Home » General » స్వరాజ్యానంతరం బ్రాహ్మణమత పెత్తందారీ కులాలు యస్సీలకు తీరని ద్రోహం చేశారు- C R Shekar

స్వరాజ్యానంతరం బ్రాహ్మణమత పెత్తందారీ కులాలు యస్సీలకు తీరని ద్రోహం చేశారు- C R Shekar

Start here

Advertisements

Written by C R Shekar

స్వరాజ్యానంతరం బ్రాహ్మణమత పెత్తందారీ కులాలు యస్సీలకు తీరని ద్రోహం చేశారు.  దేశపు ఉమ్మడి సంపద అయిన భూమి, పరిశ్రమలు, ఖనిజ వనరులను తమకు మాత్రమే పరిమితం చేసుకొని యస్సీల నోట్లో మట్టిగొట్టారు.  యస్సీల పట్ల అమానుషమైన అస్పృశ్యతా వివక్షతను పాటిస్తున్నారు.  దాడులు చేస్తున్నారు.  హింసాకాండ జరుపుతున్నారు.  యస్సీ స్త్రీలపై పాశవిక అత్యాచారాలు జరుపుతున్నారు.  ఆత్మగౌరవం ప్రదర్శించిన యస్సీ కుటుంబాలపై మూకుమ్మడి దాడి జరిపి హత్యలు, మానభంగాలు, గృహహనాలకు పాల్పడుతున్నారు.  యస్సీ స్త్రీలను బట్టలూడదీసి నగ్నంగా వీధుల్లో ఊరేగిస్తూ, హిసిస్తూ అవమానిస్తున్నారు.  పెత్తందారీ కులాల ఆజ్ఞలను అతిక్రమించినా, వారు చెప్పే మురికి పనులు చేయడానికి కిరాకరించినా దౌర్జన్యాలకు దిగుతున్నారు.  గ్రామ బహిష్కరణలు చేస్తున్నారు.  యస్సీలను అంటరానివారిగా, అధములుగా, హీనులుగా, విలువలేని వారిగా పరిగనించి దూషిస్తున్నారు.  యస్సీలను తమ ఓట్లు తమకిష్టప్రకారం వేసుకోనివ్వటం లేదు.  తమకు నచ్చిన మతాన్ని ఆచరించనివ్వడంలేదు.  తమ మతాన్ని ప్రచారం చేసుకోనివ్వడం లేదు.  చివరకు తమకు అందుబాటులో ఉన్న పుష్టికర ఆహారాన్ని కూడా తిననివ్వడం లేదు.  అదేమంటే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు.

నగరాల్లో, పట్టణంలో కూడా పరిస్థితి గ్రామాలకంటే భిన్నంగా ఏమి లేదు.  యస్సీలకు ఇల్లు అద్దెకు ఇవ్వరు.  హిందువుల పండుగలకు, పబ్బాలకు బలవంతంగా చందాలు వసూలు చేస్తారు.  బొట్లు పెడతారు.  ఇంటి తలుపులకు హిందూ దేవుళ్ళ ఫోటోలు, స్లోగన్ల స్టిక్కర్లు అతికిస్తారు.  జయ శ్రీరాం, జయ గణేష్ అనాలని నిర్భందిస్తారు.

ఇక ఆఫీసుల్లో కనపరచే వివక్షతకూ, వేధింపులకు అడ్డూ అదుపు ఉండదు.  డైరెక్టుగా, ఇండైరెక్టుగా ఎన్ని రకాలుగా వీలయితే అన్ని రకాలుగా వివక్షత, వేధింపులు ఉంటాయి.  ఉద్యోగులు ప్రతి రోజూ ఏదో రకంగా అవమానాలకు, వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు.  ఇది ప్రతి యస్సీ ఉద్యోగికి అనుభవమే.

ఇన్ని అన్యాయాలు, అవమానాలు, హింస, హత్యాకాండ, స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నా, స్త్రీలను బట్టలూడదీసి నగ్నంగా బజారుల్లో ఊరేగించి అవమానిస్తున్నా మౌనంగా చేతులు కట్టుకొని ఎందుకు ఉంటున్నారు?   ఈ ఘోరాలను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఎందుకు తిరగబడటం లేదు?   అసమర్థులుగా తలవంచుకుని ఎందుకుంటున్నారు?

ధైర్యం లేకనా?   పౌరుషం లేకనా?   అసమర్థత వల్లనా?   పిరికితనం వల్లనా?

తమ పట్ల ఇన్ని రకాల దుర్మార్గాలు చేస్తున్నా మళ్ళీ ఈ పెత్తందారీ కులాల రాజకీయ పార్టీలకే ఎందుకు ఓట్లు వేస్తున్నారు?

సారా పాకెట్లూ, బిర్యానీ పాకెట్ల కోరకా?   ఓటుకు నోటుకు అమ్ముడుపోవడం వల్లనా?

యస్సీల ఈ విడ్డూర ప్రవర్తనకు కారణం ఏమిటి ?

స్వతంత్ర బ్రతుకుతెరువు లేకపోవడం:
—————————————————–

మనిషి బ్రతికేది ఎందుకోసం?  ఇందుకోసం అనే కరెక్టు సమాధానం సారస్వత అంగీకారం ఉన్న సమాధానం ఏదీ లేదు.  అయితే ప్రపంచంలోని ప్రజల్లో 90% మంది మాత్రం తిండి తినటానికే బ్రతుకుతున్నారనేది అంగీకరించడానికి ఇబ్బంది కలిగించే చేదు నిజం.

ఆకలి ఎంతవారినైనా ఎంతకైనా దిగజారుస్తుంది.  రాజర్షి, బ్రహ్మర్షి అని కీర్తించబడే విశ్వామిత్రుడే ఆకలికి తాళలేక కుక్క పేగులను తినవలసి వచ్చింది.  ఇక సాధారణ మానవులం మనం ఎంత.

యస్సీలకి నిలకడ కలిగిన స్వతంత్ర బృతుకుతెరువు ఏదీ లేదు.  అస్పృశ్యత వల్ల ఏ వృత్తి పడితే ఆ వృత్తి చేపట్టీ అవకాశం లేదు.  స్వయం ఉపాధి అవకాశాలన్నీ మూసివేయబడ్డాయి.  దేశ సంపద అంతా పెత్తందారీ కులాల వద్ద కేంద్రీకృతమై ఉంది.  యస్సీల బ్రతుకుతెరువుకు ఉన్న ఏకైక మార్గం ఒక్క కూలీ జీవితమే.  పెత్తందారీ కులాల వద్ద కూలీ చేయడం తప్ప యస్సీలకు మరో బ్రతుకుతెరువు మార్గం లేకుండా పోయింది.  దీనివల్ల యస్సీల బ్రతుకులు పెత్తందారీ కులాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిపోయింది.  పెత్తందారీ కులాల ఇష్టాయిష్టాల ప్రకారం యస్సీలు బ్రతకాల్సిన పరిస్థతి ఏర్పడింది.  పెత్తందారీ కులాలకు వ్యతిరేకంగా కానీ, వారి ఆజ్ఞలను అతిక్రమించి కానీ, వారు ఏర్పరచిన నిబంధనలను ఉల్లంఘించి కానీ యస్సీలు గ్రామాల్లో బ్రతకలేరు.  యస్సీలు గ్రామాల్లో బ్రతకాలంటే పెత్తందారి కులాలు చెప్పినట్లు నడచుకోవాలి, లేదా ఆకలితో చావనైనా చావాలి తప్ప మరో మార్గాంతరం లేదు.

సహాయ సహకార లేమి – రక్షణ లేమి :
—————————————————–

భారతదేశపు హిందూ గ్రామం ప్రాథమికంగా రెండు భాగాలుగా విభజితమై ఉంటుంది.  హిందువులు – అస్పృశ్యులు ( సవర్ణులు – అవర్ణులు) .  ఇందులో యస్సీలకు సహకరించేవారు, సమర్థించేవారు ఎవరూ లేరు.  గ్రామం అంతా ఒక వైపు ఉంటుంది.  యస్సీలు మాత్రం ఒకవైపు ఉంటారు.  అది కూడా ” మాల – మాదిగ ” లుగా శత్రువైరుధ్యాలతో.

పెత్తందారీ కులాలకు యస్సీలు ఏమాత్రం ఎదురు చెప్పినా, వారి ఆజ్ఞలను అతిక్రమించినా యస్సీలపై దాడులు జరుగుతాయి, హింసాకాండ జరుగుతుంది.  యస్సీలపై దొంగ కేసులు పెట్టి చెరసాల పాల్జేస్తారు.  అలంటి సమయాల్లో యస్సీల పక్షాన నిలబడేవారు, సహాయం చేసేవారు గ్రామం లోపలనుండి గానీ బయటనుండి గానీ యస్సీలకు లభింటం లేదు.

పోలీసులు, పోలీసు కేసులతో యస్సీలను భయభ్రంతులకు గురి చేసి, వారి మానసిక స్థ్థైర్యాన్ని దెబ్బతీసి పెత్తదారీ కులాలను ఎదిరించడానికి భయపడే భీరువులుగా, పిరికివారిగా మారుస్తున్నారు.  యస్సీలపై పోలీసులు పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టుల్లో 90% తప్పుడువే.  అయితే వాటిని ఎదిరించే శక్తి యస్సీలకు లేదు.  లాకప్పుల్లోని వారిని విడిపించుకునే శక్తి, అరెస్టు అయినవారికి బెయిలు తెచ్చుకునే శక్తి అలాంటి యంత్రాంగం ఏదీ యస్సీలకు లేకపోవడం వల్ల యస్సీలు కారాగారాల పాలవుతున్నారు.  ఇందులో వీరికి సహాయపడేవారు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల  యస్సీలు అధైర్యానికి లోనై పెత్తందారీ కులాల దురాగతాలను ఎదిరించలేక మౌనంగా భరించాల్సి వస్తున్నది.  నిస్సహాయులుగా తలవంచి బ్రతకాల్సి వస్తున్నది.

పెత్తందారీ కులాల రాజకీయ పార్టీలకు యస్సీలు ఎందుకు ఓట్లు వేస్తున్నారు?

పెత్రందారీ కులాలకు ఓటు వేయకపోతే ఇక ఆ గ్రామంలో బ్రతకడం సాధ్యం కాదు.  తెల్లవారి లేచిందగ్గర నుంచి పెత్తందారీ కులాల అండదండలు లేకుండా యస్సీలకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు.  Caste certificate, Income certificate, Ration card, Aadhar card, pension, bank loans, ఎరువులు, కౌలుకు భూమి, రుణమాఫి, ప్రభుత్వ పథకాలు, పోలీసు కేసుల నుండి రక్షణ, లాకప్పుల నుండి విడిపించడం, బెయిలు ఇప్పించడం ఇలా ప్రతి పని కూడా పెత్తందారీ కులాల అండదండలతొ ముడిపడి ఉన్నాయి.  కాబట్టి యస్సీలు తమకు ఇష్టం ఉన్నా, లేకున్నా పెత్తందారీ కులాల రాజకీయ పార్టీలకే ఓట్లు వేయాల్సి ఉంటుంది.

సమతా సైనిక దళ్ ఆవశ్యకత :
——————————————–

యస్సీ సమాజం తమ అస్పృశ్యతను తొలగించుకోవాలంటే, ఆత్మగౌరవంతో జీవించాలంటే వారు మొదట శక్తివంతం కావాల్సి వుంటుంది.  శక్తివంతం కావాలంటే ఎంఘటితం కావాల్సి వుంటుంది.  సంఘటితం కావాలంటే అంబేద్కరిజం అందుకోవాల్సి వుంటుంది.  అంబేద్కరిజం అందుకోవాలంటే ఆకలిని, భయాన్ని తొలగించుకోవాల్సి వుంటుంది.  ఆకలి, భయం తొలగాలంటే స్వయం ఉపాధి అవకాశాలు, శక్తివంతమైన సిద్ధాంత భూమిక నాయకత్వం కావాల్సి వుంటుంది.  అట్టి శక్తివంతమైన సిద్ధాంత భూమిక నాయకత్వాన్ని ” సమతా సైనిక దళ్ ” ఇస్తుంది.  అది స్వయం ఉపాధి సామర్థ్యాన్ని, ఆత్మగౌరవ శక్తిని కలిగిస్తుంది.

స్వయం ఉపాధి కల్పన – ఆర్థిక స్వావలంభన:
—————————————————————

ఈ దేశం మనది.  దేశ సంపద మనది.  కాబట్టి మన సంపదను మనం దక్కించుకోవాలి.  పెత్తందారీ కులాలు ఆక్రమించుకున్న భూమి, పరిశ్రమలు, ప్రధాన ఆర్థిక వనరుల్ని ఇప్పటికిప్పుడు పొందలేక ఫయినప్పటికి తర్వాత ఎప్పటికైనా పొందవచ్చు.

ఇప్పటికిప్పుడు మనకందుబాటులో వున్నవి, కోళ్ళ ఫారాలు, గొర్రెల మేకల పెంకం, పాడి పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, క్వారీలు, చిన్న చిన్న గనులు, ఇసుక, మట్టి లీజ్ లు, చేపలు, రొయ్యల సాగు ఇలా అనేక రకాల రెండవ రంగపు ఉపాధి కల్పన మార్గాలు ఉన్నాయి.

గ్రామాల్లోని యస్సీలను ఎడ్యుకేట్ చేసి సంఘటితపరచి ఈ స్వయం ఉపాధి పథకాలను ఉపయోగించుకోవడం ద్వారా కనీస ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు.  ప్రతి గ్రామంలోని యస్సీలు ఒక యూనిట్ గా ఏర్పడి ఈ పథకాలను కోఆపరేటివ్ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు.  పెట్టుబడిలో 5% మనం పెట్టుకుంటే మిగిలిన 95% Banks లేదా ప్రభుత్వం రుణసహాయం చేస్తుంది.  ఈ పథకాలను మనం సమర్థవంతంగా ఉపయోగించుకో గలిగితే ప్రతి యస్సీ కుటుంబం నెలకు 5 వేల నుండి 10 వేల వరకు సులభంగా సంపాదించవచ్చు.

ప్రతి గ్రామంలో కనీసం 10 నుండి 20 మంది వరకు Educated unemployees ఉంటారు.  వీరు ముందుకొచ్చి ఈ పథకాలను ఉపయోగింకోవడంలో యస్సీ సమాజానికి నాయకత్వం వహించినట్టయితే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.  అప్పుడు యస్సీ సమాజం బ్రతుకుతెరువు కొరకు పెత్తందారీ కులాల దయాదాక్షిన్యాలపై ఆధారపడాల్సిన దుర్గతి తప్పుతుంది.  స్వతంత్రంగా బ్రతకడంవల్ల తలెత్తుకుని తిరిగే ధైర్యం వస్తుంది.  ధైర్యం వల్ల శక్తి వస్తుంది.  దాంతో మనపై జరిగే అక్రమాలను ఎదిరించే శక్తిసామర్థ్యాలు కలుగుతాయి.

పోతే Banks అప్పులు ఇస్తాయా అన్నది సదేహం.  ఎందుకు ఇవ్వవు.  ఇవ్వాలి.  ఇచ్చితీరాలి.  అలా పొందటం మన హకగకు.  స్వాతంత్ర్య ఫలితాలు మనకేమిచ్చారు?   భూమి ఇచ్చారా?   పరిశ్రమలు ఇచ్చారా?   ఖనిజవనరులు ఇచ్చారా?   ఆర్థిక వనరులు ఏవైనా ఇచతచారా?   ఏమీ ఇవ్వలేదు.  మొత్తం పెత్తందారీ కులాలే కబళించాయి.

దేశ వార్షిక బడ్జెట్ దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు.  ఇందులో దాదాపు 25% రక్షణశాఖకు కేటాయిస్తున్నారు?  అంత అవసరమా?   కేవలం పాకిస్తాన్, చైనా లను సాకుగా చూపి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని బూడిదపాలు చేస్తున్నారు.  సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన కాలంలో పరిష్కారించలేకపోవడం వారి అసమర్థతకు గట్టి నిదర్శనం.  రక్షణశాఖలో రిజర్వేషన్లు లేవు.  రక్షణశాఖ కేటాయింపుల్లో 75% పెత్తందారీ కులాలే బొక్కేస్తున్నాయి.

బడ్జెట్ లో మరో అధిక కేటాయింపు Foreign debt.  ఇది కూడా దాదాపు బడ్జెట్ లో 25%. పెత్తందారీ కులాల విలాసాల కోసం, వారి దొంగ సంపదను దాచుకోవడం కోసం ఈ అప్పు ఏర్పడింది.  బంగారం, వజ్రాలు, పెట్రోలు, విలాసవస్తువుల దిగుమతుల వల్ల ఏర్పడిన అప్పు ఇది.  సామాన్యుల చెమట ఫలితాన్ని పెత్తందారీ కులాల సుఖసౌఖ్యాల కొరకు ఉపయోగించబడుతున్నది.

పెత్తందారీ కులాల పెట్టుబడిదారులకు, పారిశ్రమికవేత్తలకు, కార్పోరేట్లకు సాలీనా 5 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు, రాయితీల పేరుతో ముట్టజెప్పబడుతున్నది.  మరొ 2 లక్షల కోట్ల రూపాయలు tax మినహాయింపులతో దండుకుంటున్నారు.  మరో 2 లక్షల కోట్ల మేర పవర్, నీరు, భూమి, రోడ్లు, రవాణ పేర దోచిపెట్టబడుతున్నది.   SEZ ల పేర వేల ఎకరాల భూమి దోచిపెట్టబడుతున్నది.

ప్రభుత్వ రంగ Banks లో దేశ ప్రజలు deposit చేసిన మొత్తం 37 లక్షల కోట్లలో 27 లక్షల కోట్లు వీరికే అప్పుగా అప్పజెప్పబడింది.  అందులో దాదాపు 3 లక్షల కోట్లు రకరకాల పేర్లతో రుణమఫీ చేయబడుతున్నది.

ఇలా దేశ సంపదను 75% పెత్తందారీ కులాలకు దోచిపరడుతుంటే, ఎలాంటి బ్రతుకుతెరువు లేని మనకు రుణంగా మన వాటా మనకు ఎందుకు ఇవ్వరు?  ఏం ఈ దేసం మనది కాదా ?  దేశ సంపదలో మనకు హక్కు లేదా?   ఎలాంటి బ్రతుకుతెరువు మార్గం లేని మనం ఎలా బ్రతకాలి?  అందువల్ల మనకు రుణసహాయం ఖచ్చితంగా ఇవ్వాలి.  ఇస్తారు.

పోలీసుల నుండి రక్షణ :
—————————————–

ప్రతి కోర్టు వద్ద యస్సీలను లాకప్పుల నుండి విడిపించేందుకు, అరస్టు అయిన వారికి బెయిలు ఇప్పించేందుకు, వారి తరపున నమ్మకంగా వాదించే లాయర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల పోలీసు వేధింపుల నుండి యస్సీలను రక్షించుకోవచ్చును.  బాబాసాహెబ్ అభిమానులు, అంబేద్కరిస్టులు, యస్సీ శ్రేయోభిలాషులు న్యాయశీలురు లాయర్లలో, పోలీసుల్లొ కూడా వుంటారు.  అట్డివారిని గుర్తించి ఏర్పటు చేసుకోవడం వల్ల యస్సీ సమాజానికి రక్షణ కల్పించవచ్చు.  దీని వల్ల యసగసీలగలో ఆత్మస్థైర్యం పెరిగి ధైర్యంగా ఉంటాడు.

ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే ప్రతి గ్రామంలో ” సమతా సైనిక దళ్ ” శాఖను నర్మించవలసి ఉంటుంది.  దానివల్ల ప్రతి గ్రామంలో కూడా కనీసం 10 మంది సమతా సైనికులు ఏర్పడతారు.  తెలుగు రాష్ట్రాలలో మొత్తం 28293 గ్రామాలున్నాయి.  గ్రామానికి 10 మంది చొప్పున మొత్తం 2 లక్షల 82 వేల 9 వందల 30 మంది దమతా సైనికులు తయారవుతారు.  మండలానికి కనీసం 300 మంది, జిల్లాకు 15000 మంది సమతా సైనికులు సిద్ధంగా వుంటారు.  యస్సీ సమాజంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎల్ల వేళపా ఈ సైనికులు సిద్దంగా ఉంటారు.  దీనివల్ల మనపై ఈగ వాలటానికి కూడా జంకుతుంది.

ఏ యస్సీ ఉద్యోగికి అన్యాయం జరిగినా ఆదుకునేందుకు ప్రతి జిల్లాలో కూడా 15000 మంది సమతా సైనికులు ల, మండలంలోనైతే 300 మంది సమతా సైనికులు సిద్దంగా ఉండి ఆదుకుంటారు.

ఈ మహత్కార్యాన్ని సాధించడానికి మనకు పూర్తి కాలం పనిచేసే బోధకులు ( మాస్టర్స్) కావాలి.  మండలానికి ఒక ఫుల్ టైమర్ అవసరం అవుతాడు.  వారి భొజన, వసతి, ప్రయాణ ఖర్చులు భరించగలిగితే మనం వీరిని ఏర్పాటు చేసుకోవచ్చు.  వీరు గ్రామ గ్రామం తిరిగి ” సమతా సైనిక దళ్ ” శాఖను ఏర్పాటు చేస్తారు.  గ్రామాన్ని అంబేద్కరిజంతో ఎడ్యుకేట్ చేస్తారు.  స్వయం ఉపాధి పథకాలను వివరించి మన జనాన్ని ఆర్థిక స్వావపంబన దిశగా నడిపిస్తారు.  మన లక్ష్యం అంతా ఈ ఫుల్ టైమర్స్ పైనే ఆదారపడి ఉంది.

ఈ సమతా సైనిక దళ్ స్థాపనకు ఉద్యోగులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.  వారి ఆర్థిక, మేథా శక్తిలో 1% సమతా సైనిక దళ్ కు ఉపయోగించ గలిగితే దిగ్విజయంగా సమతా సైనిక దళ్ నిర్మాణమై యస్సీల సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగిస్తుంది.

క్రైస్తవమతానికి, బౌద్దమతసనికి, ఇస్లాం మతానికి, హిందూమతానికి పునాది ఫుల్ టైమర్స్.  కమ్యూనిజం నిలబడటానికి కాణమ ఫుల్టైమర్స్.అందువల్ల సమతా సైనిక దళ్ కూడా ఫుల్ట్ టైమర్స్ ను ఏర్పాటు చేసుకోవడం చారిత్రక అవసరం.  అందుకు ఉద్యోగులు అండగా నిలబడి బాబాసాహెబ్ ఆశయాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.

ఎప్పుడైతే స్వయం ఉపాధితో మన కాళ్ళపై మనం నిలబడతామో అప్పుడు మన ఓట్లను మనకే వేసుకుంటాము.  మనం 20% శాతంగా ఉన్నాం.  కేవలం 5% ఓట్లతో ప్రభుత్వాలు మారిపోతున్న ఈ కాలంలో గెలుపు, ఓటములను, ప్రభుత్వాలను నిర్ణయించే నిర్ణాయక శక్తిగా మనం ఏర్పడతాం.  అంటే రాజకీయ శక్తిగా మారటం అన్నమాట.  దానివల్ల బాబాసాహెబ్ ఆసయం అయిన అస్పృశ్యతా నిర్మూలన సాకారం అవుతుంది.

సమతా సైనిక దళ్ గ్రామ గ్రామాల్లో నిర్మించండి.

ఫుల్ టైమర్స్ ( మాస్టర్స్) ఏర్పాటు చేసుకునేమదుకు ఆర్థిక సహాయం సమతా సైనిక దళ్ కు అందించండి.

బాబాసాహెబ్ అభిమానులు, అంబేద్కరిస్టులు, యస్సీ శ్రేయోభిలాషులు ఈ మహోనగనత కార్యానికి తమ సహాయ సహకారాలు అందించగలరు.

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: