Home » General » యిటు వంటి మనిషి ఇక దొరకడు

యిటు వంటి మనిషి ఇక దొరకడు

Start here

Advertisements

 

సత్యమూర్తి ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికీ వారు తేల్చుకోవాల్సిందే కానీ తప్పకుండా అందరు అర్థం చేసుకోవాల్సిన మనిషి అతను. నిజాయితిగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవి గ అర్థం అవుతాడు, విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడు గా అర్థం అవుతాడు. పేదలకు అతనొక్క మహా పేదవాడుగ అర్థం అవుతాడు. తత్వవేతలకు అతనొక్క గొప్ప తాత్వికుడు, ఒకమనిషిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది కావచు కానీ, సత్యమూర్తి ని అర్థం చేసుకోవాలంటే అతని రచనల తో పాటు అతని బ్రతుకుని అర్థం చేసుకోవాలి

సాంప్రదాయ అగ్రకుల మద్య తరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు  సత్యమూర్తి దూరంగా ఉన్నాడు, అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు.అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మద్య contradiction లేదు. విప్లవకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలం లో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు . తను వదిలి వెళ్ళిన తన పిల్లలు దగ్గర గడిపాడు. 2009 వరకు ఏదో ఒక కార్యక్రమం లో ఎవరో ఒకరి తో తిరుగుతూనే ఉన్నాడు  ప్రదానంగా తెలంగాణ ప్రాంతం లో ఇప్పటికి  ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబందమైన సమస్యలు వచ్చి తన కూతురు తో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్బాలు అన్దేకం ఉన్నాయ్.  అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరు వేరు గ చూడలేము. అతను ఎ సిద్ధాంతాలు, ఎ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఎ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజలమధ్య, అదే పేదల మద్య బ్రతికాడు అదే ఇతర కవులకు, సత్యముర్తికి ఉన్న తేడా

సత్యమూర్తి తో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే ద్రిష్టి చాల బిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి మనం చిన్న చిన్న విషయాలు  అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తి కి చాల స్పష్టమైన ఖచితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంబీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు

సత్యమూర్తి మా హైదరాబాద్ లో ఉన్నపుడు అపుడపుడు న రూం లో ఉండేవాడు. ఒకసారి సత్యమూర్తి నా రూం లో ఉన్నపుడే నాకు కావాల్సిన బార్య మా కోసం సీతపల పండ్లు తీసుకోచింది.  సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పను, ఎవరు తీసుకోచారు అని అడిగాడు, విజయ తీసుకోచిందని చెప్పను, విజయ తీసుకొస్తే సీత పలములు అంటావేమిటి  బాబు అవి విజయ పలములు అన్నాడు

నేను ది బి ఎస్ ఎస్ కో కన్వినర్ గ ఉన్నపుడు మెదక్ జిల్లా ది బి ఎస్ ఎస్  కార్యదర్శి డప్పు శివరాజు ఫోన్ చేసి “చేగుంట లో అంబేద్కర్ మేడలో చెప్పు దండ వేసారని” వెంటనే నిరసన కార్యక్రమాలు చేయడానికి రావాలని ఫోన్ చేసాడు. అపుడు సత్యమూర్తి న ప్రక్కనే ఉన్నాడు. ఏమి జరిగింది బాబు అని అడిగాడు చేగుంట లో అంబేద్కర్ మేడలో చెప్పు దండ వేసారని” చెప్పను. ” అంబేద్కర్ మేడలో కాదు బాబు అంబేద్కర్ విగ్రహం మేడలో వేసారు” అన్నాడు

సత్యమూర్తి తన డెబ్బయి ఐదు సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవిత గడిపాడు, అజ్ఞాత జీవిత అంటే హైదరాబాద్ లోనో బెంగళూరు లోనో కాదు. ఖమ్మం వరంగల్ జిల్లా అడవుల్లో 2000 – 2002  సంవత్సరాల మద్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు చాల మంది యువకులకు స్పూర్తినిచాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది అది కేవలం సత్యమూర్తి కే సాద్యం. ఎన్ని విప్లవ కవిత్వాలు రాసిన, ఎన్ని విప్లవ రాజకీయాలు మాట్లాడిన హైదరాబాద్ లేదా బెంగళూరు బంగ్లాలు వదలని వారె ఇపుడు పేరు మోసిన విప్లవ కారులు. ఒకసారి ఖమ్మం అడవిలోనుంది సత్యమూర్తి తో కల్సి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అపుడు న దగ్గర పదివేలు రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను, సర్ ఒక వేల పోలీసులు మనలను పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను న దగ్గర గుర్తింపు కార్డు ఉండి, వారు న దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకేల్తున్నానని చెపుతాను, మరి నీవేమి చెపుతావని అడిగాను. అపుడు సత్యమూర్తి ” ఒక వేల పోలీసులు న దగ్గరి డబ్బుల గురుంచి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను బాబు” అన్నాడు వారికీ కావాలంటే యిచేస్తాను అన్నాడు

సత్యముర్హ్తి  షుగరు బిపి కి మందులు వాడుతుండేవాడు, రాంనగర్ లో ఉంటున్న కాలం లో పొద్దున్నే వాకింగ్ కు వెళ్ళేవాడు హిందూ పేపర్ , ఇడ్లీ తేచుకునేవాడు తప్పకుండ మందులు వేసుకునే వాడు సందర్బం వచ్చి   కలేకూరి ప్రసాద్ గురించి మాట్లాడుతూ అతను వీలైనంత  తొందరగా చనిపోవాలని కృషి చేస్తున్నాడు బాబు, నేను జీవితాన్ని వీలైనంత పొడగించాలని చూస్తున్నాను అన్నాడు

సత్యమూర్తి ని లెక్క కట్టేసారు,  అతను శ్రీ శ్రీ తర్వాత అని లేక్కేసారు, దానికి కొలమానము ఏమిటో? నిజానికి సత్యమూర్తి కి ఎవరితో పోలిక సరికాదు అతను ఎవరి తరవాత కాదు అతనికి అతనే సాటి. యిక్కడి  విప్లవ కవులు అందరు సత్యమూర్తి ద్వారా స్పూర్తి పొందిన వారె.  సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామజిక విప్లవ నాయకుడు. అతను కవిత్వం మాత్రమే రాయలేదు కవిత్వం సత్యమూర్తి కి తన విప్లవ ఆచరనో లో బాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తి ని ఎ మాత్రం ఆచరణ లేని  ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చుడండి. అందుకని పోలికలు వద్దు.  సత్యమూర్తి విప్లవ కవిత్వమైన దళిత కవిత్వమైన, విప్లవోద్యమమైన దళితోద్యమమైన అగ్రశ్రేణిలో ఉంటాడు అది సైద్దంతికమైన ఆచరణ రిత్యనైన సత్యమూర్తి సత్యముర్తే

తన చుట్టూ ఉన్న మనుషులను నర సంపదగా బావించే తత్వం సత్య మూర్తి ది, సత్యమూర్తి నుండి నేర్చుకొనే వి చాల ఉన్నాయి. చాల బావోద్వేగామైన వ్యక్తి మనుషులను అమితంగా ప్రేమించేవాడు పాత మిత్రులను గుర్తుచేసుకొనే వాడు అనేక విషయాలు చెప్పేవాడు, ఎవరి గురించి అబద్దాలు చెప్పేవాడు కాదు మనుషులంటే, పేదలంటే అతనికి అమితమైన ప్రేమ. ఆ ప్రేమనే అతనిని జీవితాంతం విప్లవకారుడిగా నిలబెట్టింది

దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగ  సత్యమూర్తి ని నిర్లక్ష్యం చేసాయి, విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన contribution ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైన సరే  మౌనంగానే  ఉన్నారు. ఈ పరిదుల నుండి విప్లవోద్యమము. దళితోద్యమము బయటపడడం అవసరంఉంది

విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి తన జీవితమంతా దార పోసాడు సత్యమూర్తి. పేదలు , దళితులు , పీడితులు, అణచబడిన జన గణాలు  సత్యమూర్తి అలియాస్ శివసాగర్ ని అను నిత్యం తలచుకుంటారు

– కార్తీక్ నవయన్

Advertisements

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: