Home » General » స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ , ట్రైబల్ సబ్ ప్లాన్ ల చట్ట బద్దత కోసం రాజ్య సభ లో ప్రైవేటు మెంబెర్ బిల్ : పత్రికా ప్రకటన

స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ , ట్రైబల్ సబ్ ప్లాన్ ల చట్ట బద్దత కోసం రాజ్య సభ లో ప్రైవేటు మెంబెర్ బిల్ : పత్రికా ప్రకటన

Start here

Advertisements

 

రాజ్య సభ సబ్యులైన శ్రీ అజీజ్ పాషా గారు, స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ లకు చట్ట బద్దత కల్పించే బిల్లును రాజ్యసభ లో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు డిసెంబర్ తొమ్మిది తేదిన రాజ్యసభ లో చర్చకు వస్తుంది
షెడ్యులు కులాల మరియు శేద్యులే తెగల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా  స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి నేతృత్వం లోని ప్రబుత్వం ఈ విధానాన్ని ప్రవేశ పెట్టగా,  అప్పుడు  ప్లానింగ్ కమిసన్ సబ్య కార్య దర్శి గా ఉన్న ప్రస్తుత ప్రధాని మాన్ మోహన్ సింగ్ గారు స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సుబ ప్లాన్ లకు మార్గదర్శకాలను రూపొందించారు. దళితుల పై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు లను నివారించడం దళితులను అత్దికంగా అభివృద్ధి చెందించడం ద్వారానే సాధ్యం అవుతుందని ఇందిరా గాంధీ రాష్ట్రాలకు రాసిన లేకలో పేర్కొన్నారు
కానీ గత  ముప్పయి సంవత్సరాలు గ ఉనికి లో ఉన్న ఈ స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సుబ ప్లాన్ దళితుల, ఆదివాసుల అభివృద్దికి ఏ మాత్రం ఉపయోగ పడలేదు. దళితులకు ఆదివాసులకు స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సుబ ప్లాన్ ల కింద చెందవలసిన లక్షల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు మొదటినుండి దారీ మళ్ళించి ఇతర పనులు అంటే దళిత ఆదివాసుల అభివృద్దికి ఎలాంటి సంబందం లేని వాటికీ కర్చు చేస్తున్నారు కేవల స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ కింద నే గత పది సంవత్సరాల కాలం లో కేంద్ర ప్రబుత్వం నలుగు లక్షల ఏబై వెయిల కోట్లు నిరాకరించింది, గత ముప్పయి సంవత్సరాల నుండి లెక్కిస్తే ఈ సంఖ్యా ఇంకా పెరుగుతుంది
కుల వ్యవస్థ ప్రతిపాదించిన అంటారని తనం, అసమానతల వాళ్ళ దళితులు సామాజికంగా, ఆర్ధికంగా, విద్య పరంగా అన్ని విధాలుగా వెనుక బడినారు, ఆదివసులది కూడా అదే పరిస్థితి , కవుల ఈ దళితులను ఆదివాసులను ఇతర సమూహాల తో పాటు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తో మన రాజ్యాంగం వారికీ అనేక రక్షణలు కల్పించింది. ఆర్టికల్ నలబై ఆరు , ఆర్టికల్ పదిహేను(నాల్గు) ఆర్టికల్ పదిహేను (ఐదు) ఆర్టికల్ పదహారు (నాల్గు) ఆర్టికల్ పదహారు (నాల్గు-ఏ) ఆర్టికల్ పదహారు (నాల్గు-బి) . ఇంకా ఈ రాజ్యాంగ రక్షణలే కాకుండా కేంద్ర ప్రబుత్వం అనేక చట్టాలు , విధానాలు కూడా రూపొందించింది. కాని దళితుల ఆదివాసుల అభివృద్దికి సంబంధించిన ఏ చట్టమైన ఏ విధానమైన వీసమెత్తు కూడా అమలుకు నోచుకోవడం లేదు
అందుకే స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ రుపొంచించి ముప్పయి సంవత్సరాలు గడచినా వాటి అమలు కోసం మాత్రం అటు కేంద్ర ప్రబుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రబుత్వాలు కానీ  చొరవ చూపించడం లేదు అందుకే దళితులు ఆదివాసుల అభివృద్దికి కేటాయించవలసిన లక్షల కోట్ల రూపాయలను దారీ మళ్ళించి ఇతర పనులకు ఉపయోగిస్తున్నారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్యం స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ నిధులతోనే జల యజ్ఞం, పబ్లిక్ గార్డెన్ నిర్వహణ, హుస్సేన్ సాగర్ శుద్ధి , బేగంపేట ప్లయ్ ఓవర్ నిర్మాణం లాంటివి చేపట్టింది.
ఈ క్రమం లో నేషనల్ దళిత ఫోరం మరియు దళిత మనవ హక్కుల జాతీయ ప్రచారోద్యమం అనే సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ సమగ్రంగా అమలు జరగాలంటే వీటికి చట్ట బద్దత కల్పించాలని జాతీయ స్థాయిలో ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. అందులో బాగంగానే కంమునిస్ట్ పార్టీ నాయకులూ రాజ్య సభ సబ్యులైన శ్రీ అజీజ్ పాషా గారి ద్వార  ప్రస్తుతం రాజ్య సభ లో ప్రైవేటు బిల్లు పెట్టడం జరిగింది
ఈ బిల్లు స్పెషల్ కంపోనేంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సుబ ప్లాన్ లకు చట్టబద్దత కల్పించడం తో పాటు జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో  దళితుల మరియు ఆదివాసుల సామజిక, ఆర్దిక అభివృద్దికోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదించడము జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో దళితుల ఆదివాసుల అభివృద్దికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చ్యల్ని ఈ బిల్లు లో పేర్కొనడం జరిగింది
శ్రీ అజీజ్ పాషా
రాజ్య సభ సబ్యులు
కంమునిస్ట్ పార్టీ అఫ్ ఇండియా నాయకులూ
ఆర్. రవి కుమార్
కార్యదర్శి
నేషనల్ దళిత ఫోరం
ఎన్. పాల్ దివాకర్
కన్వినర్
దళిత మనవ హక్కుల జాతీయ ప్రచారోద్యమం
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: