Home » General » ఈ దురాచారానికి అంతమెప్పుడు..?అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న బసివిని వ్యవస్థ

ఈ దురాచారానికి అంతమెప్పుడు..?అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న బసివిని వ్యవస్థ

Start here

Advertisements

ఈ దురాచారానికి అంతమెప్పుడు..?
అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న బసివిని వ్యవస్థ- సాంప్రదాయం ముసుగులో అణిచివేత 

– అరాచక శక్తుల కింద నలుగుతున్న దళిత మహిళలు

బడికి వెళదామంటే తండ్రి ఎవరో తెలియదు. వెళ్లినా వ్యవస్థ చిన్న చూపు చూస్తుంది. ఎవ్వరికైనా చెబుదామంటే వినేవారు లేరు. ప్రభుత్వమైనా ఆదుకుంటుందనుకుంటే పట్టించుకున్న పాపానా పోలేదు. అనేక సమస్యల నడుమ బసివినీ, దేవదాసి వ్యవస్థలోని దళిత మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కణేకల్‌ ప్రాంతంలో ఒక బసివినికి పుట్టిన 12 ఏళ్ల మూగ బాలికను ఆ గ్రామంలోని పెద్దలు బలవంతంగా బసివినీగా మార్చారు. మహిళల సంరక్షణ కోసం దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా దురాచారాలను నివారించలేక పోతున్నారు. ఇప్పటికైనా దురాచారాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది.

అనాదిగా అగ్రవర్ణాల చేతిలో దళితులు అణిచివేతకు గురవుతున్నారు. ప్రధానంగా సాంప్రదాయ ముసుగులో దళిత మహిళలను బసివినీలుగా మార్చుతున్నారు. ఫలితంగా సమాజంలో దళిత మహిళలు తీవ్ర క్షోభను అనుభవి స్తున్నారు. దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఈ వ్యవస్థ వుంది. ఆ కాలంలోనే ఈ వ్యవస్థను రూపుమాపటానికి దేవదాసి నిరోధక చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరినీ బసివినీ, దేవదాసినిలుగా మార్చకూడదు. అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో అట్టడుగు వర్గాల్లోని స్త్రీలను ఆసాముల కామానికి మాతాంగినులుగా, జోగినులుగా, బసివినీలుగా బలిచేస్తున్నారు. 1988లో ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన జోగిన వ్యవస్థ నిర్మూలన చట్టం ఈ వ్యవస్థలో పలు మార్పులును తెచ్చింది. ప్రధానంగా కన్నడ ప్రాంతాలలో ఈ వ్యవస్థ వేళ్లానుకుని వుంది. అనంతపురం జిల్లాలోనూ రాయదుర్గం, డీ.హీరేహల్‌, బ్రహ్మసముద్రం, కణేకల్‌, మడకశిర, రొద్దం, అమరాపురం పలు ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో బసివినీలు ఉన్నారు. అనంతపురం జిల్లాలోనే రెండు వేలమంది ఉన్నట్లు అధికారిక లెక్కలు. అయితే అనధికారికంగా ఐదు వేల మంది ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్ష మంది ఈ వ్యవస్థలో మగ్గుతున్నారు. గ్రామాల్లోని పెత్తందార్ల కారణంగా నిరాధరణకు గురయిన ఆడబిడ్డలు చిన్ననాడే బసివినీలుగా మారుతున్నారు. మగదిక్కు లేక పడుపు స్త్రీలుగా సమాజంలో హీనంగా చూడబడుతున్నారు. ప్రభుత్వం వారికి గుర్తింపుతో పాటు, జీవనోపాధి, పక్కా ఇల్లు, పింఛన్లు, సాగుభూమి మంజూరు చేయాల్సి వుంది. వారి పిల్లలకు మంచివిద్య అందించటంతో పాటు రిజర్వేషన్‌ను కల్పించాల్సిన అవసరం వుంది. సబ్సిడీ రుణాలు, బస్సు, రైలు ప్రయాణ రాయితీలు అందించాల్సి వుంది. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా వారికి సరయిన సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు. 

మూల కారణాలు…

సమాజంలో ఈ వ్యవస్థ ఉత్పన్నం కావటానికి ప్రధానంగా నిరక్షరాస్యత, ఆర్థిక అస మానతలే ప్రధానం. నాటి కాలంలో నెలకొన్న ఈ అసమానతలను అనుకూలంగా మార్చుకున్న పెత్తందారులు తమ స్వార్థం కోసం ఈ వ్యవస్థను సృష్టించారు. దీనిపై ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సి వుంది. దళిత మహిళల సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలోనే రాష్ట్రంలో జోగిని, దేవదాసి, మాతంగి, బసివిని మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ వి.రాఘవరావుతో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. దాని ప్రకారం ప్రధానంగా ప్రభుత్వం విద్య, ఉపాధి, వృత్తి పరమైన శిక్షణ కల్పించాల్సి ఉంది. ఈ వ్యవస్థలో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాల్సి వుంది. ఎవరో కట్టిన తాళిని తీసేయించి సాధారణ మహిళల వలే పెళ్లి, కుటుంబం వంటివి ఏర్పాటు చేయాలి. జోగినుల సంక్షేమం కోసం, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పింఛన్లు ఇవ్వాలి. తండ్రి పేరు తెలియని వారికి సరైన గుర్తింపు ఇవ్వా ల్సి వుంది. ఊరి పెత్తందారులను బాధ్యులను చేస్తూ చట్టంలో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. 

ఆదుకునే వారు లేరు 

బసివినిలను, వారి పిల్లలను సమాజంలో ప్రతి ఒక్కరు చిన్నచూపు చూస్తున్నారు. 12 ఏళ్లలోపు బసివినీగా మారాను. ఆర్థికంగా వెనుక బడడంతో కుటుంబం గడవని పరిస్థితి. అప్పటి నుండి ఎంతో మంది స్వార్థంతో వాడుకున్నారే తప్ప ఆదుకునే వారు ఎవరు లేరు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పాప ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్నది. అబ్బాయిని ఆర్థిక పరిస్థితితుల రిత్యా చదువు మాన్పించి డ్రైవర్‌ను చేశాను. ప్రస్తుతం తాను మూడు వేలకు ఓ ప్రవేటు సంస్థలో పనిచేస్తున్నాను. ఇక బసివినిగా నేటికి కొందరు తనను వాడుకుంటూ వారి కోర్కెలను తీర్చుకుని కొంత డబ్బు ఇస్తారు. అదే జీవనాధారంగా కుటుంబం నడుస్తున్నది. తమ పిల్లల భవిష్యత్తునైనా కాపాడుకునేందుకు ప్రభుత్వం ఆదుకోవాలి. మీనాక్షి ఉద్దేహల్‌

తండ్రి లేడని చెప్పా…

నేను 12 ఏళ్ల నాడే దేవదాసిగా మారాను. నా పిల్లల పరిస్థితి అలా కాకుండా చూడాలని బడిలో చేర్చించడానికి వెళితే అక్కడ తండ్రి పేరు అడిగారు. తండ్రి లేరని చెప్పాను. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకుడదనుకున్నాను. ప్రభుత్వం మాలాంటి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే జీవితంలో నిలదొక్కుకుంటాం. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఎవ్వరు మమ్ములను ఆదుకుంటారు.

కూళికెళ్లి జీవనం సాగిస్తున్నాను. ఉన్న ఇద్దరు పిల్లలను బాగా చదివించి పెళ్లి చేయాలనుకున్నాను. ఇద్దరు కుమార్తెలున్న నేను వారి సంరక్షణ కోసం ఎంతో మదనపడుతున్నాను. ప్రభుత్వం తమ అవసరాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: