Home » General » దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటున్నారు. కాని యస్సీలకు స్వాతంత్ర్యం రాలేదు- CR Sekhar

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటున్నారు. కాని యస్సీలకు స్వాతంత్ర్యం రాలేదు- CR Sekhar

Start here

Advertisements

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటున్నారు. కాని యస్సీలకు స్వాతంత్ర్యం రాలేదు. దేశానికి స్వరాజ్యం వచ్చింది కాని ప్రజలకు స్వాతంత్ర్యం రాలేదు. అధికారం చేతులు మారిందే కాని ఆలోచనలో, ఆచరణలొ ఎలాంటి మార్పు రాలేదు. వేల సంవత్సరాలుగా పెత్తందారీ కులాలు ఏమి చేస్త్తూ వచ్చారో నేడు కూడా చేస్తున్నారు. ముస్లిం, బ్రిటిష్ పాలనలో కోల్పోయిన అధికారాలను, ఆస్తులను సంపాదించుకోడానికి పెత్తందారీ కులాలకు స్వాతంత్య్రం వచ్చింది. SC, ST, BC కులాలపై ఆధిపత్యం చెలాయించడానికి, పీడించడానికి, దోచుకోడానికి పెత్తందారీ కులాలకు స్వాతంత్ర్యం వచ్చింది. అన్యాయాలకు, అసమానతలకు, అవినీతికి పుట్టినిల్లయిన కులవ్యవస్థను, అస్పృశ్యతను అధికారికంగా కొనసాగించేందుకు పెత్తందారీ కులాలకు స్వాతంత్ర్యం వచ్చింది.

70 సంవత్సరాల స్వరాజ్య పాలనలో నేటికీ SC లలో 72% మందికి ఎలాంటి భూమి లేదు. యస్సీల్లో 86% మంది వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుచున్నారు. రోజుకు 75 రూపాయల లోపు సంపాదనతో జీవనం గడుపుతున్న SC లు 48%. దేశ సంపద అయిన భూమి, పరిశచ్రమలు, ఖనిజవనరులు, ప్రకృతి సంపద, ఆన్ని రకాల ఆర్థిక వనరులన్నిటిని పెత్తందారీ కులాలు కబళించి యస్సీలను అధమ స్థాయి చప్రాసి కొలువులకు, బండచాకిరి పనులకు, వ్యవసాయ కూలీపనులకు, పారిశుద్ధ్య పనులకు, దినసరి వేతన కార్మిక పనులకు పరిమితం చేయబడ్డారు. అస్పృశ్యులుగా పరిగణించి సామాజిక అధమత్వం అంటగట్టబడు తున్నది.

దేశంలోని సంపదనంతా పెత్తందారీ కులాలే పంచుకుంటూ యస్సీలకు మొండిచెయ్యి చూపించబడుతున్నది. ” ఓడరేవులు (ports) , గనులు ( mines) , చమురు క్ష్షేత్రాలు ( oil fields) , సహజ వాయువు క్షేత్రాలు ( gas fields) , నౌకానిర్మాణ కేంద్రాలు ( shipping companies) , ఔషధ తయారీ కంపెనీలు ( pharmasuetical companies) , పెట్రో కెమికల్ ప్లాంట్స్, అల్యూమినియం ప్లాంట్స్, టెలిఫోన్ నెట్ వర్క్, సెల్ ఫోన్ నెట్ వర్క్, టెలివిజన్ ఛానల్స్‌, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ సప్లై నెట్ వర్క్, schools and villages, మాల్స్, సెజ్ ( SEZ), ఫ్రెష్ ఫుడ్ outlets, textile and garment industries, ఆటోమొబైల్ కంపెనీస్, exports and imports, విచిధ రకాల ఉత్పత్తుల పరిశ్రమలు ఇలా దేశ, విదేశాలకు సంబంధించిన ఆర్థిక వనరులన్నిటిని తమ గుప్పిట్లో పెట్టుకొని యస్సీ సమాజాన్ని బికారులుగా, బానిసలుగా మార్చివేయ బడుతున్నారు.

1960 లో 20 బడాకంపెనీల ఆస్తులు రు. 312 కోట్లు. అవి 1980 నాటికి రు. 43828 కోట్లకు పెరిగాయి. 2014 నాటికి అవి 14 లక్షల 84 వేల 200 కోట్లకు పెరిగాయి. పెట్రోలు బంకుల్లో పనిచేసిన అంబానీలు నేడు భారతదేశంలోనే అత్యంత సంపన్నులుగా మారిపోయారు. ప్రపంచంలోని పేదల్లో మూడవ వంతు పేదలు మన దేశంలో ఉండగా అత్యధిక సంపన్నులున్న దేశాల జాబితాలో
భారతదేశం 4 వ స్థానంలో ఉన్నది.

ముఖేష్ అంబాని ఆస్తులు రు. 1,65,000 కోట్లు. దిలిప్ సంఘ్వి ఆస్తులు రు. 1,19,000. కోట్లు. అజీంప్రేంజీ ఆస్తులు రు. 1,05,000 కోట్లు. హిందుజా బ్రదర్స్ ఆస్తులు రు. 98,035 కోట్లు. పల్లోంజి మిస్త్రి ఆస్తులు రు. 97,372 కోట్లు. శివ నాడార్ ఆస్తులు రు. 85,449 కోట్లు. గోద్రెజ్ ఫ్యామిలి ఆస్తులు రు. 75,513 కోట్లు. లక్ష్మి మిట్టల్ ఆస్తులు రు. 74,188 కోట్లు. దూరస్థ పూనావాలా ఆస్తులు రు. 52,329 కోట్లు. కుమారమంగళం బిర్లా ఆస్తులు రు. 51,667 కోట్లు. గౌతమ అదాని ఆస్తులు రు. 44,020 కోట్లు. భారతదేశంలోని 100 మంది సంపన్నుల ఆస్తులు 372.2 బిలియన్ డాలర్లు అనగా దాదాపు రు. 25,05,400 కోట్లు.భారతదేశం వార్షిక బడ్జెట్ రు.17 – 18 లక్షల కోట్లు.

ప్రభుత్వం నుండి రాయితీలు, ప్రోత్సాహకాలు పొందిన ఈ పెత్తందారీ కులాల పారిశ్రామికవేత్తలు పన్నులు ఎగవేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం రు. 1400 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వం వీరికి సాలీనా రు. 5 లక్షల కోట్లు రాయితీలు పేరునా, మరో 5 లక్షల కోట్లు పన్నుల మినహాయింపు పేరునా కట్టబెడుతున్నది. ఇలా వీరు దేశ సంపదను, వనరులను కొల్లగొట్టడమే కాకుండా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న ధనాన్ని సైతం కొల్లగొడుతున్నారు. దేశ ప్రజలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో దాచుకున్న డిపాజిట్లు రు. 36,91,799 కోట్లు. ఇందులో నుండి పెత్తందారీ కులాలు తీసుకున్న రుణం రు. 27,03,811 కోట్లు. ఇందులో ఎగవేసిన మొండి బాకీలు రు. 5,45000 కోట్లు. వివిధ రకాల పేర్లతో బ్యాంకులచే మాఫీ చేయించుకున్న రుణం రు. 2,43,014 కోట్లు. 100 కోట్లు ఆపైన ఎగవేసిన కంపెనీలు 132 కు పైనే ఉన్నాయి. ఇక దేశరక్షణ పేరుతో సాలీనా రు. 5 లక్షల కోట్లు ఈ పెత్తందారీ కులాలు పంచుకుతింటున్నాయి. దీన్ని బట్టి దేశ సంపదను పెత్తందారీ కులాలు మన నోళ్ళు కొట్టి ఎలా పంచుకు తింటున్నాయో ఊహించండి.

దేశ సంపదలో ప్రభుత్వ ఉద్యోగాలు 2% మాత్రమే. అందులో SC రిజర్వేషన్లు 15%. అంటే దేశ సంపదలో యస్సీలకు దక్కుతున్నది 0.3% మాత్రమే. అంటే దేశ సంపదలో 98% సంపదలో మనకు వాటా దక్కడం లేదు. ఎంత అన్యాయం జరుగుతున్నదో ఆలోచించండి.

ఇక సామాజికంగా యస్సీలపై జరిగే అన్యాయాలకు, అసమానతలకు, అక్రమాలకు, అత్యాచారాలకు, దౌర్జన్యాలకు, దాడులకు, హింసాకాండకు అంతే లేదు. ” కారంచేడు, నీరుకొండ, తిమ్మసముద్రం, చుండిరి, వేంపెంట, ప్యాపిలి, పదిరికుప్పం, లక్ష్మీపేట ” లు ప్రత్యక్షసాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. చుండూరు మారణకాండపై కోర్టు తీర్పును బట్టి యస్సీల పట్ల ఏవిధమైన న్యాయం అనుసరించబడుతున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. నేటికీ తెలుగు రాష్ట్రాలలో యస్సీల పట్ల 120 రకాల వివక్షలు అమలుజరిపే బడుతున్నాయి.

ఈ దుస్థితికి కారణం ఏమిటి ?
————————————

ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, సగౌరవంగా జీవించడానికి, దేశ సంపదను ఉపయోగించుకోడానికి, పేదరికంలేని జీవితాన్ని గడపడానికి, సమాన అవకాశాలు పొందడానికి, అన్యాయాలకు, దోపిడీకి గురికాకుండా ఉండడానికి అవసరమైన రాజ్యాంగ హక్కులు, అవకాశాలు, విధానాలు, మార్గాలు మన రాజ్యాంగం నిర్మాత మహనీయుడు గౌరవనీయులైన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మనకు అందించాడు. అయితే మనం వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేక పోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది.

హిందూమత భావజాలాన్ని, హిందూమత సంస్కృతిని, హిందూ కులసంస్కృతిని, బ్రాహ్మణ భావజాలాన్ని గుడ్డిగా అనుసరించి అధఃపాతాళానికి పడిపోతున్నాము. హిందుత్వపు, కులతత్వపు మౌళిక లక్షణాలైన అసూయ, విద్వేషం, పరస్పర వైషమ్యం, కరడుకట్టిన స్వార్థపరత్వం, అమానుష మాత్సర్యం, సంకుచితత్వపు విషజ్వాలలను అంటించుకొని కాలిపోతున్నాము.

పెత్తందారీ కులాలు దొడ్డిదారిన హిందూమతాన్ని రుద్దుతున్నా మనం పట్టించుకోలేదు. కులవ్యవస్థను, కులథ్వాన్ని పెంచిపోషిస్తున్నా ప్రతిఘటించే ప్రయత్నం మనం చేయలేదు. అస్పృశ్యతను పాటిస్తున్నారు, అధికారికంగా అమలుపరుస్తున్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దేశ సంపదను మన నోళ్ళుగొట్టి దండుకుంటున్నా మనం నోరువిప్పి మా వాటా ఏమిటని ప్రశ్నించలేదు. దేశ సంపద భూమి, పరిశ్రమలు, ఖనిజ వనరులు, ప్రకృతి వనరులను జాతీయం చేయాలనే బాబాసాహెబ్ ఆశయాన్ని నీరుకారుస్తున్నా మావాటా ఏమిటని మనం నోరు విప్పలేదు. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశ సంపదను అమ్ములు తింటున్నారు మా వాటా ఏమిటని ప్రశ్నించలేదు. మన స్త్రీలపై అత్యాచారాలు, అవమానాలు చేస్తున్నా ఇదేమి అన్యాయం అని అడగలేదు. యస్సీ సమాజం దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నా నివారించే మార్గాలు వెదకలేదు. కనీసం ఓటు హక్కును కూడా సద్వినియోగం చేసుకోలేదు. దాని ఫలితమే ఈ దుస్థితి.

మన ఈ దుస్థికి కారణం హిందూమత పెత్తందారీ కులాలు విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి మన సమాజాన్ని మనమే మోసం చేసుకుంటున్నాను. అస్పృశ్యతను, అసమానతల్ని నిండిన కులాన్నివతలకెత్తుకొని మన బానిసత్వాన్ని మనమే కొని తెచ్చుకొంటున్నాము. బాబాసాహెబ్ మార్గాన్ని వదలి మనువాదం వెంట పరుగెడుతున్నాము. అంబేద్కరిజానికి వ్యతిరేకమైన తప్పుడు సిద్దాంతాలను, తప్పుఉడు సంస్థలను నమ్మి మోసపోతున్నాము. వ్యక్తిగత ప్రయోజనాలకు ఆశపడి అంబేద్కరిజానికి, స్వీయసమాజానికి వెన్నుపోటు పొడుచుకుంటూ కునారిల్లు యున్నాము.

స్వయం ఉపాధి సమర్థునిగా చేస్తుంది:
—————————————————-యస్సీల సమస్యలకుబప్రధాన కారణం స్వయం ఉపాధి లేకపోవడం. బ్రతుకుతెరువుకు పరులపై ఆధారపడటం. ఈ పరాధీనత యస్సీలను అసమర్థులుగా, హీనులుగా, దీనులుగా, పేదలుగా, అస్పృశ్యులుగా, బానిసలుగా చేసింది. స్వయం ఉపాధి మనిషిని శక్తిపరునిగా చేస్తుంది. ఆత్మవిశ్వాసం నింపుతుంది. గౌరవం కలిగిస్తుంది. పిరికితనం తొలగిస్తుంది. ఆత్మగౌరవం కలిగిస్తుంది. ధైర్యాన్నిస్తుంది. విద్యను, విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఐకమత్యం పెంచుతుంది. వివేకాన్ని కలిగిస్తుంది. కార్యశూరుణ్ణి చేస్తుంది.

అయితే పెత్తందారీ కులాల మనువాద పాలనలో ఒక్కసారిగా మనం ఆర్థిక, సాంఘిక, రాజకీయ అవకాశాలు సాధించడం అంత సులభంగా సాధ్యపడదు. అందుకు అవసరమైన అవకాశాలు, సాధనాసంపత్తులు, చాలినన్ని శక్తియుక్తులు, వనరులు మనం ఇంకా సమకూర్చుకోలేదు. కాబట్టి మొదట మనం శక్తిని సంపాదించుకోవాలి. శక్తి సాధనకు మనకున్న ఏకైక అవకాశం సంఘటిత మాత్రమే.

మనం మన పేదరికాన్ని వ్యక్తులుగా విడివిడిగా తొలగించుకోవడం కష్టసాధ్యమైన విషయం. సంఘటితత్వం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. యస్సీలలో దాదాపు ,95% జనానికి బ్రతుకుతెరువుకు సరిపడే భూమి లేదు. ఆస్తిపాస్తులు లేవు. ధనము లేదు. అధికారం లేదు. ఉద్యోగాలు లేవు. కేవలం కూలీ పనులతో జీవించాలి. అందువల్ల వీరు పరిశ్రమలు, కంపెనీలు పెట్టుకోలేరు. ప్రభుత్వ కాంట్రాక్టులు సంపాదించలేరు. వర్తక వాణిజ్యాలు చేసుకోలేరు. అందుకు అవసరమైన పెట్టుబడి, పలుకుబడి, విషయ పరిజ్ఞానం, రాజకీయ అండదండలు లేవు. కాబట్టి ఏ యస్సీ వ్యక్తి కూడా ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఈ పెత్తందారీ కులాల ప్రభుత్వాలలో సాధ్యపడే విషయం కాదు. యస్సీ వ్యక్తులకు సహాయ సహకారాలందించే వ్యక్తులు సమాజపరంగా కానీ, ప్రభుత్వపరంగా కానీ ఎవరూ లేరు. సహాయపడకపోగా ఏ యస్సీ వ్యక్తి కూడా పురోగమించిన కూడదనే మనుధర్మాన్ని సంఘటితంగావపాటించి యస్సీలను అణగదొక్కేస్తారు. కాబట్టివవ్యక్తులుగా యస్సీలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ, స్వాతంత్ర్యం, సమానత్వం, పురోగతి సాధించడం సాధ్యపడదు.

సమస్యకు పరిష్కారం సంఘటితశక్తి:
—————————————————

ఒకరు చేయలేని కార్యం ఇరువురు కలిసి సాధించవచ్చు. ఇరువురు చేయలేని కార్యాన్ని నలుగురు కలిసి చేయడం సాధ్యమవుతుంది. నలుగురు చేయలేని పని పదిమంది కలిసి చేయవచ్చు. పది మందికి సాధ్యం కాని పని వందమందితో సాధ్యమవుతుంది. వ్యక్తి ఒంటరిగా బలహీనుడు. సంఘటితంగా శక్తిపరుడు. వ్యక్తిని శక్తిగా మార్చేసి సంఘటిత.

యస్సీలు శక్తివంతులు కావాలంటే సంఘటితం కావాల్సి ఉంటుంది. శక్తి లేనిదే ప్రయోజనాల సాధన సాధ్యపడదు. శక్తికి మార్గం సంఘటితత్వం. కాబట్టి యస్సీలు సంఘటిత శక్తిగా మారటం అనేది చారిత్రక అవసరం. సంఘటిత శక్తి ద్వారా యస్సిఉలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవటమే సాధ్యపడుతుంది.

ఆర్థిక స్వావలంబన ద్వారా రాజకీయ శక్తిని, రాజకీయ శక్తి ద్వారా సాంఘిక సమానత్వం సాధ్యపడుతుంది. కాబట్టి యస్సీలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వం సాధించేందుకు సంఘటితం కాకతప్పదు.

సంఘటిత శక్తితో ఆర్థికశక్తి, సామాజికశక్తి, రాజకీయశక్తి లభిస్తాయి. వ్యక్తిగా విలువ దొరకనప్పటిికి సంఘంగా విలువ దొరకక తప్పదు. వ్యక్తిగా ప్రయోజనాలు లభించనప్పటికి సంఘంగా ప్రయోజనాలు లభించక తప్పదు.

ఉపాధి కల్పన:
———————-
తరతరాలు మన బ్రతుకులు కూలీ బ్రతుకులుగానే ముగుస్తున్నాయి. ఎంతవరకు ఇతరులకు సేవలు చేయడం, చేతులు కట్టుకుని నిలబఢంతోనే మన బ్రతుకులు ముగుస్తున్నాయి. పెత్తందారీ కులాలకు చేస్తున్న సేవలు, కష్టం, శ్రమ మనకొరకు మనం చేసుకున్నా ఈ పేదరికం తొలగుతుంది. అలా మనం ఎందుకు చేసుకోకూడదు? మన ఉపాధిని మనమే ఎందుకు కల్పించుకోకూడదు?

ఉపాధి కల్పనా మార్గాలు అనేకం ఉన్నాయి. కావలసింది అంతా పట్టుదల, దీక్ష, తెగువ, ధైర్యం, సంఘటిత మాత్రమే. సంఘటితశక్తితో మన ఉపాధిని మనమే సృష్టించుకోవచ్చు.

ఉదాహరణకు: 1. కోళ్ళ పెంపకం 2. మేకలు, గొర్రెల పెంకం 3. పాడి పరిశ్రమ 4. ఆవులు, గేదెల పెంపకం 5. ఇటుకల తయారు 6. క్వారీలు 7. చిన్నతరహా మైన్స్ 8. సున్నపు పొడి తయారు 9. సిమెంటు తయారు (కుటీర పరిశ్రమగా ) 10. సిమెంటు కంపెని 11. ఇసుక క్వారిలు 12. మెటల్ క్వారీలు 13. గ్రావెల్ క్వారీలు 14. చేపల, రొయ్యల పెంపకం 15. సామాజిక అడవుల పెంపకం 16. రెడీమేడ్ గార్మెంట్స్ 17. ప్రింటింగ్ ప్రెస్ యూనిట్స్ 18. కూరగాయల స్టాల్స్ 19. పాల బూత్స్ 20. కోఆపరేటివ్ బ్యాంక్స్.
ఇలా ఇంకా అనేక ఉపాధి కల్పన మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిని మనం ఎందుకు ఉపయోగించుకొని కూడదు? స్కూళ్ళు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేసుకో కూడదు? మన ఉద్యోగాలను మనం ఎందుకు సృష్టించుకొన్న కూడదు? కూలి బతుకు మాని మన కాళ్ళపై మనం ఎందుకు నిలబడకూడదు?

అంబేద్కరిజపు ఆచరణ సూత్రం :
———————————————-
అంబేద్కరిజపు ఆచరణ సూత్రం ” Educate – Agitate – Organize ” ( విజ్ఞానించు – ఉద్యమించి – వ్యవస్థీకరించిన).

Educate అంటే ప్రకృతికి మనిషికి, మనిషికి సమాజానికి, మనిషికి రాజ్యానికి, మనిషికి మనిషికి గల సంబంధాలను ఆధ్యనం చేయడం. సమస్యలను గుర్తించడం, కారణాలను పరిశీలించడం, పూర్వాపరాలను పరిశీలించడం, విషయసేకరణ చేయడం, అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, విశ్లేషించడం, పరిష్కార మార్గాలను కనుగొనడం.

Agitate అంటే వాస్తవాన్ని గుర్తించడం. తప్పును తప్పుగా, రైటును రైటుగా అంగీకరించడం. చెప్పడం, నిందించడం, నిలదీయడం, నిర్దేశించడం. ఏది తప్పో, ఏది రైటో వివరించడం, విశ్లేషించడం, నిరూపించడం, అమలుచేపించడం. అంతేకాని కర్రలు, కత్తులు, తుపాకులు పట్టుకొని యుద్దానికి దిగటం కాదు. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను, అన్యాయాన్ని అన్యాయంగాను న్యాయాన్ని న్యాయంగాను, మంచిని మంచిగా చెడును చెడుగా, దుర్మార్గాన్ని దుర్మార్గంగా, దన్మార్గాన్ని సన్మార్గంగా గుర్తించి నిందించి నిగ్గుతేల్చడం.

Organize అంటే ఇలా మంచిని, న్యాయాన్ని, సత్యాన్ని, సన్మార్గాన్ని, మానవత్వాన్ని నినదించేవారిని ఒక వ్యవస్థగా రూపొందించడం.

సమతా సైనిక దళ్ :
—————————–
బాబాసాహెబ్ స్థాపించిన ప్రధానమైన సంస్థ ఈ ” సమతా సైనిక దళ్ “. 1927 లో ఈ సంస్థను స్థాపించారు. బాబాసాహెబ్ జీవించినంతకాలం కాలం చాలా శక్తివంతంగా పనిచేసింది. నేడు బాబాసాహెబ్ భౌతికంగా లేకున్నా ఆయన సిద్దాంతాలు, తాత్వికత మనవెంట ఉండి మనలను ముందుకు నడిపిస్తున్నాయి. సమతా సైనిక దళ్ బాబాసాహెబ్ కు ప్రతిరూపం. అది అంబేద్కరిజానికి మాతృసంస్థ.

బాబాశహెబ్ సిద్దాంతాలను పరిరక్షించడం, ప్రచారం చేయడం సమతా సైనిక దళ్ ప్రధాన లక్ష్యం. అస్పృశ్యతా నిర్మూలన ప్రథమ కర్తవ్యం. యస్సీల ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులను పరిరక్షించి వారని సగౌరవంగా పౌరులుగా రూపొందించడం దాని బాధ్యత. యస్సీలను చైతన్యవంతులుగా, వివేకపరులుగా, ఆత్మగౌరవ వ్యక్తులుగా నిలపడం దాని లక్ష్యం.

మన అస్పృశ్యత అంతమవ్వాలంటే, పేదరికం తొలగాలంటే, అధమత్వం, అన్యాయం, అవమానం, దాడులు, దమనకాండలు ఆగిపోవాలంటే మనమంతా ” సమతా సైనిక దళ్ ” సైనికులుగా మారాలి. సంఘటిత శక్తిగా మారాలి. అందుకు ప్రతి గ్రామంలో ” సమతా సైనిక దళ్ ” శాఖ ఏర్పాటు కావాలి. అవి మహా సముద్రంగా, మహొన్నత శక్తిగా మారాలి.

” సమతా సైనిక దళ్ ” ఆత్మగౌరవం కనిగించే రాజగృహంలో.
” సమతా సైనిక దళ్ ” ఆర్థిక సామర్థ్యం కలిగించే పెన్నిధి.
” సమతా సైనిక దళ్ % అస్పృశ్యతను ఖండించే వజ్రాయుధం.
” సమతా సైనిక దళ్ ” విజ్ఞాన శిఖరం.
బాబాసాహెబ్ మాట ” సమతా సైనిక దళ్ ” బాట.

——————————————————-

సమతా సైనిక. దళ్ — సౌత్ ఇండియా

CR. Sekhar
9010037741

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: