Home » General » Donate books for Samata Sainik Dal library! 

Donate books for Samata Sainik Dal library! 

Start here

Advertisements

✿✿ సమత సైనిక్ దళ్ – సమత లైబ్రరీ – “Book” Donation Campaign ✿✿     అంబేద్కరిస్టు ఉద్యమాలలో మొదటి మరియు అతి ముఖ్యమైన అంశం.. Educate (విజ్ఞానించడం).. దీనికి ముఖ్యంగా సిద్ధాంత బోధకులు, ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకుంటూ ప్రజలకు అందిస్తూ ఉండాలి.. 

✿ Educate చేయాల్సిన అవసరం ఏమిటి ✿

    ఈనాటి మన విద్యావిధానాన్ని గమనిస్తే, 

– పక్కవాడిని చూడకుండా రైల్వే రిజర్వేషన్ ఫారం నింపలేని పోస్ట్ గ్రాడ్యుయేట్లు కనిపిస్తారు.

– చెక్కు మీద అంకెలు ఎక్కడ వేయాలో, మొత్తం ఎక్కడ రాయాలో తెలియని బిజినెస్ మేనేజ్మెంటు స్కాలర్లు కనిపిస్తారు

– వ్యాధులు నయం చేయమని గుళ్ళు చర్చీల చుట్టూ తిరిగే వైద్యులు కనిపిస్తారు..

– జరగబోయే Space Craft Launch కి విజయం లభించాలని యజ్ఞాలు చేయించే రాకెట్ సైంటిస్టులు కనిపిస్తారు..

    దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏమిటంటే, ఈ విద్య అనేది కేవలం పొట్ట నింపుకునేందుకు ఆధారంగా మాత్రమే చూడబడుతుంది., కానీ వ్యక్తిత్వ వికాసానికి తద్వారా సామాజిక వికాసానికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు..

✿ పీడిత కులాలు – విద్యా విధానం ✿ 

      ఇక పీడిత కులాలకు ఈ విద్యా వ్యవస్థ అత్యంత అన్యాయం చేస్తుంది .. కేవలం దోపిడీ కులాల పరిశ్రమలు, సంస్థలలో పనిచేయడానికి కావలసిన కూలీలను తయారు చేయడానికి మాత్రమే విద్యా విధానాలు రూపొందించబడ్డాయి.. డిగ్రీలు, పీజీలు చేసి కూడా పొలం పనులకు, తాపీ పనులకూ వెళ్ళవలసి వస్తున్న దయనీయ స్థితిని మనం రోజూ చూస్తూనే ఉన్నాం..

      వేల సంవత్సరాలుగా విద్యకు దూరంగా ఉంచబడి, ఇప్పుడు ఈ రకంగా బుద్ధి వికాసానికి అవకాశం లేని మూస విద్యను మాత్రమే అందుబాటులో ఉంచుతుండడం వలన పీడిత కులాల నుండి “చదువుకున్న కూలీలు” మాత్రమే తప్ప నాయకులు మేధావులు తయారు కావడం లేదు.. 

✿ నిజమైన విద్య – విజ్ఞానీకరణ ✿

      స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అగమ్య గోచరంగా ఉన్న పీడిత కులాల భవిష్యత్తుకు ఒక బాట వేయాలంటే ఆ సమాజం నుండి మేధావులను తయారు చేయడమే అసలైన పరిష్కారం.. సమాజిక అంశాలకు, చారిత్రక అవగాహన మేళవించి., శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేయగల సమర్థులను తయారు చేసుకోవడం ఇప్పుడు పీడిత కులాలకు అత్యవసరం.. 

     దీనికి విస్తృతమైన అధ్యయనం అవసరం.. భారతీయ సమాజంలోని ప్రతి సిద్ధాంతం మీద, ప్రతి వ్యవస్థ మీద విస్తారమైన జ్ఞానం కలిగి ఉండాలి., 

     ఇది పుస్తక పఠనంతోనే సాధ్యం.. 

✿ పుస్తకం – చదివి దాచుకోవాలా ?? చదువు పంచాలా ✿

      “ఇది చదివి దాచుకోవాల్సిన పుస్తకం” ఈ మధ్య విరివిగా కనిపించే శీర్షిక.. నిజానికి విజ్ఞాన భాండాగారాలు అయినటువంటి పుస్తకాలను దాచుకోవడం అన్యాయం. స్వయం వికాసం నుండి సామాజిక వికాసం వైపు అడుగేయాలంటే, మనం చదివేసిన పుస్తకాలను కేవలం మన అల్మిరాలకే పరిమితం చేయకుండా, వాటిని నలుగురికీ అందుబాటులో ఉంచడం అవసరం..

     “పంచుకుంటే పెరిగే ఒకే ఒక్క సంపద విద్యే”

✿ సమత లైబ్రరీ – Book Donation Campaign ✿

     సామాజిక వికాసానికి కావాల్సిన అధ్యయనంలో ఈ పుస్తకం పాత్రను గుర్తించిన “సమత సైనిక్ దళ్ – సౌత్ ఇండియా” తన హైదరాబాద్ కార్యాలయంలో “సమత లైబ్రరీ”ని ఏర్పాటు చేస్తుంది.. ఈ లైబ్రరీలను త్వరలో ఏర్పాటు కాబోతున్న జిల్లా శాఖలకు కూడా విస్తరించడం జరుగుతుంది.. ఈ “సమత లైబ్రరీలు” గ్రామస్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా పీడిత కులాలకు సామాజిక అంశాలపైన అధ్యయనం చేసే అవకాశం అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.. అందుకోసం కావలసిన పుస్తకాల సేకరణకు ఈ “Book Donation Campaign” రూపొందించబడినది..

     ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకోవడం ఏమనగా..

☞ మీరు చదవడం పూర్తి చేసిన, మీకు ఇకపై ఉపయోగపడని పుస్తకాలను మాకు పంపండి.

☞ మీ దగ్గర ఒకటికంటే ఎక్కువ కాపీలు గనుక ఉంటే మాకు పంపండి..

☞ బైబిల్, ఖురాన్, భగవద్గీత, పురాణాలు, రామాయణం – భారతం, మరే మతగ్రంథాలైనా సరే, హేతువాద నాస్తిక సిద్ధాంత పరమైన గ్రంథాలైనా సరే., పంపించండి 

☞ కమ్యూనిస్టు సాహిత్యం, రాజ్యాధికార సిద్ధాంతం, మూలనివాసీ సిద్ధాంతం, హైందవ రాజకీయ సిద్ధాంతం ఇలా ఏ అంశానికి సంబంధించిన పుస్తకాలైనా పర్లేదు.. మాకు పంపండి..

☞ వ్యక్తిత్వ వికాసం, ఆర్థిక శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అంశాలపైన రచనలైనా కూడా తప్పక పంపండి..

☞ కథలు, నవలలు మరేదైనా time pass సాహిత్యం మాత్రం తప్ప మరే ఇతర సామాజిక అంశాలపై రాయబడిన పుస్తకం అయినా సరే పంపగలరు..

☞ పాత పుస్తకాలు కాకుండా కొత్త పుస్తకాలు కొని పంపడానికి కూడా ముందుకు వస్తే సంతోషపూర్వక ధన్యవాదాలు.

☞☞ మీరు పంపే పుస్తకాలను సమత లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది., ఒక పుస్తకం ఎక్కువ కాపీలు ఉంటే వాటిని గ్రామ సందర్శనలకు వెళుతున్న సమత సైనికులు ఆయా గ్రామాలలో ఆసక్తి గలవారికి ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుంది..☜☜

✌ బాబాసాహెబ్ ప్రబోధించిన ఉద్యమ క్రమంలో “Educate” అనే అంశంలో మీ అందరి బాధ్యతాపూర్వకమైన తోడ్పాటు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకురండి.. మన పీడిత కూలాల సమాజాన్ని మేధావి సమాజంగా తీర్చిదిద్దడంతో మన వంతు పాత్ర పోషిద్దాం ✌

పుస్తకాలు పంపవలసిన చిరునామా:-

పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ & సమతా సైనిక్ దళ్ కార్యాలయం

House No : 1/11/252/E, 

సెకండ్ ప్లోర్ – 202 , అర్చన అపార్టుమెంట్సు,

షాపర్స్ స్టాఫ్ ప్రక్క విధి, 

బేగంపేట్, 

హైదరాబాద్..

Pincode – 500016

Samata Sainik Dal Office

1-11-252/1/E, Flat # 202, Archana Apartments, Adjacent lane Shoppers Stop, Begumpet, Hyderabad – 500016

సంప్రదించవలసిన నంబర్లు:-

CR Sekhar – 90100 37741

Kamatam Venu – 99891 62622

Mail ur suggestions at– ssd.southindia@gmail.com

ముఖ్య గమనిక :- మీరు పంపే ప్రతి పుస్తకంలోని మొదటి పేజీలో మీ పేరు, మీ వివరాలు (కుదిరినవి మాత్రమే) తో పాటు., ఆ పుస్తకం చదివేవారిని ఉత్సాహపరిచే విధంగా ఒక అమూల్యమైన సందేశం రాయగలరు.

బహుజన హితాయ.!!

బహుజన సుఖాయ.!!

జై భీమ్.!! జై భారత్.!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: