Home » General » @@@ కొత్త సంవత్సర సంబరాలు కాదు.. గర్వంగా విజయోత్సవాలు చేసుకుందాం @@@

@@@ కొత్త సంవత్సర సంబరాలు కాదు.. గర్వంగా విజయోత్సవాలు చేసుకుందాం @@@

Start here

Advertisements

—- భీమ్-కోరేగావ్ యుద్ధం — జనవరి 01, 1818. —-

*** తన చరిత్ర తెలియని వాడు చరిత్ర శృష్టించలేడు – బాబాసాహెబ్ అంబేద్కర్ ***

     భారతదేశ చరిత్రను బ్రాహ్మణీకరణ చేసే క్రమంలో మనువాద చరిత్రకారులు, మన పూర్వికుల చరిత్రను మరుగున పరచి, చరిత్ర పుస్తకాలను అబద్ధాలతో, వక్రీకరణలతో నింపివేసారు.. ఈనాడు ఈ నీచత్వంలో మరో ముందడుగు వేసి రామాయణ, మహా భారతం లాంటి అభూత కల్పనలతో చరిత్రను నింపే జుగుప్సాకారమైన ప్రయత్నం చేస్తున్నారు మనువాద మూక..

     ఈ రకమైన చర్యల వలన, మన సమాజం తమ చరిత్రను తెలుసుకోలేక, తిరగబడలేని స్థితికి చేరి, బానిసత్వాన్ని ఆనందంగా అనుభవించే ఒక చచ్చుబడిన, చేవలేని సమాజంగా మారిపోయింది..

     ఇలా బానిసత్వాన్ని హక్కుగా, బాధ్యతగా, కర్మగా భావిస్తున్న మన సమాజం., “ఆనందాన్ని ఆత్మాభిమానంతో బ్రతకడంలో కాకుండా., ఆటవిడుపులో వెతుక్కుంటూ”.. జాతి ద్రోహులుగా మారి మన భావి తరాలను పూర్తి బానిసత్వంలోనికి నెడుతున్నారు..

—- భీమ్-కోరేగావ్ యుద్ధం — జనవరి 01, 1818. —-

     శిరూరు క్యాంపు హెడ్ క్వార్టర్సును చేరిన బ్రిటిష్ దూత, అక్కడ అధికారిగా ఉన్న లెప్టినెంటు కల్నల్ ఫిల్స్మన్ కు సందేశం అందించాడు. కల్నల్ బార్టన్ పంపిన ఈ సందేశం సారాంశం “2వ బాజీరావు పీష్వా ఆధ్వర్యంలోని సైన్యం పూణాను చుట్టుముట్టి ఉంది., వారిని ఎదుర్కొనేందుకు తగిన సైనిక బలగాలు పంపమని”.

     అప్పటికే తమ వద్ద తీవ్రమైన సైనిక కొరతతో భాధ పడుతున్న ఫిల్స్మన్ తీవ్ర సంగ్దిద్ధంలో పడ్డాడు.. తక్కువ సంఖ్య అయినా అత్యధిక, అసమాన ధైర్య సాహసాలు గల సేనల అవసరం ఉంది.. అప్పుడే తన మెదడులో ఒక మెరికలాంటి ఆలోచన కలిగింది..

     1779 వద్గావ్ యుద్ధంలో మహాదాజీ షిండే నాయకత్వంలో పీష్వాల తరపున యుద్ధం చేసి, బ్రిటిష్ సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించినప్పటికీ ,కూడా,. పీష్వాల చేత సామాజిక అణిచివేతకు గురవడంతో తిరుగుబాటుగా బ్రిటీషు సైన్యంలో చేరిన 500 మంది ప్రాచీన భారత నాగావంశ వీరులు-మహర్ సైనికులతో ఏర్పాటు చేసిన బొంబాయి ఇన్ఫాంటరీ, మొదటి రెజిమెంటు, రెండవ బెటాలియన్ గుర్తుకొచ్చింది.. వెంటనే ఆ బెటాలియన్ అధికారి క్యాప్టెన్ స్టాటన్ కు వర్తమానం పంపారు..

    ఆ వర్తమానం అందిన క్యాప్టెన్ స్టాటన్, మహర్ సైనికులకు నాయికత్వం వహిస్తున్న సుబేదార్ శిద్దినాక్ కు విషయం తెలియజేసి సహాయం కోరాడు.. పరదేశస్తుల తరపున పోరాడి సాటి భారతీయులతో యుద్ధం చేయడం ఇష్టం లేని శికనాక్, కొంత సమయం కోరారు..

     ఈ సమయంలో పీష్వాల సైన్యాధికారి బాపు గోఖలేని కలిసి ఈ విధంగా అడిగారు.. “బ్రిటీషు సైన్యంతో కలిసి స్వంత దేశస్తుల మీద యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు.. యుద్ధం నిరాకరించి పీష్వాల విజయానికి తోడ్పడితే, స్వతంత్ర పీష్వా రాజ్యంలో మా(అతి శూద్రుల) పరిస్థితి ఏ విధంగా ఉంటుంది.”

     దానికి సమాధానంగా, మనుస్మృతి మదంతో ఉన్న బ్రాహ్మణుడు బాపు గోఖలే, వికృతంగా నవ్వుతూ ఈ విధంగా జవాబు ఇచ్చాడు “మేం గెలిస్తే సాంప్రదాయంగా కొనసాగుతున్న వర్ణాశ్రమధర్మం మీకు ఇచ్చిన స్థానాన్నే పదిలపరచబడుతుంది”. అన్నాడు..

     పీష్వాల పోరాటం భారత ప్రజలను విముక్తులను చేయడానికి ఏ మాత్రం కాదు.. నీచ బ్రాహ్మణ హైందవ వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుకుని, బహుజనులను ఆర్థిక సామాజిక పీడనకు గురి చేయడానికేనని అర్థం అయిన శిద్దినాక్, స్టాటన్ దగ్గరికి వెళ్ళి యుద్ధంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసాడు..

        @@ జనవరి 01, 1818 @@

     శిద్దినాక్ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు, 250 మంది అశ్వదళం, 24 గన్నర్లతో బయలుదేరారు.. వెంటతెచ్చిన రేషను సరిపోక మిగిలిన బియ్యంతో గంజి పెట్టుకుని తాగి ముందుకు కదిలారు.. బెటాలియనుకు కోరేగావ్, గ్రామంలో(పూణాకు 30 కి.మి) భీమా నది ఒడ్డున., 25000 పదాతిదళం, 7000 మంది అశ్వదళంతో కూడిన పీష్వాల సైన్యం ఎదురైంది.

    దాదాపు 50 రెట్లు అథికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసిన వెరవక, ముందుకు దూకింది మహర్ సైన్యం.. మధ్యాహ్నానికి తమ అశ్వదళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారు కూడా పారిపోయినా కూడా వెనకడుగు వేయకుండా, ఒక్కొక్క సైనికుడు 40 మందితో పోరాడడం చూసి, భయపడిపోయిన కేప్టన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనలను లొంగిపోమని ఆజ్ఞాపించాడు.

   అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శిద్దినాక్ నాయక్ ఈ విధంగా తీవ్ర స్వరంతో గర్జించాడు..

** “స్టాటన్ సాబ్.. మేం మహర్ జాతిలో పుట్టిన వాళ్ళం..చరిత్రలో మాకు అవకాశం వచ్చిన ప్రతీసారీ మేము ఏమిటో నిరూపించాం.., ఈ రోజు మాకు అవకాశం మళ్ళీ వచ్చింది.. వందల సంవత్సరాలుగా మమ్మల్ని బానిసలుగా మార్చి, చిత్ర హింసలకు గురి చేసి, పశువులకన్నా హీనమైన బ్రతుకులు అనుభవించేలా చేసిన ఈ బ్రాహ్మణ ఆధిపత్యంపై, బదులు తీర్చుకోవడానికి ఈ రోజు వచ్చిన ఈ అవకాశాన్ని మేం వదులుకోము.. మీరు యుద్ధం చేయవద్దు, భయపడకుండా చూస్తూ ఉండు.. మా అఖరి రక్తం బొట్టు పోయేదాకా మేం పోరాడతాము” **

    అతని ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్య పడిన కేప్టన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.. ఆహారం, నీరు కూడా లేకుండా ఆ రోజు ఒక పగలు, ఒక రాత్రి 18 గంటలపాటు కొనసాగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు 28000 మంది పీష్వా సైన్యన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు.. శిద్దినాక్ చెప్పినట్టుగానే చావుకే భయం పుట్టించే విధంగా పోరాడిన మహర్ల ప్రతాపానికి, భీమా నది పీష్వాల రక్తంతో ఎర్రగా మారిపోయింది..

   పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శిద్దినాక్ నాయక్., తల లేని కొడుకు శవాన్ని వడిలో పెట్టుకుని పిచ్చివాడిలా ఏడుస్తూ, భయంతో వణికిపోయి, అందరూ పారిపోండంటూ అరిచాడు బాపు గోఖలే.. భయకంపితులైన పీష్వా సైన్యం, ఫూల్గావ్ లోని బాజీరావు శిభిరం వైపు పరుగులు తీయసాగారు.. వారిని భీమా నది దాటేదాకా తరిమి కొట్టింది మహర్ సైన్యం.. 23 మంది మహర్ వీరులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు..

   చరిత్రలో ఈ ఘఠనకు బ్రిటిష్ వారి ఆథిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో-మరాఠా యుద్ధంగా చెబుతారు ఈ మనువాద చరిత్రకారులు.. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది.. కానీ ఈ వీరత్వం నుండి స్పూర్తి పొంది, ఆ వీరుల వారసులు తమ శక్తి యుక్తులను గుర్తించి ఈ నీచ మనువాద బ్రాహ్మణత్వంపై తిరుగుబాటు చేస్తే.. తమ పరిస్థితి ఏమౌతుందో ముందే ఊహించి, తమకే పరిమితమైన చదువును అడ్డం పెట్టుకుని నిజమైన చరిత్రను పూర్తిగా నిర్విర్యం చేసి, వక్రీకరణ చేసిన అబద్ధాలను చరిత్రగా పొందుపరచబడ్డాయి..

    ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కొరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో “విజయస్తూపం” ఏర్పాటు చేసింది బ్రిటీషు ప్రభుత్వం., యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 23 మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్థూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది..

    తరువాత స్వతంత్రానికి ముందు ఈ బ్రాహ్మణ వ్యవస్థతో జరిగిన రహస్య అధికార బదిలీ ఒప్పందానికి తల వంచిన బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి అంటరాని వారిని సైన్యం, పోలీసు విభాగాలలో చేర్చుకోకూడదని 1927 లో నిర్ణయం తీసుకుంది… ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బాబాసాహెబ్  “ఇది పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర” అంటూ, విజయ స్థూపం వద్ద ప్రదర్శనకు పిలుపునివ్వడంతో దేశ నలుమూలల నుండీ లక్షలాది ప్రజలు హజరైయ్యారు..
  
    అప్పటి నుండీ చనిపోయేదాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న బాబాసాహెబ్ తప్పకుండా విజయ స్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారు.. బాబాసాహెబ్ తదనంతరం ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించే బాధ్యత తీసుకున్న “సమతా సైనిక్ దళ్” ఇప్పటికీ ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన వేల సంఖ్యలో హాజరై నివాళులు అర్పిస్తూ చరిత్రను కాపాడుకుంటూ వస్తుంది..

    @@మన చరిత్రను కాపాడుకోవడం మన బాధ్యత @@

— చావుకే వెన్నులో వణుకు పుట్టించిన మనం ఈ నాడు మన అక్క చెళ్ళెళ్ళను బట్టలు విప్పి ఊరేగించి ఊరంతా కలిసి అత్యాచారం చేసినా తిరిగి నోరెత్తడానికి భయపడుతున్నాం..,
— మన పిల్లలను ఇంట్లో బంధించి నిప్పు పెట్టినా ఏడుస్తూ కూర్చుంటున్నాం,
— మనకు ఇట్టమైన చదువులు చదివే స్థితిలో మనం లేము..
— మనకిష్టమైన బట్ట కట్టుకుని తిరిగే పరిస్థితిలో లేము..
— మనకు ఇష్టమైన తిండిని కూడా ధైర్యంగా తినలేకపోతున్నాం
— ఎంత ఆర్ధిక స్థితిమంతులం అయినా ఆత్మాభిమానం ప్రదర్శిస్తే దాడులు ఎదుర్కొంటున్నాం..
— శత్రువులతో చేతులు కలిపి మన మీద జరుగుతున్న దాడులను, ఆదాయ వనరులుగా, రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటూ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్న కోపర్టుల మన శక్తిని నిర్విర్యం చేస్తన్నా మనం వారికి జేజేలు కొడుతున్నాం..

“”””ఇంత అన్యాయాలకు గురై, న్యాయం చేయండి మహాప్రభో అని రోడ్డెక్కి దేబురించి అడుక్కుని, తన్నులు తినే నీచమైన హీన స్థితికి దిగజారడానికి కారణం ఎవరు?

… 40% మనువాద బ్రాహ్మణత్వ పెత్తందారులు అయితే, 60% మన స్వయంకృతాపరాధం కాదా??””””

    బాబాసాహెబ్ చేసిన త్యాగాల ద్వారా, మెరుగైన ఆర్థిక స్థితిని పొంది, ఆత్మాభిమానంతో కూడిన జీవితం పొందిన ఈనాటి సమాజం, తమ చరిత్రను తెలుసుకోకుండా, శతృ వ్వవస్థ పన్నిన ఉచ్చులో పడి.. కేవలం ఆటవిడుపులోనే ఆనందం వెతుక్కుంటూ మన పూర్వికులు మనకు సంపాదించి ఇచ్చిన ఆత్మాభిమానాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు..

    కొత్త సంవత్సరం పార్టీలు అంటూ మన చరిత్రను మననం చేసుకునే ఖాళీ కూడా లేకుండా క్లబ్., పబ్ లలో తాగి ఎగరడానికి తమ సమయం, డబ్బు వృధా చేస్తుకుంటూ ఉండడం మన జాతి దౌర్భాగ్యం..

ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం..
కొత్త సంవత్సరం సంబరాలు కాదు..
గర్వంగా విజయోత్సవాలు చేసుకుందాం..

$$$ ఆనందం అంటే ఆటవిడుపు కాదు..
ఆనందం అంటే ఆత్మాభిమానంతో బ్రతకడం..$$$

బహుజన హితాయ!!
బహుజన సుఖాయ!!

జై భీమ్ !! జై భారత్ !!

భీమ్ కొరెగావ్ విజయ దినోత్సవ శుభాకాంక్షలతో…
— సమత సైనిక్ దళ్ – సౌత్ ఇండియా

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: