Home » General » పరమకుడి దళితుల పై హత్యాకాండ ఎలా జరిగింది?. ఎందుకు జరిగింది?

పరమకుడి దళితుల పై హత్యాకాండ ఎలా జరిగింది?. ఎందుకు జరిగింది?

Start here

Advertisements

సెప్టంబర్ పదకొండు రోజున తమిళనాడు లోని పరమకుడి అనే పట్టణంలో తమ నాయకుడు అయిన ఇమ్మనుయాల్ సేకరణ్ యాబై నాలుగవ వర్దంతి జరుపుకునేందుకు వచ్చిన దళితుల లోని ఆరుగురు  దళితులను పోలీసులు కాల్చి చంపారు. మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన  వారిలో  (1 ) ఆర్ . గణేషన్ అరువై ఐదు సంవత్సరాలు    (౨) టి. పన్నీర్ సెల్వన్ 50  సంవత్సరాలు (౩ ) ఎస్ . వేల్లైచామి  అరువై ఐదు సంవత్సరాలు, ఈ ముగ్గురు వృద్దులు పోలీసులపై దాడి చేసి వాహనాలను తగులబెట్టారు కాబట్టి కాల్చి చంపమనేది పోలీసులు మరియు రెవిన్యూ అధికారుల  వాదన. వీరితోపాటు జయపాల్, తీర్తేకని, ముతుకుమార్ అనే ముగ్గురు యువకులు చనిపోయరు, పై ముగ్గురు వ్రుద్దులలో వేల్లచామి పోలిసుల తూటాలకు కాకుండా కేవం లాటి దెబ్బల కే చనిపోయాడు అందుకే నలపై మంది పోలీసులు వేల్లచామి శవం తో పటు గ్రామానికి వచ్చి పదిహేను నిమిషాలలో అంత్యక్రియలు చేయాలనీ కుటుంబ సబ్యులను బెదిరించి పదిహేను నిమిషాలలో అంత్యక్రియలు ముగించి న తర్వాతనే అక్కడినుండి వెళ్లారు. మరో వృద్దుడు అయిన ఆర్ . గనేషన్ తన కుమారుడి పెళ్లి పత్రికలు పంచడానికి పరమకుడి వెళ్ళాడు ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి కి వెళితే బంధువులంతా అక్కడే కలుస్తారని వెళ్ళాడు కానీ అతనికి గొడవలు జరుగుతున్న విషయం అర్థమయ్యే లోపే పోలిసుల తూటాలను ప్రాణం విడిచాడు. ఇందులో చనిపోయెన వారంతా రోజువారీ కూలీలు, తమ నాయకుడైన ఇమ్మనుయాల్ సేకరణ్ వర్దంతి కి వందన సమర్పణ చేసుకుందామని వచ్చారు కానీ, పోలీసులతో గొడవ పడడానికి ఎవరికీ ప్రణాళిక లేదు.  మరో వైపు పోలీసులు దళిత గ్రామాల పై బడి అనేక మంది దళితులను అరెస్టులు చేస్తున్నారు. బదితులపైననే కేసులు పెట్టి అరెస్టులతో వేదిస్తున్నారు ఇదంతా రాజకీయ కారణాలు లేకుండా జరిగేది కాదు. ఈ ప్రాంత దళితులను ఆర్దికంగా, రాజకీయంగా దెబ్బ తియదనికే జరిగిన కుట్ర లో బాగమే ఈ పొలిసు కాల్పులు, మరియు తదనంతర  నిర్బందము.
పరమకుడి లోని ” ఇమ్మనుయాల్ పెరవై” నాయకులూ చంద్ర బోస్ చెప్పిన వివరాల ప్రకారం ఈ పోలిసుల కాల్పులకు తక్షణ కారణం దళితులు రాస్తారోకో చేయడం, పదకొండు తారీకు నాడు ఇమ్మనుయాల్ సేకరణ్ వర్దంతి కి బయలు దేరిన జాన్ పాండియన్ అనే దళిత నాయకుడిని వల్లనాడు అనే గ్రామం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దళితులు దాదాపు రెండు వందల మంది రాస్తారోకో చేయడం ప్రారంబించారు, జాన్ పాండియన్ ఆచూకి తెలపాలని, వెంటనే విడుదల చేయాలనీ, డిమాండ్ చేస్తూ రాస్తారోకో కొనసాగించారు. కొందరు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర లో బాగంగా జాన్ పాండియన్ ని ఎన్కౌంటర్ చేసే ప్రమాదం కూడా ఉందని. దళితులు తమ రాస్తా రోకో ని కొనసాగించారు, ఇదే పోలీసులు కాల్పులు జరపడానికి తక్షణ కారణం కానీ సెప్టంబర్ మొదటి వరం నుండి రామనాథపురం జిల్లలో జరుగుతున్న సంఘటనలను సమగ్రంగా పరిశీలిస్తే దళితుల పైన జరిగిన ఈ హత్యా కాండ యద్రుచికంగా జరిగింది కాదని తేలి పోతుంది 
అసలు  జాన్ పాండియన్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు కలెక్టర్ చెపుతున్న కారణాలు ఏమిటంటే, జాన్ పాండియన్ ఇమ్మనుయాల్ సేకరణ్ వర్దంతి లో గొడవలు సృస్తిస్తాడని వారికీ రహస్య సమాచారం ఉందంట.  ఇలాంటి  విషయాల పై ఒక నిర్ణయానికి రావడానికి జిల్లా అధికారి గ కలెక్టర్ గారు అన్ని విషయాలను పరిశీలించా వలసి ఉంటుంది. కానీ ఎవరో సమాచారం ఇచారు కాబట్టి జాన్ పాండియన్ ని అడ్డుకుంటే వచ్చిన పరిణామాలు తద్వారా  జరిగిన ప్రాణ నష్టానికి ఎవరు బాద్యత? జాన్ పాండియన్ పరమకుడు వస్తే శాంతి బద్రతల సమస్య వస్తుందని అధికారులు బావించారు. కాని జాన్ పాండియన్ ని రాకుండా అడ్డుకోవడం వాళ్ళనే శాంతి బద్రతల సమస్య వచిని తద్వారా దళితుల హత్యాకాండ కు దారీ తీసింది ఈ హత్యాకాండ కు పూర్తి బాద్యత అవగాహనా రాహిత్యం తో ప్రవర్తించిన పొలిసు మరియు రెవిన్యూ అధికారులదే. 
సెప్టంబర్ మొదటి వారం నుండి పొలిసు మరియు రెవిన్యూ అధికారులు చాల పక్షపాత దొరనితో ప్రవర్తించారనేది ఈ క్రింది మూడు సంఘటనలతో తేలిపోతుంది. మొదటిది పల్లపచేరి లో పాలని కుమార్ అనే పదహారు సంవతరాల దళిత యువకుడిని కతులతో పొడిచి చంపడం. రెండవది దళితులు ఏర్పాటు చేసిన బాన్నర్ లను పోలీసులు తొలగించడం. మూడు జాన్ పాండియన్ ని అరెస్ట్ చేయడం. ఇక నాలుగవదైన పోలీసు ఫైరింగ్ పై మూడు సంఘటనలకు అంతిమ రూపం. ఇది పోలీసులు ఊహించినదే. దీనికి స్పష్టమైన ఆధారాలు చుపెట్టవచు. పైనుండి ఆదేశాల మేరకే పరమకుడి లో కాల్పులు జరిగినాయని  రామనాథపురం జిల్లలో చాలామంది కింది స్తాయి పోలీసులు, ప్రబుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు చర్చించు కుంటున్నారు. ఇంకా ముక్య మంతిర్ జయలలిత ప్రియ స్నేహితురాలు తేవర్ కులానికి చెందిన రాజకీయ నాయకురాలు శశికళ ఆదేశానుసారమే ఈ సంఘటనలన్నీ జరిగినాయని సామాన్య జనం చర్చించు కుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతో తేల్చే ప్రయత్నం ఎవరు చేయాలి? సి బి ఐ చేయగలద? రాజకీయ జోక్యము లేకుండా విచారణ జరిగితే సామాన్య జనం మాట్లాడుకుంటున్న విషయాలే నిజాలుగా ముందుకొస్తాయి.

ఆరుగురు దళితులను కాల్చి చంపడానికి కారణం వారు ప్రబుత్వ ఆస్తులను ద్వంసం చేయడం విది లో ఉన్న పోలిసులపైన దాడి చేయడమే కారణమని పోలీసులు ఇతర ప్రబుత్వ అధికారులు మీడియా లోను తమను కలవడానికి వచ్చిన హక్కుల సంఘాల వాళ్ళ తోను చెపుతున్నారు. కానీ లక్షల సంక్యలో పరమకుడి  కి వచ్చిన దళితుల ఉద్యేశం ప్రబుత్వ ఆస్తులను ద్వంసం చేయడం కాదు. ఎవరిపైనా దడి చేయడం కాదు, వారు తమ నాయకుడు అయిన ఇమ్మనుయాల్ సేకరణ్ 54  వ వర్ధంతి జరుపుకొనేందుకు  మాత్రమే పరమకుడి కి వచ్చారు 
దక్షిణ తమిళనాడులో ని దళితులు పల్లర్/మల్లార్/దేవెంద్రకుల. పై గత అర్థ శతాబ్దము కాలంగా హత్యాకాండ కొనసాగుతూనే ఉంది పంతిమ్మిది వందల యాబై ఏడు సెప్టంబర్ ఏడు న ఇమ్మనుయాల్ సేకరణ్ హత్యా గావించబడ్డాడు. ఆ తర్వాత సెప్టంబర్ పదమూడు తారికున అరుమ్కులం లో తేవర్ కులానికి చెందిన హంతకులు ఐదుగురు దళితులను సజీవ దహనం చేసి చంపేసారు అందులో ఒకరు మహిళా
సెప్టంబర్ పదహారు  తారికున వీరంబాల్, అరుమ్బకన్ , అరున్లన్దకట్టి, సందకోట్టై గ్రామాలకి చెందిన అరవై మంది దళితులను తేవర్ కులానికి చెందిన హంతకులు చంపివేసారు, సెప్టంబర్ పదిహేడున కీరంతై గ్రామం లో ఒక దళితుడిని పోలీసులు కాల్చి చంపారు పద్దేనిమిడిన తండికుడి అనే గ్రామంలో దేవెంద్రదర్ / దళితులకు చెందిన ఇండ్లను తగులబెట్టారు, ఆ తర్వాత వరసగా అదే రకమైన దాడులు దళితులపైన కొనసాగుతూనే ఉన్నాయి.  
ఇమ్మనుయాల్ సేకరణ్ ఎవరు ?
ఇమ్మనుయాల్ సేకరణ్  ప్రముఖ సంఘ సంస్కర్త స్వతంత్ర యోదుడు ,డాక్టర్ అంబేద్ కర్ కు సమకాలికుడు దక్షిణ తమిళనాడులో అంటారని తనానికి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన  దళిత నాయకుడు.  ఈ దళిత నాయకుడిని 11 / 09 /1957  న తేవర్ కులానికి చెందిన ముతరమలింగ తేవర్ అనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు హత్యా చేయించాడు. ముప్పై మూడు సంవత్సరా ల వయస్సులోనే హత్యా గావించా బడిన ఇమ్మనుయాల్ సేకరణ్ ఈ రోజు ఇక్కడి  దళితులకు ఆరాధ్య దైవం. అందుకే అయన వర్ధంతి  రోజున దక్షిణ తమిళనాడులోని దళితులంత తమ నాయకుడికి నివాళి అర్పించడానికి లక్షల సంక్యలో తరలి వస్తారు, అంచనాల ప్రకారం దాదాపు పది లక్షల పైన దళిత జనం మరియు దళిత నాయకులూ  అందరు  పరమకుడి కి వచ్చి ఇమ్మనుయాల్ శేకరన్ వర్ధంతి లో పాల్గొంటారు. ఇది 1988  నుండి ఇప్పటివరకు ప్రతి ఏడు జరుగుతున్నది. కానీ ఏ రోజు ఈ విషయం ప్రధాన స్రవంతి మీడియా లో రిపోర్ట్ కాలేదు. 
ఈ సంవత్సరం తో ఏమ్మనుయాల్ సేకరణ్ చనిపోయి 54 సంవత్సరాలు. ఈ 54 వ వర్ధంతి జరుపుకునేందుకు   ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దళితులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ప్రబుత్యం మరియు వివిధ శాకలకు చెందిన అధికారులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక ఆంక్షలు నిర్బందలతో ఈ ఏమ్మనుయాల్ సేకరణ్ వర్ధంతి సభ ను అడ్డుకోవడ్నికి అన్ని ప్రయత్నాలు చేసారు. ఆహార కేంద్రాలు నీటి కేంద్రాలు ఏర్పాటు చేసులోవదని అనుమతి ఇవ్వలేదు. అయిన దళితులు సర్దుకొని తమ నాయకుడి జయంతి వేడుకలో నిమగ్నమైనారు 
వరస సంఘటనలన్నీ రహస్య ప్రణాళికలో బాగమే
సెప్టంబర్ నెల  నుండి వరసగా రామనాథపురం జిల్లలో జరిగిన సంఘటనలను గమనించి నట్లఎతే పరమకుడి లో దళితుల హత్యాకాండ పోలీసులు,  స్తానిక తేవర్ కులానికి చెందిన రాజకీయ నాయకుల పకడ్బంది ప్రణాళిక లో బాగంగా నే జరిగింది అని అర్థం అవుతుంది. అయెతే అందరు ప్రబుత్వ అధికారులు అందరు తేవర్ కుల రాజకీయ నాయకులూ ఈ కుట్రలో బాగాస్వములని చెప్పలేము గాని కొంత మంది పొలిసు ఆఫీసుర్లు, రెవిన్యూ ఆఫీసుర్లు, రాజకీయ నాయకుల బాగస్వామ్యం లేకుండా పరమకుడి దళితుల హత్యాకాండ జరిగేది కాదు, అది కుట్ర కాబట్టే  ఒక దళిత నాయకుడు జాన్ పాండియన్  (తమిజ్హగా మక్కల్ మున్నేట్ర కగాజాం పార్టీ నాయకుడు) ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి కి హాజరు కావాల్సి ఉండగా అతన్ని రాకుండా వల్లనాడు అనే గ్రామం లో పోలీసులు అర్రెస్ట్ చేసారు. దీనితో అతని మద్దతుదారులైన దాదాపు రెండు వందల మంది ఐదు రోడ్ల చురాస్త లో ఒక రోడ్ పై రస్తా రోకో చేయడం మొదలు పెట్టారు. ఈ రెండు వందల మంది దళితులను పోలీసులు అత్యంత సునాయాసంగా బంధించి తీసుకువేల్లవాచు కానీ పోలీసులు వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు కాబట్టే కాల్పులకు దిగారు  ఎందుకంటే జిల్లా కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం పరమకుడిలో బందోబస్తు కోసం రెండు వేల మంది పోలీసులను మొహరించారు. ఈ రెండు వేల మంది పోలీసులు రెండువందల మంది నిరయుడులైన దళితులను అదుపు చేయలేక పోయారని అందుకే కాల్చి చంపారని చెపితే నమ్మసక్యంగా లేదు. పైగా దళితులు రస్తా రోకో చేస్తున్నది కేవలం ఒక రోడ్ మీదనే. ఇంకా దళితులు రాస్తారోకో చేస్తున్న రోడ్ పైకి  వాహనాలు రాకుండా మళ్ళించారు ఎందుకంటే ఆ  రోడ్ ఏమ్మనుయాల్  సేకరణ్ జయంతికి  వచ్చే  జనం  తో  నిండి  పోతుంది  కాబట్టి  . మరి  ట్రాఫ్ఫిక్ మల్లిన్చేసిన  రోడ్ పై రస్తారోకో చేస్తుంటే  పోలీసులకు  లాతిచార్జ్  చేసి  కాల్పులు  చేయాల్సిన  అవసరం  ఎందుకు  వచ్చింది. అసలు జాన్ పాండియన్ ని అరెస్ట్ చేయడమే మొత్తం కాల్పుల సంఘటన కు కారణం అయ్యింది. జాన్ పాండియన్ ని అర్రెస్ట్ చేస్తే శాంతి బద్రతల సమస్య వస్తునదని పోలిసుల కు అంచనా లేదా ? లేక ఎలాంటి పరిస్థితిని కావాలనే సృష్టించార అనేది తేలాల్సిందే  ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది  అనే దానికి రామనాథపురం కలెక్టర్ అరుణ్ రాయ్ చెపుతున్న కారణం దొంక తిరుగుడు వ్యవహారంగా ఉన్నది. మా నిజ నిర్దారణ బృందం అడిగిన ప్రశ్నకు కలెక్టర్ చెప్పిన ఆన్సర్ ఏమిటంటే” జాన్ పాండియన్ పరమకుడి వస్తే శాంతి బద్రతల సమస్య వస్తుంది అందుకనే అతన్ని రాకుండా ఆర్డర్ పాస్ చేశాను” అన్నారు మరి జాన్ పాండియన్ ని అడ్డుకోవడం వాళ్ళ తలెత్తిన శాంతి బద్రతల సమస్య పోలీసులకు, అధికారులకు అసలు సమస్య నే కాదన్నమాట. దళితులనుండి వచ్చే సమస్యలు ఏమైనా సరే వాటిని అనచివేయవచ్చు. అడిగే వారుండరు. కానీ అగ్రకులాలకు ఇక్కడి తేవర్ కులాలకు ఏదైనా సమస్య వస్తే మాత్రం అది పొలిసు సమస్య అది ప్రబుత్వ అధికారుల సమస్య గ ఎందుకు మారుతుంది?
అలాగే దళితులు ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి కోసం అర్పాటు చేసిన బ్యానర్ లను పోలీసులు కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించారు, కారణం ఏమిటంటే ఆ బ్యానర్ ల పై దైవ తిరుమగానర్ ఇమ్మనుయాల్ సేకరణ్ అని రాసి ఉండడం, అది స్థానిక తేవర్ కుల నాయకులకు మింగుడు పాడడం లేదు. వారు కలెక్టర్ కు కలిసి చెప్పడం తో కలెక్టర్ గారు ఆ బ్యానర్ లను తొలగించావలసింది గ ఆదేశించారు. పైగా బ్యానర్ లు తొలగించడాన్ని చాల తెలివిగా సమర్దిన్చుకున్తున్నారు ఆయన  చెపుతున కారణాలు ఏమిటంటే గత అర్ధ శతాబ్ది గ పల్లర్ ల కు (దళితులు) తేవర్లకు (మరవార్) జరుగుతున్న ఘర్షణలలో దాదాపు ప్రతిసారి దళితులే ప్రాణ నష్టానికి గురవుతున్నారని అలంటి దాన్ని నివారించడానికే తేవర్ లకు కోపం తెప్పించిన ఆర్ టి సి కార్మికులు కట్టిన బ్యానర్ లను తొలగించమని ఆదేశించినట్టు చెపుతున్నారు. కలెక్టర్ గారికి దళితుల పై న వారి ప్రనలపైన సానుబూతి ఉన్నది. కాని అది ప్రస్తుతం దళితులకు అవసరము లేదు కుతుకలు నరుకుతున్న ఎతిన తల దించని దళితులకు ఇపుడు ఎవరి సానుబూతి వద్దు. కలెక్టర్ గారు తమ రాజ్యాంగ విధులను గౌరవించి వారి బాద్యతలను నిర్వర్తిస్తే బాగుండేది. ఒక జిల్లా కలెక్టర్ నుండి దళితులు ఆశించేది సానుబుతి కనే కాదు 
ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి బందో బస్తు కోసం ఒక  ప్రత్యేక పొలిసు ఆఫీసర్ సెంథిల్ వేలన్ ఐ పీ ఎస్ ,  ని  నియమించారు ఈ పోలీసు ఆఫీసర్ అద్వర్యం లో నే దళితుల పై లాటి చార్జ్ మరియు కాల్పులు జరిగినాయి అయితే పోలీసులు లాటి చార్జ్ మొదలు చేసిన ఐదు నిమిషాలకే కాల్పులు ప్రారంబించారు, గాలిలోకి కాల్పులు చేయలేదు, మోకాళ్ళ కిందకి కాల్పులు చేయలేదు, రబ్బర్ బుల్లెట్లు వాడలేదు, వాటర్ కానోన్ లు వాడలేదు,బాష్ప వాయువు  ఇలాంటి ముందు జాగ్రతలు ఏవి పోలీసులు తీసుకోలేదంటే, వారు ఒక స్పష్టమైన లక్ష్యం తోనే దళితులను, వారి ఆత్మ గౌరవాన్ని దేబ్బతియాలనే ఉద్దేశ్యం తోనే ప్రవర్తించినట్టు అర్థం  చేసుకోవాలి  
తేవర్ కులం తమిళనాడులో ఎం బి సి గా చలామణి అవుతున్నది దక్షిణ తమిళనాడు లో దళితుల పై అన్ని రకాల అణచివేత ని కొనసాగిస్తునది ఈ కులమే, చెన్నై లోని డాక్టర్  అంబేద్కర్ లా కాలేజీ లో దళిత విద్యార్థుల పై దాడి చేసిన గూండాలు ఇదే తేవర్ కులానికి చెందిన విద్యార్ధి సంగం ముకులతుర్ మరవార్ పెరవై  చెందిన వారు.  తమిళనాడు రాష్ట్ర రావణ శాక ఎస్ సి ఎస్ టి ఉద్యోగుల సంగం పరమకుడి లో ఇమ్మనూఅల్ సేకరణ్ జయంతి గురించి  ఒక ఫ్లెక్ష్ బ్యానర్ కట్టినారు దానిపై ఇలా రాసారు ” దేశీయ తలైవర్, దైవ తిరుమగానర్ ఇమ్మనుయాల్ సేకరణ్ ” అంటే తెలుగులో ” జాతీయ నాయకులూ దేవకుమారుడు ఇమ్మనుయాల్ సేకరణ్ ” ఒక దళిత నాయకుడిని జాతీయ నాయకుడిగా గౌరావించడం  జీర్ణించుకోలేని తేవర్ కులానికి చెందిన ( మరవార్ )   ప్రబకరాన్ అనే మర తమిలర్ సేన నాయకుడు ఆ బ్యానర్ లను తొలగించాలని పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసారు అలాగే జిల్లా కలెక్టర్ కి కూడా కంప్లైంట్ చేసారు. కేవలం తమ కులానికి చెందిన ముతరమలింగ తేవర్ ని మాత్రమే దైవ తిరుమగానర్ అని పిలవాలని వేరే ఎవరిని అల పిలిచినా అంగీకరించేది లేదని వీరి వాదన. ఎలాంటి ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నామో తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పోడుతుంది 
ఇంతకు ముందు ఒక తమిళ సినిమా దైవ తిరుగామనర్ పేరుతో వస్తే అపుడు కూడా ఇలాగే గొడవలు చేసి ఆ సినిమా పేరును ” దైవ తిరుమగాన్” గ మార్పు చేయించారు ఇంత అరాచకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా, అప్రజస్వమంగా ప్రవర్తిస్తున్న తేవర్ (మరవార్) కులం ఇప్పటికి అత్యంత వెనుక బడిన తరగతి గ గుర్తించబడి పద్దెనిమిది  శాతం రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ లో వివిధ పార్టీలకు చెందిన తేవర్ (మరవార్) ఎం ఎల్ ఎ  లు 90 మంది ఉన్నారు. సినిమా రంగం, విద్య, పారిశ్రామిక, రాజకీయ రంగాలలో ఆదిపత్య స్థానం లో ఉన్న ఈ కులం దక్షిణ తమిళనాడు లో దళితుల పై నిత్యం అత్యాచారాలు హత్యలకు పాల్పడుతున్నది, ఇపుడు జయలలిత ముక్యమంత్రి కావడంతో వీరి కి అడ్డు లేకుంగా పోయింది ఎందుకంటే జయలలిత కు అత్యంత ప్రియమైన శేహితురాలు శాశిలక కూడా తేవర్ (మరవార్) కులానికి చెందినదే. ప్రస్తుతం పరమకుడి పొలిసు హత్యాకాండ అంతకు ముందు దళితుల మీద జరిగిన ఇతర అత్యచారలన్నితి వెనుక శశికళ తేవర్ రహస్య హస్తం ఉన్నట్టు ద్రువికరించలేని సమాచార్మైతే ఉంది. 
ఆ ఫ్లెక్ష్ బ్యానర్ లను తొలగించాలనే తేవర్ కుల సంగ నాయకుల మరియు పోలిసుల బెదిరిమ్పుని దళితులు వ్యతిరేకించారు, ప్రబుత్వ ఉద్యోగాలలో ఉన్న కొంత మంది దళితులు పోలిసుల మరియు రెవిన్యూ అధికారుల బెదిరింపుల కు వారు కట్టిన బ్యానర్ లు తొలగించారు కానీ, మిగతా దళిత సంగాలు కట్టిన బ్యానర్ లు అలాగే ఉంచడంతో పోలీసులు అసహనంగా మారిపోయారు, అంతే కాకుండా ” దళితులు పోలీసులతో సహకరించడం లేదు కాబట్టి పోలీసులు కూడా దళితులతో సహకరించేది లేదని ” చెప్పేసారు ఇది పదకొండు నాడు జరిగిన పొలిసు కాల్పులకు ముందస్తు సంకేతం 
అలాగే తొమ్మిది సెప్టంబర్ తారికున రాత్రి పళ్ళ పచేరి గ్రామానికి చెందిన పాలని కుమార్ అనే ఇంటర్మీడియట్ చదువుతున్న పదహారు సంవతరాల దళిత యువకుడిని మండలమనికం గ్రామానికి చెందిన తేవర్ కులస్తులు ఆ ఉరిలో జరిగిన ఒక నాటకం చూసి ఇంటికి వస్తున్న సమయం లో కతులతో పొడిచి చంపేసారు, దానికి వారు చెపుతున్న కారణం ఏమిటంటే ఆ యువకుడు ఆ గ్రామం లోకి వచ్చి అక్కడి రేషన్ షాప్ గోడ మీద ” ముతరమలింగ తేవర్ ఒక కొజ్జ ” అని రాసాడని అందుకే అతడిని చంపెసరై చెపుతున్నారు. నిజానికి ఆ గోడ మీద రాసిన గుర్తులని చెరిపేసిన ఆనవాలు ఇప్పటికి ఉన్నాయి అయితే ఒక పదహారు సంవత్సరాల యువకుడు ఎంత ఎత్తు ఉంటాడో  అంత కంటే ఎత్తు న చెరిపేసిన ఆనవాలు ఉన్నాయి. కాబట్టి ఆ యువకుడు రాసి ఉండే అవకాసం లేదు. మరొక విషయం ఏమిటంటే అసలు పల్లపచేరి గ్రామస్తులు మండలమనికం గ్రామానికి రావడానికే జడుసు కుంటారు ఎందుకంటే అది తేవర్ కులానికి చెందిన గ్రామం. పళ్ళ పచెరీ,  పల్లర్ (దళితుల ) గ్రామం దళితుల జనాబా రెండు వందల కుటుంబాలు కాగా తేవర్ కులానికి చెందిన కుటుంబాలు ఒక వెయ్యి ఉంటాయి అందుకే పళ్ళ పచేరి కి చెందిన దళితులు తమకు తేవర్ లకు చెందిన మండల మానికం గ్రామం నుండి కాకుండా డైరెక్ట్ గ మెయిన్ రోడ్ వెళ్లేందుకు దారీ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అందుకే  ఈ పళ్ళ పచేరి గ్రామానికి చెందిన నలబై తొమ్మిది మంది దళిత విద్యార్థులు. కేవలం ఒక కిలోమీటర్ దూరం లో ఉన్న మండలమనికం ఉన్నత పాటశాల ను వదిలి  ఎనిమిది కిలోమీటర్ ల దూరం లో ఉన్న మరో పాటశాల కు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఒక దళిత యువకుడు ఆ గ్రామం లోని రేషన్ షాప్ గోడమీద ఆ గ్రామా కులం తేవర్ కులానికి చెందిన ముతరమలింగ తేవర్ గురిచి దుషిస్తూ రాసాడని చెప్పడం నమ్మసక్యంగా లేదు. ఈ తేవర్ ల చేతిలో హత్యా గావించా బడిన పలనికుమార్ హత్యా కేసును పోలీసులు ” గుర్తు తెలియని వ్యక్తులు చంపారని  నమోదు చేసిన్నట్టు పళ్ళ పచేరి గ్రామస్తులు అంటున్నారు. ఇంత వరకు ఎవరిని అర్రెస్ట్  చేయలేదు. ఈ హత్యా తో బయ బ్రాన్తులకు   గురయిన పళ్ళ పచేరి గ్రామా దళితులు. తమ నాయకుడయిన జాన్ పాండియన్ ను తమ గ్రామానికి రావాల్సింది గ ఆహ్వానించారు, కానీ స్థానిక పోలీసులు మరియు రెవిన్యూ అధికారులు జాన్ పాండియన్ పల్లపచేరి గ్రామానికి రాకుండా నిషేదించారు. జాన్ పాండియన్ వస్తే శాంతి బద్రతల సమస్య వస్తుందని చెప్పారు. దానితో జాన్ పాండియన్ పళ్ళ పచేరి గ్రామాన్ని దర్శించడం మానుకొని, ఈ నెల పదకొండు తేదిన పరమకుడి లో జరగనున్న ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి తర్వాత వస్తానని జాన్ పాండియన్  చెప్పారు కానీ. పోలీసులు జాన్ పాండియన్ ని పదకొండు తారికున అరెస్ట్ చేసిన పోలీసులు పద్ముడు తారీకు వరకు విడుదల చేయలేదు. హై కోర్ట్ లో హబియాస్ కార్పస్ పిటిసన్ వేసిన తర్వాత నే పోలీసులు జాన్ పాండియన్ ని విడుదల చేసారు
 
ప్రబుత్వ అధికారుల పక్షపాత దొరని
పళ్ళ పచేరి గ్రామం కు చెందిన దళిత యువకుడు పలనికుమార్ ను మండల మానికం గ్రామానికి చెందిన తేవర్ కులానికి చెందిన హంతకులు హత్యా చేసినట్టు తెలిసిన ఆ హత్యకేసు ను గుర్తుతెలియని వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేసారు. ఇది పక్షపాత బుడ్డి తప్ప మరొకటి కాదు
బ్యానర్ లు ఏర్పాటు చేసుకోవడం తమ నాయకుడిని గౌరవించుకోవడం దళితుల ప్రజాస్వామికమైన హక్కు అయినప్పటికీ ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి కోసం బ్యానర్ లు కట్టిన దళితులను పోలీసు స్టేషన్ పిలిచి. ఆ బ్యానర్ లను తొలగించమని పోలీసు ఇన్స్పెక్టర్ దళితులని ఒతిడి చేయడం పోలీసులు నిర్మొహమాటంగా అక్కడి తేవర్ కుల ప్రయోజనాలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు, దానికి కారణం ఏమిటంటే వారు (తేవర్) మరవార్ కుల రాజకీయ నాయకత్వం నుండి వారికీ అభయ హస్తం ఉన్నది
జాన్ పాండియన్ ని అరెస్ట్ చేయడం వెనక కూడా తేవర్ కుల రాజకీయ నాయకుల హస్తం ఉన్నది, దళితులకు అత్యంత ప్రాముక్యత గలిగిన కార్యక్రమమైన ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి రోజు ఒక దళిత నాయకుడిని అరెస్ట్ చేస్తే దళితులు ఆందోళన చేస్తారనే అంచనా పోలీసులకు గాని రెవిన్యూ ఆఫీసర్ లకు గాని లేదా? ఉన్న కూడా వారు వారి రాజకీయ నాయకత్యాల నిర్నయాలనే అమలు చేయదలచుకున్నారు అందుకే జాన్ పాండియన్ ని అరెస్ట్ చేసి తద్వారా జరిగిన దళితుల రాస్తా రోకోలో ఆరుగురు దళితులని కాల్చి చంపారు. ఇది వారి దృష్టిలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే తమిళనాడు పొలిసు మరియు ఇతర ప్రబుత్వ శకాలు అన్ని తేవర్ (మరవార్) కుల రాజకీయ నాయకుల కన్ను సన్నల్లో నడుస్తున్నవి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం .

ముగింపు
దేశ వ్యాప్తంగా దళితుల పై సాముహిక హత్యాకాండలు జరుగుతూనే ఉన్నాయి, ఈ దేశానికి స్వతంత్రము రక ముందు దళితులపై వివక్ష, దోపిడీ, అణచివేత ఉన్నా సాముహిక హత్యా కండలు లేవు. కానీ స్వతంత్రము వచ్చిన తర్వాత దాదాపు ఈశాన్య రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో దళితులపై హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. ఇది ఏమి స్వతంత్ర దేశమో? కొన్ని చోట్ల హిందూ కుల దుర్మార్గులే స్వయంగా దళితులపై దడి చేసి చంపుతుంటే, మరి కొన్ని చోట్ల, అగ్ర కులాలు తమ చేతులకు మట్టి అంటకుండా పోలీసులతో దళితులపై హత్యా కంద కొనసాగిస్తున్నారు పరమకుడి దళితుల హత్యాకాండ అందులో బాగమే, పరమకుడి హత్యాకాండ లో పాల్గొన్న పొలిసు అధికరులన్దరిని హత్యానేరం కింద అరెస్ట్ చేసి శిక్షించాలి, ఇమ్మనుయాల్ సేకరణ్ జయంతి ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుపుకోనివ్వాలి, ప్రబుత్వ అధికారులు, పొలిసు అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలి, తేవర్ కుల న్యాయాన్ని అమలు చేయకుండా, రాజ్యాంగాన్ని అమలు చేయాలి, పోలీసు ఉద్యోగాల నియామకాలలో దళితులను చేరకుండా అనేక అడ్డంకులు సృస్తిస్తున్నట్టు అనేక అధరాలు ఉన్నాయి. అలాగే తేవర్ కులానికి చెందిన నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలలో అర్హతలు లేకున్నా చొప్పిస్తున్నారు అందు వల్లనే ఈ రోజు దక్షిణ తమిళనాడులో ని పోలీసు డిపార్టుమెంటు లో ముప్పై శాతం ఉద్యోగులు తేవర్ కులానికి చెందిన వారె. ఇలా ఉన్నపుడు దళిత బాదితులకు న్యాయం ఇలా జారుతుంది. అక్రమంగా పొలిసు ఉద్యగాలలో  చేరిన తేవర్ కులనికిచెండిన అనర్హులను వెంటనే తొలగించాలి. తేవర్ కులాన్ని బి సి జాబితా నుండి వెంటనే తొలగించాలి

– బత్తుల కార్తీక్ నవయన్ 

ప్రోగ్రాం ఆఫీసర్ 

నేషనల్ దళిత ఫోరం 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: