీచ్ ఇవ్వమని ఈ సెంటర్ నిర్వాహకుడు అడిగాడు నేను కూడా సరే నాన్నను . ఈ విషయం అంబేద్కర్ సెంటర్ లో ఉన్న విద్యార్ధి మిత్రులకు చెప్పాను. వారు నా మెయిల్ కు రిప్లై ఇస్తూ . అంబేద్కర్ సెంటర్ నిర్వాహకుడి ఎ కార్యక్రమం లోను పాల్గొనరాదని, అతను లండన్ లోని ఇండియన్ రాయబార కార్యాలయానికి ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నాడని, అందుకు బ్రిటన్ లో అంబేద్కర్ ఉద్యమం ఇంతకు మునుపుల కాకుండా ఇపుడు ముక్కలు ముక్కలు అయిందని వ్రాసాడు. సెంటర్ నిర్వాహకుడి కార్యక్రమం లో పాల్గొనకుండా ఆ సెంటర్ లో ఎలా వసతి ఉండేదని అడిగితే. సెంటర్ అంబేద్కర్ వాడులందరి ఉన్నది ఆస్థి అని విద్యార్ధి మిత్రులు చెప్పారు. ఇంకా ఈ అంబేద్కర్ సెంటర్ నిర్వాహకుడు ఇద్దరు మహారాష్ట్ర ఎస్ సి విద్యార్థులను విరాళం చెల్లించలేదని అంబేద్కర్ సెంటర్ నుని ఒక రాత్రి బయటకు పంపిచి వేసాడు, దాంతో ఈ ఇద్దరు విద్యార్థులు కోర్ట్ కు వెళ్లి . అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ చారిటి సంస్థ కాబట్టి బలవంతంగా విరాళాలు వాసులు చేయడం అన్యాయమని వాదించడంతో కోర్ట్ విద్యార్థులకు మద్దతుగా తీర్పు చెప్పింది. దాంతో విద్యార్థులు మల్లి వచ్చి అంబేద్కర్ సెంటర్ లోనే ఉంటున్నారు. ఇటు అంబేద్కర్ సెంటర్ నిర్వాహకుడి మద్య అతని వ్యతిరేక వర్గం మద్య నేను అంబేద్కర్ సెంటర్ లో ఉన్న రెండు రోజులు కేవలం పడుకోవదనికే తప్ప అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. 

మొతానికి లండన్ లోని అంబేద్కర్ సెంటర్ ప్రస్తుతం గందరగోళం లో ఉన్నది. బ్రిటన్ లోని అంబేద్కర్ వాదులు బౌద్ధులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకొని ఇండియా లో ఉన్న తమ జాతి జనుల గురించి ఆలోచిస్తారని ఆశిస్తాను

బుద్ధ జయంతి : లండన్ లోని లు౦బిని నేపాలి బుద్ధ ధర్మ సొసైటీ వారు బుద్ధ జయంతి ఏర్పాటు చేసారు దానికి లండన్ లోని అన్ని దేశాలకు చెందిన బౌద్ధులు హాజరు అయ్యారు. నేను కూడా ఈ బుద్ధా జయంతి కి వెళ్ళాను కానీ ఇష్టం తో కాదు. నేను అంబేద్కర్ సెంటర్ లో ఉంటె అక్కడ జరిగే మీటింగ్ లో స్పీచ్ ఇస్తానేమో ననే అనుమానం తో అక్కడ ఉన్న విద్యార్ధి మిత్రులు నన్ను అక్కడే ఉన్న మరో గ్రూపు తో కలిపి ఈ బుద్ధ జయంతి కి పంపిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఒక సీనియర్ అంబేద్కర్ వాడి . కార్తీక్ నవయన్ ని మాట్లాడనియకుండా చేయడం అనేది తప్పు, ఆ అంబేద్కర్ సెంటర్ నిర్వాహకుదితో మనకు ఎన్ని గొడవలు ఉన్న , అవి మన మద్యనే ఉండాలే గాని ఇండియా నుండి వస్తున్న మన వారిపైన ఉండ కూడదని చెప్పాడు 

మొతానికి నా లండన్ ట్రిప్ కొన్ని సంతోషకరమైన కొన్ని ఇబ్బంది కరమైన సందర్బలతో గడచింది ఈ అవకాశన్ని కల్పించి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చిన  బ్రిటిష్ కౌన్సిల్ వారికీ యూత్ పాలసీ సెమినార్ సహా నిర్వాహకులు  ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వారికీ నా ధన్యవాదాలు, వీసా ప్రాసెస్సింగ్ మరియు లోకల్ ట్రావెల్ కు సపోర్ట్ చేసిన నేషనల్ దళిత ఫోరం వారికీ ధన్యవాదాలు 
 
లండన్ లో ట్రైన్లు ఒకే నిమిషం ఆగుతాయని అవి ఎక్కడం కష్టమని హైదరాబాద్ లో మిత్రులు చెప్పారు కానీ అదేమీ అంత కష్తమైనది కాదు  అక్కడి ట్రైన్స్ సిస్టం చాల పకడ్బందిగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిర్మించారు. లండన్ చాల బాగున్నధబ్బ!

                                                                           – కార్తీక్ నవయన్ 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: