Home » General » హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఆధునిక మనువు

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఆధునిక మనువు

Start here

Advertisements

 

ఇటీవల కాలంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్(ASA) కు చెందిన దొంత ప్రశాంత్

PhD ఎకనామిక్స్, రోహిత్ వేముల PhD సోషియాలజీ, చెముడుగుంట శేషయ్య PhD సోషల్ ఎక్ష్క్లూజన్ & ఇంక్లూజీవ్ పాలసీ,

పెద్దపూడి విజయ్ PhD పొలిటికల్ సైన్స్, సుంకన్న PhD ఫిలాసఫీ అయిన 5 గురు దళిత పరిశోధకులను బ్రాహ్మణీయ భావజాలంతో

యూనివర్సిటీ యాజమాన్యం కుట్ర పూరితంగా వీరికి ఆంక్షలతో కూడిన బహిష్కరణ విధించింది. వీరు జనసముహంలో తిరగవద్దనీ,

విద్యార్ధి ఎన్నికల్లో పాల్గొనవద్దని, విద్యార్ధి సామాజిక ఉద్యమాల్లో తిరగవద్దని, హాస్టల్స్ లో ఉండవద్దని అత్యంత అమానవీయంగా సాంఘీక

బహిష్కరణ చేయడం వెనుక దాగి ఉన్న కుట్రను గమనించాలి. నిరంతరం విద్యార్ధి ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ, అణగారిన వర్గాల

హక్కుల కోసం అను నిత్యం పోరాడుతున్న ఈ దళిత పరిశోధకులను సమిధలుగా చేసి, ఇక ముందు దళిత సంఘాలు దళితుల పక్షాన

పోరాడుతున్న విద్యార్థులను తీవ్రమైన భయబ్రాంతులకు గురిచేయడం ఈ కుట్రలో భాగం. తద్వారా భవిష్యత్తులో దళితుల గొంతును

సమూలంగా నొక్కేందుకు యూనివర్శిటీ యాజమాన్యం చేసున్న ప్రయత్నంలో భాగమిది.

గతంలో హైదరబాద్ విశ్వవిద్యాలయంలో అవినీతిని ప్రశ్నించినందుకు గాను 2002 సంవత్సరంలో పది మంది ASA దళిత

విద్యార్థులను అకారణంగా తోలగించిన విషయం అందరికి తెలిసిందే, బ్రాహ్మణ అగ్రహారంగా పేరు గాంచిన హైదరాబాద్ కేంద్రీయ

విశ్వవిద్యాలయంలో దళితులపై వివక్ష అనునిత్యం కొనసాగుతూనే ఉంది. 2013 లో కులవివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న

మాదారి వెంకటేష్ దళిత విద్యార్ధి విషయం మరువక ముందే మళ్ళి ఐదు మంది దళిత విద్యార్థులపై ఆంక్షలతో కూడిన భహిష్కరణ పేరుతొ

యూనివర్సిటీ యాజమన్యం తన కారుడు గట్టిన బ్రాహ్మణీయ భావజలం వారిపై విషం చిమ్మింది. 2002 మరియు 2015లో జరిగిన

ఘటనలకి కారణం అప్పటి చీఫ్ వార్డెన్ ఇప్పటి VC ఒక్కరే కావడం మరియు అప్పుడు, ఇప్పుడు కేంద్రంలోం BJP ప్రభుత్వ పాలన

కొనసాగడం గమనార్హం. అయితే ఈ సారి BJP మరో అడుగు ముందుకేసి “దళిత విద్యార్థులను దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా

కులవాదులుగా చిత్రీకరిస్తూ MHRD కి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాయడం, దానికి స్పందిస్తూ MHRD దళితులపై

చర్యలకు సిఫారసు చేస్తూ నాలుగు లేఖలు రాయడం” చూస్తుంటే దళితులను ఉన్నత విద్య నుండి దూరం చేయాలనే BJP కుట్ర ఎంత

బలంగా ఉందొ బహిర్గతమౌతుంది.

ప్రస్తుత బహిష్కరణకు కారణమైన సంఘటన

బహిష్కరణకు గల కారణాలను విశ్లేషిస్తే దీని వెనక బ్రాహ్మణీయ భావజాలానికి కొమ్ముగాసే BJP, RSS, VHP, BJYM

మొదలగు అరాచక శక్తుల హస్తం ప్రత్యక్షంగా ఉంది. ABVP HCU ప్రెసిడెంట్ రాష్ట్ర కమిటి సభ్యుడు అయిన సుశీల్ 2015 ఆగష్టు 3న

దళితులను దారుణంగా కించపరుస్తూ, వారిని అవమానిస్తూ “అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు గుండాలు” అంటూ ఫేస్ బుక్

లో రాశాడు. అలా రాయడానికి గల కారణాలను ఏమిటని వివరణ కోరగా ఢిల్లీలో ABVP “ముజఫర్ నగర్ అల్లర్లు” అనే డాక్యుమెంటరీ

అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఇక్కడ ASA విద్యార్థులు నిరసన కార్యక్రమం చేశారు కాబట్టి నేను అలా రాశాను అని సంజాయిషీ ఇచ్చాడు.

ఇదంతా యూనివర్సిటీ సెక్యూరిటీ ముందు జరిగింది.దళితులను అవమానిస్తూ గుండాలుగా చిత్రించినందుకు గాను వారి ముందే

క్షమాపణ చెప్పాలని కోరడంతో దానికి సుశీల్ క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడు.

ఇంతటితో సమస్య సర్దుమనిగింది అనుకుంటుండగా దళిత సంఘానికి క్షమాపణ చెప్పడాన్ని జీర్ణించుకోలేక, ఆ రాత్రే క్యాంపస్

బయట ఉన్న హాస్పిటల్ లో చేరి కొత్త నాటకానికి సుశీల్ తెరతీశాడు. తీవ్రవాదుల మద్దతుదారులు తనను కొట్టారంటూ అసత్య ప్రచారం

చేయడం ప్రారంభించాడు. భారతదేశంలో అమలౌతున్న ఉరిశిక్షకు వ్యతిరేకంగా 29-07-2015 నిరసన కార్యక్రమం చేపట్టిన ASA

విద్యార్థులను దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేని సుశీల్ కుమార్ సోదరుడు విష్ణుదత్

(BJYM సభ్యుడు) సహకారంతో BJP, RSS, VHP, BJYM నాయకులు వచ్చి యూనివర్సిటీలో భయానక వాతావరణం

సృష్టించాడు. ఇదే విషయమై BJP MLC రామచంద్ర రావు అంబేద్కర్ స్టూడెంట్స్ విద్యార్థులను యూనివర్సిటీ నుండి బహిష్కరించాలని

ఇక్కడి VC పై ఒత్తిడిని తీవ్రతరం చేశాడు. దీనికి తోడూ BJP MLA రాజసింగ్ యూనివర్సిటీలో చేసిన హడావిడి అంతాయింతా కాదు.

యూనివర్సిటీలో ఇంత గందరగోళ వాతావరణం సృష్టించిన సుశీల్ పై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ విషయాన్ని

యూనివర్సిటీ క్రమశిక్షణ బోర్డ్ (PROCTORAL BOARD ) కు పంపించారు. వారు మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటి ఆఫీసర్ నుండి

తీసుకున్న ఆధారాలను గ్రహించిన పిమ్మట 3-8-2015 నాడు సుశీల్ కుమార్ పై ఎటువంటి భౌతిక దాడులు జరగలేదని, అతడు

కావాలని ఫేస్ బుక్ లో రాశాడని దృవీకరిస్తూ, అతడికి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరిస్తూ నోటిసులు జారిచేశారు.

ఇందులో భాగంగా ఈ ఐదుగురు ASA విద్యార్థులకు కూడా నోటిసులు వచ్చాయి. ఇదిలా ఉండగా అకస్మాత్తుగా, ఎలాంటి ముందస్తు

సమాచారం ఇవ్వకుండా 31-8-2015న ఐదుగురు దళిత విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం వారిని ఒక సెమిస్టరు (ఆరు నెలలు)

మొత్తం యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్రజాస్వామికంగా, అన్యాయంగా, కుట్రపూరితంగా జరిగిన ఈ

సస్పెండ్ ను నిరసిస్తూ దళితులు యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని రెండు రోజులు ముట్టడించారు. దీనితో దిగివచ్చిన యాజమాన్యం

సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కొత్త కమిటిని వేసి మళ్ళీ మొదటి నుండి జరిగిన దానిని విచారిస్తామని హామీ ఇచ్చింది. విచారణ అనేది అటుంచితే

ఇంతలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ MHRD కి ASA విద్యార్థులు దేశద్రోహులు, సంఘవిద్రోహులు, కులాన్ని పెంచి

పోషిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తూ ఉత్తరం రాశారు. దానిని ఉటంకిస్తూ MHRD యూనివర్సిటీకి నాలుగు లేఖలు రాసింది.

MHRD ద్వారా నూతనంగా యూనివర్సిటీ VC గా నియకమైన ఆచార్య అప్పారావు (గతంలో 2002లో పది మంది దళిత

విద్యార్థులను బహిష్కరించడానికి కారకుడు) ABVP HCU మద్దతు దారుడు కావున హుట హుటిన EC (ఎగ్జీక్యూటివ్ కమిటీ )సబ్

కమిటి పేరుతొ ఎటువంటి విచారణ లేకుండానే ఈ 5 గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. వీరు నిరంతరం అంబేద్కర్ భావజాలాన్ని

అనునిత్యం ముందుకు తీసుకువెళుతూ రిజర్వేషన్, దళిత సమస్యల విషయంలో యాజమాన్యానికి కొరకరాని కొయ్యవలె అయ్యారని

భావించింది. దీనితో బ్రహ్మాణ భావజాలంతో ఉన్న దళిత వ్యతిరేకులైన ఆచార్యులతో కమిటి వేసి, కావాలని వీరు ఇక యూనివర్సిటీ లో

ఉండటం ఎంతవరకు సమంజసం కాదని వారు కోర్సు పూర్తి చేసేవరకు ఇక్కడ ఉండరాదని, సామాజిక బహిష్కరణ విధించింది. ఇక్కడే

దళితుల పరిస్థితి ఇలా ఉంటె ఇక ఊరులోని దళితుల గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా చూస్తుంటే అసలు మనము

విశ్వవిద్యాలయంలోనే ఉన్నామా? లేక అనాగరిక సమాజంలో ఉన్నామా? అనే ప్రశ్న వస్తుంది.

ఇంత అమానుషంగా, అప్రజాస్వామికంగా, హేయంగా దళితులపై హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న దాడులను,

బూటకపు కేసుల బనాయించడాన్ని నిరసిస్తూ, దళితులపై మతోన్మాద శక్తులు RSS, BJP, BJYM, VHP యొక్క కుట్రలను దాడులను

ఖండిస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులపై అమలౌతున్న సస్పెన్షన్ ఎత్తివేయాలని అన్ని దళిత, ప్రజాస్వామిక సంఘాలకు మరియు

దళితవ్యతిరేక BJP విధానాలను ఎండగట్టడానికి మీవంతు సహాయ, సహకారం అందించాలని కోరుతున్నాం…………….జై

భీం…………..

Joint Action Committee for Social Justices (UoH)

(Students’ Union 2015-16, ASA, BSF, DSU, JKSA, MSF, NSUI, OBCA, ORSSJ, PEHEL, SFI, SIO, TSF, TVV)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: